బెల్లంకొండ శ్రీనివాస్ `సీత‌` టీజ‌ర్ విడుద‌ల‌

0
436

యువ‌క‌థానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్ట‌ర్ తేజ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `సీత‌` కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మ‌న్నారా చోప్రా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుద‌ల చేయ‌బోతున్నారు. విజ‌య‌వాడ‌లోని వి.ఆర్‌.సిద్ధార్థ ఇంజ‌నీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ సినిమాను టీజ‌ర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఈ వేడుక‌లో 35000 స్టూడెంట్స్ పాల్గొన‌డం విశేషం.

ఈ ఫంక్ష‌న్‌లో బెల్లంకొండ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ స్ట‌న్నింగ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ .. అనూప్ రూబెన్స్ లైవ్ పెర్ఫామెన్స్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచాయి. ఈ ఫంక్ష‌న్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, తేజ‌, అనీల్ సుంక‌ర‌, కిషోర్ గ‌రిక‌పాటి, పాయ‌ల్ రాజ్‌పుత్‌, అనూప్ రూబెన్స్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. యూనిట్ స‌భ్యులంద‌రూ `సీత‌` స‌క్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

http://industryhit.com/t/2019/03/sita-bellamkonda-srinivas-kajal-agarwal-teaser-launch-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here