ప్రేమ‌క‌థాచిత్రం-2 మొద‌టి చిత్రానికి పర్ఫెక్ట్ సీక్వెల్ లా ఉంటుంది – హీరోయిన్ సిద్దీ ఇద్నాని

0
533

ఆర్.పి.ఏ క్రియేష‌న్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి సార‌థ్యంలో తెర‌కెక్కిన హార‌ర్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2. గ‌తంలో ఇదే బ్యాన‌ర్ లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి, హార‌ర్ కామెడీ సినిమాల‌కు తెలుగునాట ట్రెండ్ క్రియేట్ చేసిన ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ కు సీక్వెల్ గా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 రెడీ అయింది. ఈ చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌, నందితా శ్వేత, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఏప్రిల్ 6 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడదలవుతున్న సందర్భంగా హీరోయిన్ సిద్దీఇద్నాని ఇంటర్వ్యూ..

ఈ అవకాశం ఎలా వచ్చింది?

– దర్శకుడు హరి కిషన్ ఇటీవల నేను నటించిన జంబ‌ల‌కిడిపంబ సినిమా ప్ర‌మోష‌న్ సాంగ్ చూసి ఆయ‌న‌కి న‌చ్చి నాకు యాక్టింగ్ బాగా వ‌చ్చు అని ఆయ‌న ఒక క్లారిటీకి వ‌చ్చాక ప్రొడ్యూస‌ర్ సుదర్శన్ రెడ్డి ద్వారా న‌న్ను సంప్ర‌దించారు. నా ఆడిష‌న్ ఏమీ తీసుకోకుండానే నాకు క‌థ నరేష‌న్ చెప్పారు. నాకు కూడా కథ, నా క్యారెక్టర్ ఓకే అవడంతో ఈ ప్రాజెక్ట్ ఒకే అయ్యింది.

సినిమాలో మీ క్యారెక్టర్ గురించి?

– నా మొదటి సినిమాలో నేను ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్ చేశాను దానికి మంచి అప్లాజ్ వచ్చింది అయితే ప్రేమ‌క‌థాచిత్రం-2 ఈ సినిమా నా కెరీయ‌ర్‌లో నాకు చాలా ఇంపార్టెంట్‌. జంప‌ల‌కిడిపంబ చేసిన త‌ర్వాత నాకు ఈ ఆఫ‌ర్ వ‌చ్చింది. ఈ చిత్రంలో నా క్యారెక్ట‌ర్ పేరు బిందు. కాలేజ్‌కి వెళ్ళే ఒక పొగ‌రుబోతు అమ్మాయి క్యారెక్ట‌ర్. ఎంత పొగ‌రంటే సినిమాలో నేను ఒక అబ్బాయిని ఇష్ట‌ప‌డితే త‌ను నో చెపితే త‌న‌ను ఏదైనా చేసేంత‌. నా మొద‌టి సినిమాకి చాలా డిఫ‌రెంట్‌గా ఉండి అటు నటనకు, గ్లామర్ కు మంచి అవకాశం ఉంటుంది.

ప్రేమకథా చిత్రమ్ సినిమా చూశారా?

– చూశానండీ. ఆ సినిమాలో సుధీర్‌బాబు క్యారెక్ట‌ర్‌కి కంటిన్యూష‌న్ గా సుమంత్ అశ్విన్ క్యారెక్ట‌ర్‌ ఉంటుంది. మొద‌టి చిత్రానికి పర్ఫెక్ట్ సీక్వెల్ లా ఈ సినిమా ఉంటుంది.అయితే కథ పరంగా రెండు విభిననమైన చిత్రాలు.

ఈ సినిమాలో దెయ్యం ఎవ‌రు?

– ఈ సినిమాలో దెయ్యం ఎవరు అనేది మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.కానీ ఈ సినిమాలో ట్రైలర్ లో చూపించని మరో ఎలిమెంట్ ఉంది దానికి ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు.

వర్క్ ప్రజర్ ఏమైనా ఫీల్ అయ్యారా?

– క‌ష్టం… అంటే… మొద‌టి పార్ట్ చాలా పెద్ద హిట్ అయింది. కాబ‌ట్టి రెండో పార్ట్ కూడా చాలా బావుండాల‌ని కొంత ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. కొన్ని సీన్స్ ఒక యాక్ట‌ర్‌గా నాకు కొంత ఛాలెంజింగ్‌గా అనిపించాయి. ఒక యాక్ట‌ర్ చాలా పొసెసివ్‌గా ఉంటే ఎటువంటి ఎక్స్‌ప్ర‌ష‌న్‌ని అయినా చాలా ఈజీగా ఇచ్చేస్తుంది. అదే మ‌నం ఒక పొసెస్ట్ కాక‌పోతే అప్పుడు మ‌న‌కు ఒక ఛాలెంజింగ్‌గా ఉంటుంది. హ‌రిగారు చాలా బాగా అన్ని సీన్స్ గురించి ఎంతో బాగా వివ‌రించేవారు. నేను కూడా నా పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను

సుమంత్ అశ్విన్‌తో మీ ఎక్స్‌పీరియ‌న్స్‌…

– తనతో చాలా మంచి ఎక్స్‌పీరియ‌న్స్‌ ఉంది. త‌ను ఆల్‌రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్, మంచి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్‌తో వ‌చ్చారు. త‌న‌కు కామ‌న్‌గానే హీరో యాటిట్యూడ్ ఉంటుంది. త‌న‌తో న‌టించడం చాలా బాగా అనిపించింది. ఇద్ద‌రం క‌లిసి మంచి ఫుడ్ తినేవాళ్ళం. సినిమా గురించి ఎక్కువగా డిస్క‌స్ చేసుకునేవాళ్ళం

ఈ సినిమాలో నందితాశ్వేతా మీరు కలిసి నటించార?

– ఉన్నాయండి 2,3 సీన్స్ దాకా ఉన్నాయి ఇద్ద‌రికీ. త‌ను ఆల్రెడీ దెయ్యం సినిమాలు ఎక్కువ‌గా చేయ‌డంతో త‌ను చాలా బాగా చేస్తుంది.కాని నాకు ఇది చాలా ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్ అయింది. చేసేట‌ప్పుడు కొంచం భ‌యం అనిపించేది. చాలా దెయ్యం సినిమాలు చూశాను. కాంచ‌న‌, ప్రేమ‌క‌థాచిత్రం, ఇంకా తాప్సీ ప‌న్ను న‌టించిన చి త్రాలు అన్నీ చూశాను.

దెయ్యాల‌తో మీకు ఏదైనా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా?

– ఉందండి. నాకు బాంబేలో ఒక సంఘ‌ట‌న జ‌రిగింది. నేను దేవుడ్ని ఎంత న‌మ్ముతానో దెయ్యం ఉంద‌న్న విష‌యం కూడా అంతే న‌మ్ముతాను. ఆత్మ‌లు కూడా ఉంటాయి అని న‌మ్ముతాను. బాంబేలో ఒకసారి నేను కార్ పార్క్ చేసి వెళుతుంటే తెల్ల‌డ్ర‌స్‌లో ఒక దెయ్యం క‌న‌ప‌డింది.నేను చూసి చాలా షాక్ అయ్యాను.

డ్రీమ్ రోల్ గురించి చెప్పండి?

– డ్రీమ్ రోల్స్ అంటే రాజ‌మౌళిగారితో క‌లిసి చేయాల‌నుంది. బాహుబ‌లి చిత్రంలో ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ని చాలా బాగా చిత్రీక‌రించారు. అందుకే ఆయ‌న‌తో చెయ్యాల‌నుంది. మ‌హాన‌టి లాంటి పాత్ర‌లు కూడా చెయ్యాల‌నుంది. సూప‌ర్‌డీల‌క్స్‌లో స‌మంత రోల్ ఆ టైప్‌లో చెయ్యాల‌నుంది.

మీ త‌రువాత ప్రాజెక్ట్స్‌?

– మ‌రో సినిమాకి సైన్ చేశాను. ఒక సంవ‌త్స‌రంలో 4 సినిమాల‌కు సైన్ చేశాను. జంబ‌ల‌కిడి పంబ సినిమాలో నా పాత్ర‌కి మంచి పేరు వ‌చ్చింది. త‌మిళ్‌లో కూడా సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. స్టోరీ బావుంటే అక్క‌డ కూడా నటిస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here