తెలుగు సినీ రంగంనుండి ‘ఫోర్బ్స్‌’ జాబితాలో ‘క్రియేటివ్‌ మెంటర్స్‌’ అధినేత కొవ్వూరి సురేష్‌రెడ్డి

0
959

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత వ్యాపారవేత్తల వివరాలను తెలియచేసే పత్రిక ‘ఫోర్బ్స్‌’. నీళ్లు శంఖంలో పోస్తేగాని తీర్థం కాదు అన్నట్టు.. విశ్వవ్యాప్తంగా ప్రచురితమయ్యే ఫోర్బ్స్‌ పత్రికలో విభిన్న రంగాల్లోని వ్యాపారవేత్తల జాబితా ప్రచురిస్తే వచ్చే పాపులారిటీ కూడా అలాంటిదే. చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు తమ వివరాలు ఫోర్బ్స్‌ జాబితాలో నమోదు కావాలని కోరుకుంటారు. చాలా అరుదుగా వచ్చే ఈ అవకాశం అతి చిన్న వయసులోనే వ్యాపారవేత్త కొవ్వూరి సురేష్‌రెడ్డికి లభించింది. వ్యాపార రంగంలోకి ప్రవేశించి ‘క్రియేటివ్‌ మెంటర్స్‌’ అనే సంస్థని స్థాపించిన 13 సంవత్సరాల వ్యవధిలోనే ‘ఫోర్బ్స్‌’ జాబితాలో చేరిన తొలి తెలుగు వ్యాపారవేత్తగా కొవ్వూరి సురేష్‌రెడ్డి ఈ ఘనత సాధించారు. ఇటీవల 30 సంవత్సరాల వయసున్న ప్రతిభగల 30 మందిని ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన విషయం విదితమే. అందులో మన తెలుగువాడు, నటుడు విజయ్‌ దేవరకొండ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాగా, ప్రస్తుతం భారత వ్యాపార వేత్తల విభాగంలో గుర్తింపు పొందిన తొలి తెలుగు యువ కెరటం కొవ్వూరి సురేష్‌రెడ్డి కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడం విశేషం.

ఈ సందర్భంగా ‘క్రియేటివ్‌ మెంటర్స్‌’ అధినేత కొవ్వూరి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ – ”నా జీవితంలో ఊహించని, మరచిపోలేని పరిణామం ఇది, చాలా సంతోషంగా వుంది. అతి చిన్న వయసులో సినీ రంగంలోని అన్ని విభాగాలలో పనిచేసి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన లెజెండరీ సినీ డైరెక్టర్‌, యాక్టర్‌, ప్రొడ్యూసర్‌ యల్‌.వి.ప్రసాద్‌ గారు నేను ఈ స్థాయికి ఎదగడానికి స్పూర్తి. ఆయన ఏ విధంగా కస్టపడి పైకొచ్చారో అదే విధంగా నా చిన్న వయసులోనే ‘క్రియేటివ్‌ మెంటర్స్‌’ యానిమేషన్‌, గేమింగ్‌ మరియు సినీ విభాగాలకు చెందిన స్కూల్‌ ప్రారంభించాను. ఆసియాలోనే తొలిసారిగా కేబుల్స్‌ లేకుండా మోషన్‌ కాప్చర్‌ యానిమేషన్‌ ప్రక్రియ ప్రవేశపెట్టాను. ఇప్పటి వరకు మా స్కూల్‌ నుండి 3 వేల పైచిలుకు విద్యార్థులు తర్పీదు పొంది సినీ రంగంలో వివిధ విభాగాలలో రాణిస్తున్నారు.2018లో ‘ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం అండ్‌ మీడియా స్కూల్‌’ ను స్థాపించడం జరిగింది. జాతీయస్థాయిలో మంచి బ్రాండ్ వున్నా ప్రసాద్స్ తో ‘క్రియేటివ్‌ మెంటర్స్‌’ కలిసి బిజినెస్ చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రసాబ్‌ లాబ్స్‌, ఐమాక్స్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌గారికి నా చాన్యవాదాలు. ఈ విధం జరగడం యాదృచ్చికమే అయినా నా స్ఫూర్తి ప్రదాత యల్‌.వి.ప్రసాద్‌గారి తనయుడు రమేష్‌ ప్రసాద్‌గారు ఈ అవకాశం ఇచ్చి నా అభివ ద్ధికి మరింతగా దోహదపడటం ఎవరికీ దొరకని అద ష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటె ప్రసాద్స్ వారి వ్యాపారాలన్నీ స్వతంత్రంగా నిర్వహిస్తున్నవే. ప్రసాద్స్ తో కలిసి వ్యాపారం చేసే అవకాశం నా ఒక్కడికే లభించడం విశేషంగా భావిస్తున్నాను. తాజాగా ప్రచురించిన ఫోర్బ్స్‌ పత్రికలో రేవా విశ్వవిద్యాలయం, నిర్మాణ రంగం నుండి డాక్టర్‌ పి శ్యామారాజు, టాటా గ్రూప్స్‌ – రతన్‌ టాటా, బజాజ్‌ సంస్థ నుండి రాహుల్‌ బజాజ్‌, హెచ్‌.సి.యల్‌ – శివ నాడార్‌, జె.కె.సిమెంట్స్‌ – యదూపాటి సింఘానియా, ఆదిత్య గ్రూప్స్‌ – కుమార మంగళం బిర్లా, హావెల్స్‌ – అనిల్‌రాయ్‌ గుప్తా, మహేంద్ర గ్రూప్స్‌ – ఆనంద్‌ జి. మహేంద్ర… ఇలా 51 మంది వ్యాపారవేత్తల పేర్లు నమోదు చేశారు. అంత మంది అగ్ర వ్యాపారవేత్తల సరసన నా పేరు కూడా నమోదు కావడం రమేష్ ప్రసాద్ గారి ఆశీస్సులు అనుకుంటాను. నన్ను గుర్తించి తమ జాబితాలోకి చేర్చిన ‘ఫోర్బ్స్‌’ యాజమాన్యానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మే 30న లండన్‌లో బిబిసి వారి సౌజన్యంతో ‘గ్లోబల్‌ బిజినెస్‌ కాంక్లేవ్‌ 2019’ అనే కార్యక్రమం వుంది. ఆరోజు ‘హౌస్‌ అఫ్‌ కామన్స్‌’ అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. అయితే ఈ పత్రికలో ప్రచురించబడిన 51మందిని నామినేటెడ్‌ పర్సన్స్‌గా పరిగణించి, వారిలో 25 మందికి అవార్డులను ఇస్తారు. నాకు గాని ‘హౌస్‌ అఫ్‌ కామన్స్‌’ అవార్డుగాని లభిస్తే ఒక తెలుగువాడిగా గర్వంగా ఫీల్‌ అవుతాను” అన్నారు.

సురేష్ రెడ్డి కొవ్వూరి క్రియేటివ్ మెంటర్స్ వ్యవస్తపాపకుడు

సురేష్ రెడ్డి కొవ్వూరి కెరీర్ పరంగా చదువుతూ, పని చేస్తూ,ఎదుగుతూ ముపేట్టలుగా తన సమజ్వలమైన ప్రస్థానాన్ని పద్దెనిమిదేళ్ల ప్రాయంనుండే ఆరంభించారు. ప్రస్తుతం యువతరాన్ని ఆకర్శిస్స్తున్న యానిమేషన్, విఎఫ్ఎక్స్ , గేమింగ్ వంటి కంటెంట్ డెవలప్మెంట్ రంగాల్లో అత్యంత నిష్ఠన్తులైనా వారితో అంతర్జాతీయ సంస్థల్లో పని చేసే సదవకాశాన్ని ఆదిలోనే అందిపుచ్చుకున్న సురేష్ రెడ్డి కొవ్వూరి యానిమేషన్, డిజైనింగ్, గేమింగ్ పట్ల ద్విగుణకృతమైన అభిరుచి, కృషితో ఆయా రంగాల్లో మెళుకువల్ని ఒడిసిపట్టి ‘క్రియేటివ్ మెంటర్స్’ పేరిట స్వంత స్టూడియో నెలకొల్పి, యువతకు విస్తారమైన ఉపాధి అవకాశాలున్న యానిమేషన్ గేమింగ్ తదితర రంగాలకి సంబందించిన అత్యాధునికమైన శిక్షణలు సేవలను అందించడం జరుగుతుంది. క్రియేటివ్ మెంటర్స్ సంస్థ విస్తృత ప్రాతిపదికిన ఏ వి సి జి కి సంబంధించిన కంటెంట్ ని అభివృద్ధి పరచడంతో పాటు గత పదమూడేళ్లలో నైపుణ్య శిక్షణాలలో మూడువేల మందికి పైగా అత్యంతప్రతిభావంతులుగా తీర్చిదిద్ది ఆయా రంగాలలోకి ఉపాధి కల్పించడం జరిగింది. ‘క్రియేటివ్ మెంటర్స్’ ఎడ్యుకేషన్ వింగ్ తాలూకు సుశిక్షతులైన పూర్వ విద్యార్థుల సముదాయం లో గేమింగ్ ని అభివృద్ధిపరచడానికి నవ కల్పనలతో సంస్థ సువ్యష్ఠితమైనది. అదేవిధంగా ‘క్రియేటివ్ మెంటర్స్’ సినీ రంగానికి సంబంధించి ఓ దిగ్గజ సంస్థ యల్ వి ప్రసాద్ గ్రూప్ తో కల్సి తమ సంయుక్త ఆధ్వర్యం లో ఫిలిం మరియు మీడియా స్కూల్ పేరిట ఔత్సహికులైన యువతీ యువకులకి ఆయా రంగాల్లో అత్యంత నాణ్యమైన శిక్షణలు నిర్వహించడం సంతోషకరం.

దార్శనికులైన స్వర్గీయ యల్ వి ప్రసాద్ తండ్రికి తగిన తనయుడు రమేష్ ప్రసాద్ తనకాదర్శంగా పేర్కొనే సురేష్ రెడ్డి కొవ్వూరి తామెంచుకున్న రంగం లో ఎంతో గుర్తింపుని మరెన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కర్రాలని అందుకోవడం జరిగింది.

అచ్చివెమెంట్స్:
2018 సంవత్సరంలో :- యానిమేషన్ గేమింగ్ రంగాలకి అందించిన సేవలకుగాను ‘ఇండీవుడ్ కార్నివాల్ 2018 ఎక్సలెన్స్ అవార్డు’.
2016 సంవత్సరంలో :- ;ఇంటర్నేషనల్ క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డు’ యానిమేషన్ గేమింగ్ రంగాల్లాలోని అత్యుత్తమ నాణ్యమైన సేవలకుగాను…దక్షిణ భారత దేశానికి మణిపూసగా 2016 లో గోవా లో అందుకున్న అవార్డు.
2014 సంవత్సరంలో :- బ్రాండ్స్ అకాడమీ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు లో యానిమేషన్ గేమింగ్ రంగాల్లాలో ఉత్తమ శ్రేణి కాలేజ్ గా ప్రశంసింపబడుతూ ముంబై లో అందుకున్న పురస్కారం.
2013 సంవత్సరంలో:- ఆసియన్ ఎక్సలెన్స్ అవార్డు, న్యూ ఢిల్లీ వారిచే ఉమ్మడి తెలుగు రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్ లో యానిమేషన్ గేమింగ్ రంగాల్లో అందిస్తోన్న అత్యుత్తమ నాణ్యమైన సేవలకుగాను.

‘క్రియేటివ్ మెంటర్స్’ సంస్థ సాధించిన విజయాలు:
యానిమేషన్ గేమింగ్ రంగాలకి సంబంధించి అత్యుత్తమ సేవలు పలు అంతర్జాతీయ సంస్థలకి అందించడం.
కంపెనీ ద్వారా శిక్షణ ఇవ్వబడిన మూడువేల మందికిపైగా సాంకేతిక నిపుణులను పలు జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకి అందుబాటులోకి తీసుకురావడం.
ఫైన్ ఆర్ట్ కి సంబంధించిన పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో దేశవ్యాప్తంగా సంయుక్త కార్యక్రమాలు చేపట్టడం.

మార్గ సూచీ:
యానిమేషన్ గేమింగ్ రంగాల్లో విస్తారంగా పనిచేసిన సుదీర్ఘమైన అనుభవంతో స్వీయ కౌసల్యంతో సురేష్ రెడ్డి కొవ్వూరి యానిమేషన్ లేదా ఫిలిం మాధ్యమంగా తగిన మానవవనరులతో, నిపుణ్యంగలవారితో ఏరకమైన పక్రియలోనైనా విషయ విస్తరణకు, రూపకల్పనకు తగిన సదుపాయాలతో క్రియేటివ్ మెంటర్స్ ని స్థాపించడం జరిగింది.

సవాళ్లు:
యానిమేషన్ గేమింగ్ రంగాల్లో ప్రస్తుతం కన్నా గతంలో ఎదుర్కునే పలు సవాళ్ళను చెప్తారు సురేష్ రెడ్డి కొవ్వూరి. గతంలో తగిన సదుపాయాలు సుశిక్షితులైన సాంకేతిక నిపుణుల కొరత వాళ్ళ పెట్టుబడికి తగిన లాభాలు కొరవడి ఈ రంగంలో పలు ఒడిదుడుకులని ఎదుర్కోవలసి వచ్చింది. అయితే సవాళ్ళను అవకాశాలుగా మార్చుకుంటూ ముందుకు వెళుతుండడమే సక్సెస్ ని ఇస్తుందని చెపుతారు సురేష్ రెడ్డి కొవ్వూరి.
యానిమేషన్ గేమింగ్ రంగాలు సాంకేతిక పరమైన పెట్టుబడులు నిపుణులైన సిబ్భంది వల్లే నిలదొక్కుకోగలమని ఆయనకున్న అనుభవం.ప్యూచరిస్టిక్ ఇండస్ట్రీ లైన యానిమేషన్ గేమింగ్ రంగాల్లో దేశీయంగా పెట్టుబడి కొరతకి కారణం బ్యాంకులు చొరవ చూపించక పోవడం. ఇతర బాగస్వామ్య పక్షాల అవగాహన రాహిత్యంఅయినా లేకుంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా యానిమేషన్ గేమింగ్ రంగాలు ఊపందుకోవడంతో భారతీయ వినోద ప్రపంచంలో మీడియా పరమైన సేవలతో ముందుకు దూసుకువెళ్లేదని సురేష్ రెడ్డి కొవ్వూరి విశ్వసిస్తున్నారు.

కార్య ప్రణాళిక: ఈ నేపథ్యంలో యానిమేషన్ గేమింగ్ రంగాల్లో పోటీ సల్పంగానే ఉండడం వల్ల ఈ అవకాశాన్ని వాణిజ్య సరళిలో సాంకేతిక శిక్షణతో పాటు ఫిలిం ప్రొడక్షన్ – కంటెంట్ డెవలప్మెంట్ యానిమేషన్, గేమింగ్, వి ఎఫ్ ఏక్స్ ఫిలిం మీడియా సర్కిల్ లో బహుముఖాలుగా విస్తరించాలన్నది సురేష్ రెడ్డి కొవ్వూరి వ్యూహం.

జీవిత పాఠాలు : జీవితంలో విజయం సాధించాలంటే ఇదివరకు చేయనిదేదో చేసి చూపించినపుడే దక్కుతుందనే అభిప్రాయం ఉండేది. అది కొంతవరకు నిజమే అయినా నవకల్పన అనేది ఏమంత సంక్లిష్టమైన విషయమేమి కానే కాదు. నవకల్పననేది అత్యంత సులభం తక్కువ వ్యవధి చిన్న చిన్న లక్ష్యాలతో జీవితంలో ముందంజ వేయడం వల్ల అది సాధ్యమే అంటున్నారు సురేష్ రెడ్డి కొవ్వూరి.

ప్రతీది మనం చేయడమనేది కూడా కరెక్ట్ కాదు. మన నైపుణ్యాన్ని పెంచుకుంటూనే అందుబాటులో వున్నా అన్ని వనరులని, మాన్ పవర్ ని కూడా సముచితంగా తగిన వివేకంతో ఉపయోగించుకున్నపుడే జీవితం లో ఏదన్నా సాధించగలుగుతాం. అన్నది దినదిన పరమార్ధమౌతున్న విభిన్నమైన పారిశ్రామిక రంగంలో అనితర సాధ్యమైన విజయ పరంపరలతో దూసుకెళ్తున్న సురేష్ రెడ్డి కొవ్వూరి నిచ్చితాభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here