అనిల్ రావిపూడి లాంఛ్ చేసిన “వినరా సోదరా వీరకుమారా” సాంగ్.

0
384

లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై శ్రీనివాస సాయి ,ప్రియాంక జైన్ హీరోహీరోయిన్లుగా సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో ,లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన చిత్రం ‘ వినరా సోదర వీరకుమారా’ .ఈ చిత్రం ఫస్ట్ సాంగ్ ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల హైదరాబాద్ లో లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ” వినరా సోదర వీరకుమారా ట్రైలర్ చూసాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సాంగ్స్ కూడా చాల బాగున్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తూ, టీమ్ మొత్తానికి నా విషెస్ తెలియజేస్తున్నాను.’ అన్నారు.

ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘ఈ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ నేను కలసి మేం వయసు కి వచ్చాము మూవీ చేసాం. ఈ చిత్ర టీం కొత్త ప్రయత్నం చేశారు.మూవీ చాలా బాగుంది. దర్శకుడు అనిల్ తో సాంగ్ లాంచ్ చేయడం శుభ పరిణామం ‘ అని అన్నారు.

చిత్ర నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ” మా సినిమా మొదటి పాటను అనిల్ రావిపూడి గారు రిలీజ్ చేయడం సంతోషం గా ఉంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను ‘ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరో శ్రీనివాస సాయి , చిత్ర దర్శకుడు సతీష్ చంద్ర నాదెళ్ల , అనిల్ మైలాపురం , కిరణ్ .సి.హెచ్. తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస సాయి , ప్రియంకజైన్, జాన్సీ, ఉత్తేజ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా : రవి.వి ,సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ , మాటలు: లక్ష్మీ భూపాల , ఎడిటర్ :మార్తాండ్ .కె.. వెంకటేష్. నిర్మాత: లక్ష్మణ్ క్యాదారీ, దర్శకత్వం: సతీష్ చంద్ర నాదెళ్ల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here