యూనిక్ స్క్రీన్ ప్లే తో స‌చిన్ జోషి హీరోగా తెరకెక్కిన హర్రర్ మూవీ ‘అమావాస్య’ తప్పకుండా విజయం సాధిస్తుంది. – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్

0
97

స‌చిన్ జోషి హీరోగా వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌ పై ‘1920 ఈవిల్‌ రిటర్స్స్‌’, ‘రాగిని యంయంఎస్‌, ‘అలోన్‌’ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు భూషన్‌ పటేల్‌ దర్శకత్వంలో రైనా సచిన్‌జోషి, దీపెన్‌ఆమిన్‌ నిర్మాణంలో న‌ర్గిస్ ఫ‌క్రి హీరోయిన్‌గా న‌టిస్తున్న హార‌ర్ చిత్రం ‘అమావాస్`. ఈ సినిమా తెలుగులో ‘అమావాస్య’ పేరుతో ఫిబ్రవరి 8న విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ను ఏర్పారు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని బిగ్ ఆడియోసీడి ని విడుదల చేశారు.

ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ – “నాకు హర్రర్ జోనర్ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటి వరకు చాలా హారర్ సినిమాలు నిర్మించాను. హారర్ జోనర్ ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఈ సినిమాలో సచిన్ చాలా బాగా కనపడుతున్నారు. సచిన్ మంచి నటుడు. తనకు చాలా వ్యాపారాలు ఉన్న సినిమా పై తనకు ఉన్న ఫ్యాషన్ తో నటిస్తున్నారు. ఆయన భార్య రైనా సచిన్ జోషి గారు నిర్మాతగా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. వారిద్దరూ కలిసి తెలుగులో ఎన్నో సినిమాలను నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భూషణ్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఆయన చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది” అన్నారు.

ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ – ” ‘అమావాస్య’ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు హర్రర్ జోనర్ స్పెషలిస్ట్.నాకు సచిన్ జోషి సినిమాలంటే చాలా ఇష్టం. నేను ఇంత వరకు తనతో సినిమా చేయలేదు ..త్వరలోనే తనతో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.

హీరో స‌చిన్ జోషి మాట్లాడుతూ – “నేను చాలా కాలంగా హార‌ర్ జోనర్ ఓ సినిమా చేయాల‌ని ఎదురుచూస్తున్నాను. అలాంటి స‌మ‌యంలో భూష‌ణ్ ప‌టేల్ నాకు ఈ స్క్రిప్ట్ చెప్పారు. నా గ‌త చిత్రాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన సినిమా. అమావాస్య ఓ క్లాసిక్ హార‌ర్ మూవీ. తెలుగులో హార‌ర్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ దొరుకుతున్న స‌మ‌యంలో మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం ఉన్న లెటెస్ట్ టెక్నాల‌జీ వి.ఎఫ్‌.ఎక్స్ వ‌ర్క్‌ను ఉప‌యోగించాం. మంచి క‌థే సినిమాకు హైలెట్‌. సినిమాను రెండు భాష‌ల్లో చిత్రీక‌రించాం. ఎందుకంటే తెలుగు సినిమాకు నా తొలిప్రాధాన్య‌త ఎప్పుడూ ఉంటుంది. భూష‌ణ్ ఇప్ప‌టికే 1920 ఈవిల్ రిట‌ర్న్స్‌, రాగిణి ఎం.ఎం.ఎస్‌2, అలోన్‌ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను డైరెక్ట్ చేశారు. అలాంటి హార‌ర్ స్పెష‌లిస్ట్ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమాలో క‌థ‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. హాలీవుడ్ స్థాయిలో హార‌ర్ చిత్రాన్ని అందించాల‌ని ఛాలెంజింగ్‌గా భావించి ఈ సినిమా చేశాం. అమావాస్య యూనిక్ స్క్రీన్‌ప్లేతో తెర‌కెక్కింది. క‌థ‌కు త‌గ్గ‌ట్లు మ్యూజిక్‌కు త‌గ్గ ప్రాధాన్య‌ముంటుంది. నాకు సినిమాలంటే ప్యాష‌న్‌. చాలా క‌థ‌లు వింటూ ఉంటాను. న‌చ్చిన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతుంటాను. ఫిబ్ర‌వ‌రి 8న మా సినిమా తెలుగు,హిందీ భాషల్లోవిడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా అంద‌రూ చూడండి ” అన్నారు.

దర్శకుడు భూష‌ణ్ ప‌టేల్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో క‌థ‌తో పాటు వి.ఎఫ్‌.ఎక్స్‌కు చాలా ప్రాధాన్య‌ముంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఉప‌యోగించ‌ని సాంకేతిక‌త‌ను ఇందులో ఉప‌యోగించాం. బెస్ట్ వి.ఎఫ్.ఎక్స్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌నిచేశారు. దీనికి ఆస‌క్తిక‌ర‌మైన క‌థ కూడా తోడైంది. క్లైమాక్స్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఉంటుంది. స‌చిన్‌తో చాలా కాలంగా సినిమా చేయాల‌ని అనుకుంటున్నాను. కానీ ఇద్ద‌రం వారి వారి ప‌నుల‌తో బిజీగా ఉండటం వ‌ల్ల కలిసి సినిమా చేయ‌లేక‌పోయాం. గ‌త ఏడాది ఓ సంద‌ర్భంలో ఇద్ద‌రం క‌లుసుకున్న‌ప్పుడు స‌చిన్‌కు మూడు నిమిషాల ప్లాట్ చెప్పాను. త‌ను ఈ సినిమా క‌లిసి చేస్తున్నామ‌ని చెప్పాడు. త‌న‌నే హీరోగా పెట్టి సినిమా చేయాల‌ని అప్పుడే నేను నిర్ణ‌యించుకున్నాను. మా టీం అందరం చాలా కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాం సినిమా చాలా బాగా వచ్చింది. హీరోయిన్ నర్గీస్ ఈ సినిమాలో మంచి నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. సినిమా ఫిబ్రవరి 8 న విడుదల అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి” అన్నారు.

నటుడు అలీ అస్గ‌ర్ మాట్లాడుతూ – “ నేను మొదటి సారి ఒక హారర్ సినిమాలో నటిస్తున్నాను. నేను ఈ చిత్రంలో నేను ఎలాంటి ఆత్మ పాత్ర‌ను చేయ‌లేదు. స‌చిన్‌, న‌ర్గిస్ క‌లిసి వ‌చ్చే వీకెండ్ స‌మ్మ‌ర్ గెస్ట్ హౌస్ కేర్ టేక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటాను. యు.పి రాష్ట్రం నుండి నేను లండ‌న్ ఎందుకు వచ్చాను. ఎలా ఆ బంగ్లా కు కేర్ టేకర్ గా మారానో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. హార‌ర్ సినిమాలో నాది కాస్త లైట‌ర్ వేలో ఉండి నా పాత్ర డిజైన్ చేసిన తీరు.. ప్రేక్ష‌కులను న‌వ్విస్తుంది” అన్నారు.

http://industryhit.com/t/2019/02/amavasya-pre-release-event-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here