ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ‘4 లెటర్స్’ చిత్రం అంకితం – ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు ఆర్.రఘురాజ్

0
412

ఓం శ్రీ చక్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందిన చిత్రం ‘4 లెటర్స్‌. ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక. ఈశ్వర్‌,టుయాచక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌.రఘురాజ్‌ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ నిర్మించారు. ఈ సినిమా ఆడియోవిడుదల కార్యక్రమం హైదరాబాద్‌ ప్రసాద్‌లో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బ్యానర్‌ లోగోను జెమిని కిరణ్‌ లాంచ్‌ చేశారు. ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి విడుదలచేశారు. నిర్మాత అచ్చిరెడ్డి, ఎస్వీ క ష్ణారెడ్డి ఆడియో బిగ్‌ సీడీ విడుదల చేశారు. ఈ సందర్భంగా..

జెమిని కిరణ్‌ మాట్లాడుతూ – ” ఈ సినిమాకు పని చేసిన ఆర్టిస్టులు,టెక్నిషియన్స్‌ అందరికి ఆల్‌ది బెస్ట్‌. సినిమా తప్పకుండా సూపర్‌హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

‘మూవీఆర్టిస్ట్స్‌అసోసియేషన్‌’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ – ”సినిమా మీద ప్రేమ ఉండాలి గానీ.. న్యూయార్క్‌లో ఉన్నా, అంటార్కిటికాలో ఉన్నా ఆ ప్రేమ ఎక్కడికీ పోదు. ప్రతి ఒక్కరూ సినిమా మీద ప్రేమతో ఇండస్ట్రీకి వస్తారు. ఏ రంగంలో అయినా ప్రేమ పక్కకు వెళ్తుందేమో కానీ… సినిమాలోని 24 శాఖలపై ప్రేమకు వెళ్ళదు. ఆ ప్రేమతో నిర్మాతలు న్యూయార్క్‌ నుంచి వచ్చి ఈ సినిమా చేశారు. ‘4 లెటర్స్‌’ హీరో హీరోయిన్లకు మంచి పేరు, నిర్మాతలకు లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నా. నాకు సీనియర్‌, టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌ సురేష్‌ సినిమా బాగా వచ్చిందని చెప్పారు. హీరో ఈశ్వర్‌ మంచి హీరో అవ్వాలని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నా” అన్నారు.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ – ”ఈ సినిమా సాంగ్స్‌ చూస్తుంటే హీరో ఈశ్వర్‌ యొక్క ఎనర్జి లెవల్స్‌ ఏంటో అర్దం అవుతుంది. కమర్షియల్‌ హీరో కావాలనేది ఈశ్వర్‌ చిన్నపటి కళ దాన్నిఈరోజు వారితల్లితండ్రులసహాయంతో నెరవేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చక్కటి సినిమాని మనకు అందియ్యడంకోసం వారు ప్రయత్నం చేశారు. సినిమా తప్పకుండా సఫలీకృతం అవుతుంది అనే దానికి నిదర్శనమే ఈ సినిమా పాటలు. ఫోక్‌ సాంగ్స్‌ బాగా రిథమాటిక్‌గా వెళ్లారు సంగీత దర్శకులు. సినిమాటిగ్రఫితోపాటు దర్శకత్వం, ఎడిటింగ్‌ కూడా చాలా బాగుంది. ఈ సినిమా ద్వార దర్శకులు రఘురాజ్‌ గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. హీరోయిన్స్‌ చాలా అందంగా ఉన్నారు. సంగీతపరంగానే కాకుండా అన్ని అంశాలు బాగున్నాయి కాబట్టి సినిమా తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుంది”అన్నారు.

ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ – ” ప్రొడ్యూసర్ ఉదయ్ కుమార్ గారు వచ్చి నన్ను కలిసి సినిమా గురించి చెప్పి మీ సపోర్ట్ కావాలి సార్ అని అడగ టం జరిగింది. గత పది సంవత్సరాలుగా చిన్న సినిమాల కు నేను సపోర్ట్ చేస్తూనే వచ్చాను. ఈ సినిమా చూసి మంచి సలహా ఇవ్వచ్చనే ఉద్దేశ్యం తో సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది.చిన్న ప్రేమ కథను తీసుకొని ఎక్కడా డీ వీయేట్ అవకుండా పూర్తి ఎంటర్టైన్మెంట్ జోనర్ లో సినిమా తీసినందుకు ముందుగా డైరెక్టర్ గారిని అభినందిస్తున్నాను. డైలాగ్స్ తో మాయ చేశారు దర్శకుడు. అందరూ కొత్తవారిని తీసుకొని ఎక్కడా కాoప్రమైజ్ కాకుండా సినిమాను అద్భుతం గా తెరకెక్కించారు. ముఖ్యంగా హీరో డాన్స్, ఫైట్స్,కామెడీ టైమింగ్ చాలా చక్కగా మంచి అనుభవం ఉన్న నటుడిలా పెర్ఫా మ్ చేశాడు. మంచి ఓపెనింగ్స్ వస్తే సినిమా డెఫినెట్ గా మంచి సక్సెస్ సాధిస్తుంది. ట్రైలర్ పక్కా కమర్షియల్ గా ఉంది. సినిమా తప్పకుండా మంచి హిట్ అవుతుంది” అన్నారు.

ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ – ”చిన్న సినిమాలు హిట్‌ అయితేనే ఇండస్ట్రీకిమంచిదిఅనిఈ సినిమాఆడియోరిలీజ్‌ఫంక్షన్‌కి రావడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్‌ చూసి, పాటలు విన్న తరువాత ఇది చిన్న సినిమా కాదు కాబోయో హిట్‌ సినిమా అని అనిపించింది. ఆడియన్స్‌ పెద్ద సినిమానా చిన్న సినిమానా అని కాదు. సినిమా మనల్ని ఎంటర్‌టైన్‌ చేసిందా లేదా అని మాత్రమే చూస్తారు. అలా ఈ మద్య కాలంలో రిలీజ్‌ అయ్యి సూపర్‌హిట్‌ సాధించిన సినిమా ‘హుషారు’. ఆ సినిమా ప్రొడ్యూసర్‌ బెక్కెం వేణుగోపాల్‌ గారిని నేను అభినందిస్తున్నాను.అలాంటి స్పూర్తితోనే ప్రొడ్యూసర్‌ ఉదయ్‌కుమార్‌ గారు ఈ సినిమాను నిర్మించడమైనది. టెక్నిషియన్స్‌ సపోర్ట్‌తో రఘురాజ్‌గారు ఈసినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మ్యూజిక్‌ చాలా బలంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌ అందరికి ఆల్‌దిబెస్ట్‌” అన్నారు.

సినిగేయరచయిత చంద్రబోస్‌ మాట్లాడుతూ – ”నేను అమెరికాకు ఓ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వెళ్లినప్పుడు అందులో ఈశ్వర్‌ గాయకుడిగా పాల్గొన్నాడు. అతను మంచి గాయకుడు మాత్రమే కాదు మంచి విద్యార్థి. నాట్యం బాగా చేస్తాడు. అతడి బహుముఖ ప్రతిభకు చక్కటి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నా. అమెరికాలో ఉదయ్‌కుమార్‌ నన్ను బాగా చూసుకున్నారు. ఇక్కడికి వచ్చాక భీమ్స్‌ సంగీత దర్శకుడని తెలిసింది. భీమ్స్‌ అంటే నాకు ప్రత్యేక అభిమానం. తన శైలి, తన పద్ధతి నాకు బాగా నచ్చుతాయి. పాటలు రాసిన సురేశ్‌… ప్రేక్షకుల నాడి తెలిసిన గీత రచయిత సినిమా తప్పకుండామంచి హిట్‌ సాధిస్తుంది’ అన్నారు.

హీరో ఈశ్వర్‌ మాట్లాడుతూ – ”నేను అమెరికాలో చదువుకున్నా. అయితే సినిమాలు అంటే ఎప్పటినుంచో ఇష్టం. ఇండియా వచ్చినప్పుడు కాస్త నెర్వస్‌గా ఉండేది. దర్శకుడు రఘురాజ్‌గారితో మాట్లాడితే షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యే రెండు నెలల ముందు వర్క్‌షాప్స్‌ చేద్దామన్నారు. మా దర్శకుడు నాకు బాడీ లాగ్వేంజ్‌, వర్క్‌ డిసిప్లేన్‌ అన్నీ నేర్పించారు. నేను సత్యానంద్‌గారి నటనలో శిక్షణ తీసుకున్నా. ఫ్యామిలీలో అందరికీ ఇంట్రెస్ట్‌ ఉండటంతో, ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్‌ కావాలని ఈసినిమా నిర్మించడానికి అమ్మా నాన్న అంగీకరించారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అన్నారు.

దర్శకుడు రఘురాజ్‌ ఆర్‌ మాట్లాడుతూ – ”మొదటిగా ఈ చిత్ర నిర్మాతలను నాకు పరిచయం చేసిన ప్రొడక్షన్‌ మేనేజర్‌ భాస్కర్‌గారికి థాంక్స్‌. ఈ సినిమాలో చాలా అద్భుతాలు జరిగాయి. ఈ సినిమాని 75 రోజుల్లో పూర్తి చేయడానికి మా టీమ్‌ మొత్తం బాగా సహకరించింది. ముఖ్యంగా కోడైరెక్టర్‌ నాగాచారిగారు మంచి ప్లాన్‌ చేశారు. అసోసియేట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస చక్రవర్తి. ఈ సినిమా కోసం ముందు నుంచి చాలా కష్టపడ్డాడు. అలాగే మరో అసోసియేట్‌ ఖాదర్‌. తను కూడా సినిమా కోసం రాత్రింబవళ్లు చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. అలాగే డైలాగ్స్‌ రాయడానికి నాకు పూర్తి సహకారం అందించిన కిల్లరి విజయ్‌కి స్పెషల్‌ థాంక్స్‌. ఈ సినిమా స్క్రిప్ట్‌ బుక్‌లెట్‌ రూపంలో తయారు చేసి మా టీమ్‌ అందరికీ ఇవ్వడం వల్లనే సినిమా మేం అనుకున్న బడ్జెట్‌లో ప్రణాళిక ప్రకారం తీయగలిగాం. ఏ సినిమా అయినా విజయవంతం అవ్వాలంటే ప్రొడ్యూసర్స్‌ సహకారం ఎంతో అవసరం. ఈ సినిమాకు కావాల్సిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ ఇచ్చి ఎంతగానో ప్రోత్సహించిన మా ప్రొడ్యూసర్‌ దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌గారికి నా కృతజ్ఞతలు. ఇరవై నాలుగు గంటలు మాతో ఉండి ఈ సినిమా ఇంత బాగా రావడానికి పూర్తి సహకారాన్ని అందించిన భాస్కర్‌రాజుగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన వల్లనే సినిమా ఇంత త్వరగా పూర్తి చేయగలిగాం. ఈ సినిమాకి భీమ్స్‌ సిసిరోలియో చాలా చక్కటి మ్యూజిక్‌నిచ్చారు. సురేష్‌ గంగుల ఈ సినిమాకి నాలుగు పాటలు రాశారు. మంచి సాహిత్యాన్ని అందించారు. హీరోయిన్స్‌ టుయా చక్రవర్తి, అంకిత ఎంతో అంకితభావంతో షూటింగ్‌లో పాల్గొని బాగా నటించారు. సీనియర్‌ నటుడు సురేష్‌గారు చాలా డిసిప్లైన్డ్‌ యాక్టర్‌. ఈ కథకి రాసుకోవడానికి మూలకారణం ఒక ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌. వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘4 లెటర్స్‌’. ఈ చిత్రాన్ని ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్‌కి అంకితం చేస్తున్నాను. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది. ఫిబ్రవరి సెకండ్‌ వీక్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని ఆదరిస్తారని నమ్మకం ఉంది” అన్నారు.

నిర్మాత దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ మాట్లాడుతూ – ”మా ఆహ్వానాన్ని మన్నించి ఫంక్షన్‌కి విచ్చేసిన అతిరథమహారథులు ఎస్‌.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, జెమిని కిరణ్‌, బెక్కం వేణుగోపాల్‌, చంద్రబోస్‌, నటుడు సురేష్‌లకు థాంక్స్‌ చెప్పుకుంటున్నాను. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుగారి చేతుల మీదుగా జనవరి 26న మా చిత్రం టీజర్‌ని రిలీజ్‌ చేశాం. ఆయన మా టీజర్‌ చూసి ‘మీ అబ్బాయికి మంచి భవిష్యత్‌ ఉందని’ అన్నారు. చాలా సంతోషమేసింది. మేం మొదటిసారి తీసిన ఈ చిత్రం టీజర్‌ ఆయన రిలీజ్‌ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే విక్టరీ వెంకటేష్‌, శ్రీకాంత్‌, తనికెళ్ళభరణి, బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌గారు వీళ్లంతా టీజర్‌ చూసి ఎంతో బాగుందని మెచ్చుకుని మా బేనర్‌కి, సినిమాకి విషెస్‌కి చెప్పారు. వీళ్లందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ బేనర్‌ పెట్టడానికి మా అబ్బాయి ఈశ్వర్‌ కారణం. మా ఫ్యామిలీకి సంగీతం అన్నా, సినిమాలన్నా ఎంతో ఇష్టం. మా ఫ్యామిలీకి ఆ భగవంతుని అనుగ్రహం ఉంది. మా అబ్బాయి ఈశ్వర్‌ ఇష్టంతో వైజాగ్‌ సత్యానంద్‌గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఈ బేనర్‌పైనే మా అబ్బాయి ‘ఆ ఇద్దరు’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ తీశాడు. ఈ క్రెడిట్‌ మా అబ్బాయిదే. మా చిత్రం ఇంజినీర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీశాం. యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే అన్ని కమర్షియల్‌ అంశాలో మా చిత్రంలో ఉన్నాయి. దర్శకుడు రఘురాజ్‌ చెప్పిన కథ బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా తీశాను. యూనిట్‌ మొత్తం సినిమా బాగా రావడానికి సహకరించింది. ఈ సినిమాకి నాలుగు పిల్లర్స్‌. ఒకరు డైరెక్టర్‌. కోడైరెక్టర్‌ రాజశేఖర్‌, చక్రవర్తి, భాషా, ఘోస్ట్‌ రైటర్‌ విజయ్‌. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం” అన్నారు.

http://industryhit.com/t/2019/01/4-letters-audio-launch-pics/#!prettyphoto/0/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here