తమన్నా,సందీప్ కిషన్ ల’ నెక్స్ట్ ఏంటి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక..!!

0
107

తమన్నా,సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నెక్స్ట్ ఏంటి’.. బాలీవుడ్ టాప్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవదీప్, పూనమ్ కౌర్ లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.. డిసెంబర్ 7 న ఈ సినిమా విడుదల అవుతుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది..

ఈ సందర్భంగా నిర్మాత అక్షయ్ పూరి మాట్లాడుతూ.. తెలుగులో నేను చేస్తున్న మొదటి సినిమా ఇది.. తమన్నా ఈ సినిమాని తెలుగులో చేద్దామని చెప్పినప్పుడు భయం వేసింది మాకు తెలుగు తెలీదు, డైరెక్టర్ కునాల్ గారికి తెలుగు తెలీదు ఎలా అని అనుకున్నాం కానీ తమన్నా మంచి మోటివ్ ఇచ్చింది.. ఫైనల్ గా సినిమా చాల బాగా వచ్చింది.. అందరు చాల బాగా పనిచేసారు.. ఈ సినిమా అందరికి నచ్చితే నెక్స్ట్ ఏంటి 2 కూడా తెరకెక్కిస్తాం అన్నారు..

హీరో నవదీప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాది చిన్న పాత్ర.. సినిమా విషయానికొస్తే సినిమా పాటలు చాల బాగా వచ్చాయి..అందరి దగ్గరినుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.. సినిమా కూడా చాల బాగా వచ్చింది.. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను అన్నారు..

మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ మాట్లాడుతూ.. సినిమా పాటలు మీ అందరికి నచ్చాయని అనుకుంటున్నాను.. ఈ సినిమా నాకెంతో స్పెషల్.. ఎందుకంటే తెలుగులో నేను చేస్తున్న మొట్టమొదటి సినిమా.. సినిమాలోని పాటలు కూడా వేటికవే ప్రత్యేకమైనవి.. నన్ను ఈ సినిమాలో ఒక పార్ట్ అయ్యేలా చేసిన సినిమా టీం కి చాల థాంక్స్. డిసెంబర్ 7 న వచ్చే ఈ సినిమా ని అందరు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను అన్నారు..

తమన్నా మాట్లాడతూ.. డిసెంబర్ 7 న రిలీజ్ అవుతుంది సినిమా.. సినిమా చూస్తున్నంతసేపు మీరు చాల బాగా ఎంజాయ్ చేస్తారు.. విజువల్స్ మీకు బాగా నచ్చాయనుకుంటున్నాను.. ఈ సినిమా అందరి వేసిన టాగ్స్ ని దాటుకుని ఒక మంచి సినిమాగా అవుతుందని కోరుకుంటున్నాను.. మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఆడియో ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు చాల థాంక్స్.. సందీప్, నవదీప్ లతో యాక్ట్ చేయడం ఆనందంగా ఉంది.. మంచి ఎక్స్ పీరియన్స్ వచ్చింది.. కునాల్ గారు ఈరోజు ఇక్కడ లేరు.. చాల బాగా సినిమా తీశారు.. ఈ సినిమా ని విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు..

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ నాకు చాల చాల నచ్చిన వ్యక్తి.. ప్రొడక్షన్ చాల బాగా చేసారు.. కునాల్ గారితో పనిచేయడం చాల గొప్ప అనుభూతిని ఇస్తుంది.. హమ్ తుమ్, ఫనా లాంటి సినిమాలు చేసిన అయన తో వర్క్ చేయడం గొప్ప విషయం.. తమన్నా లాంటి హీరోయిన్ తో చేయడం కూడా చాల బాగా అనిపించింది.. మేమేం చేసిన అది ప్రేక్షకుల కోసమే, నచ్చకపోతే తిట్టే హక్కు మీకుంటుంది.. నచ్చితే పొగిడే ప్రేమ మీకుంటుంది.. ఈ సినిమాని ఎంతో హానెస్ట్ గా చేసాం.. కావాలని ఏ సీన్ కానీ, ఏ సాంగ్ కానీ పెట్టలేదు.. అన్ని సంధర్భానుసారంగా వచ్చేవే.. సినిమా ఎంతో సరదాగా తీశాం.. మిమ్మల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది.. తప్పకుండా సినిమా చూడండి అన్నారు.

http://industryhit.com/t/2018/12/tamannah-pics-2/

http://industryhit.com/t/2018/12/next-enti-pre-release-event-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here