ఈ సినిమాకు స్క్రీన్ ప్లే నే హీరో.. ‘‘లా’’ ట్రైలర్ లాంచ్ వేడుకలో కమల్ కామరాజ్

0
114

శ్రీ విఘ్నేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ ఫై రమేష్ బాబు మున్నానిర్మాతగా గగన్ గోపాల్ ముల్క దర్శకత్వం లో కమల్ కామరాజు ,మౌర్యాణి హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘లా’.ఈ చిత్ర ట్రైలర్ ను సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్యఅతిధి గా విచ్చేసి విడుదల చేశారు.ఈ సందర్భం గా

రాజ్ కందుకూరి మాట్లాడుతూ….ఈ సినిమా ట్రైలర్ ను నాచేతుల మీదుగా విడుదల చేయడం సంతోషం గా ఉంది .’లా’ సింపుల్ అండ్ క్యాచీ టైటిల్ చాలా బాగుంది.నాకు కమల్ మంచి స్నేహితుడు.సినిమా బాగుంటేనే చెయ్యాలి అనుకునే వ్యక్తి వెరీ అడ్మిరింగ్ పర్సనాలిటీ. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చాల ఫిట్ గా కనిపిస్తున్నాడు . ట్రైలర్ చాలా బాగుంది. మ్యూజిక్ ఈ సినిమాలో వెరీ ఇంపార్టెంట్ అని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అని నమ్మకం ఉంది.ప్రొడ్యూసర్,డైరెక్టర్ గారికి నా అల్ ది బెస్ట్. అని అన్నారు

హీరోయిన్ మౌర్యాణి మాట్లాడుతూ .. ఈ సినిమాలు చాల ఇష్టపడి చేసాను.టీం అందరూ చాలా కష్టపడి చేశారు ట్రైలర్ చాలా ఇంప్రెస్సివ్,ఇంట్రెస్టింగ్ గా ఉంది.గగన్ సర్ స్టోరీ చెప్పినప్పుడే చాల ఎక్సయిట్ గా ఫీల్ అయ్యాను. ప్రొడ్యూసర్ గారు వెరీ సపోర్టివ్.కమల్ సర్ సినిమాలో నాకు చాలా టిప్స్ ఇచ్చాడు ఆయతో కలిసి నటించడం ఆనందంగా ఉంది.గగన్ గారు ఈ సినిమాను నా ఎక్సపెక్టషన్స్ కి మించి తీశారు.సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు.

నటి పూజ రామచంద్రన్ మాట్లాడుతూ … మరో మూవీ తో తెలుగు ఆడియన్స్ ముందుకు రావడంచాల సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు ఇంపార్టెంట్,ఛాలెంజింగ్ రోల్ ఇచ్చిన గగన్ గారికి ప్రొడ్యూసర్ రమేష్ బాబు గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమా లో నాది వీల్ చైర్లో కూర్చొని ఉండే పాత్ర. ఈ క్యారెక్టర్ మీకు అందరికి తప్పకుండా నచ్చుతుంది.డిఓపి అమరకుమార్ గారు నేను కలిసి చాలా క్రేజీ షాట్స్ చేసాం.కమల్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది.డైరెక్టర్,ప్రొడ్యూసర్ గారికి నా కృతజ్ఞతలు అని అన్నారు.

ఎడిటర్ ఎస్ .ఎస్ సుంకర మాట్లాడుతూ …… ఈ సినిమాలో మీరు చాలా సస్పెన్స్ ఫీల్ అవుతారు.ఈ సినిమా కోసం నేను ఎదురుచూస్తున్నాను. అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్,డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు అన్నారు

రంగు మూవీ డైరెక్టర్ వి .కార్తికేయ మాట్లాడుతూ …గగన్ గారు నాకు మంచి ఫ్రెండ్.ఈ సినిమాలో ఎమోషన్ చాల బాగా వర్కౌట్ అయ్యింది.అలా చాలా తక్కువ సినిమాలకు కుదురుతుంది. స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంది , సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది డైరెక్టర్ గగన్ గారికి,ప్రొడ్యూసర్స్ ,ఆల్ టెక్నీషియన్స్ కి ఆల్ది బెస్ట్ అన్నారు

కో ప్రొడ్యూసర్ శివ మద్దిపాటి మాట్లాడుతూ ….సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు

డైరెక్టర్ గగన్ గారు మాట్లాడుతూ ….ఈ సినిమా ఫస్ట్ లైన్ చెప్పగానే కమల్ గారు ఒప్పుకున్నారు.నేను హీరో గా మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకొనే స్టోరీ . అని సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు.కమల్ గారు ఈ సినిమాలో నాకు డైరెక్షన్ లో చాలా హెల్ప్ చేశారు. హీరోయిన్ మౌర్యాణి గారు పూజ గారు చాలా కోపరేటివ్.డ్రస్సింగ్ కి చాలా తక్కువ టైం తీసుకునే వారు అందుకే ఈ సినిమా 30 డేస్ లోనే షూటింగ్ పూర్తిచేయగలిగాం. మూవీ చాలా బాగా వచ్చింది.సినిమా,పాటలు మెత్తమ్ విజయవాడలోనే షూటింగ్ చేసాం. ఈ సినిమా ను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను.అన్నారు

హీరో కమల్ కామరాజ్ మాట్లాడుతూ ….ఈ ట్రైలర్ తో సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే నే హీరో .గగన్ గారు స్క్రీన్ ప్లే రాసిన పద్ధతి చూసి మేము అందరం ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాము. గగన్ గారితరువాత ఈ సినిమా ను మౌర్యాణి,పూజ వాళ్ళ భుజాలపై ఎత్తుకొని స్క్రిప్ట్ ను ముందుకు నడిపారు. ఆర్టిస్ట్ లు అందరూ సినిమాను చాలా సపోర్ట్ చేశారు.సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అని అన్నారు.దీపావళి తరువాత ప్రొమోషన్స్ లో మళ్ళీ కలుద్దాం అన్నారు.

ఈ సినిమాకు …లిరిక్స్ -పూర్ణాచారి,కరుణాకరన్. ఆర్ట్ డైరెక్టర్ -నూరిశెట్టి ఉత్తమకుమార్ .యాక్షన్-డ్రాగన్ ప్రకాష్.కొరియోగ్రాఫర్ – రాజ్ పైడి. పబ్లిసిటీ డిజైనర్ -నాగార్జున, ప్రొడక్షన్ కంట్రోలర్ -బాబు రెడ్డి, ఎడిటర్ -ఎస్.ఎస్ .సుంకర,డి ఓ పి -అమర కుమార్,మ్యూజిక్ డైరెక్టర్ -సత్యకష్యప్,కో ప్రొడ్యూసర్ -శివ మద్దిపాటి,ప్రొడ్యూసర్ -రమేష్ బాబు మున్నా,స్టోరీ -డైలాగ్స్-స్క్రీన్ ప్లే -డైరెక్షన్ గగన్ గోపాల్ ముల్క

http://industryhit.com/t/2018/11/law-trailer-launch-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here