” ‘సవ్యసాచి’ సినిమా కంటే గొప్ప మూవీ తో తెలుగు లోకి నేను ఎంట్రీ ఇస్తాను అనుకోవడం లేదు.” – నిధి అగర్వాల్‌

0
381

మోడల్‌ గా తన కెరీర్‌ ని స్టార్ట్‌ చేసి, గతేడాది ”మున్నా మైకేల్‌” సినిమాతో బాలీవుడ్‌ లో తెరంగేట్రం చేసి ఇప్పుడు తెలుగు లో అక్కినేని బ్రదర్స్‌ తో ఒకేసారి ‘సవ్యసాచి’, ‘మిస్టర్‌ మజ్ను’ లో జంటకడుతున్న అందాల భామ ”నిధి అగర్వాల్‌”..సవ్యసాచి సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా చెప్పిన విశేషాలు

నిధి అగర్వాల్‌ ……మీ గురుంచి…
నా నేటివ్‌ ప్లేస్‌ వచ్చేసి బెంగుళూరు కానీ నేను పుట్టింది హైద్రాబాద్లో అన్ని రకాల సినిమాలు చూస్తాను. అలాగే నాకు కన్నడ , తెలుగు , తమిళ్‌ భాషలు లైట్‌ గా తెలుసు.నేను హిందీలో నటించిన మున్నా మైకేల్‌ చిత్రం చూసి చందు సర్‌ నన్ను అప్ప్రోచ్‌ అయ్యారు.నన్ను కలిసి స్క్రిప్ట్‌ చెప్పారు ఈ విధంగా సవ్యసాచి వర్కౌట్‌ అయ్యింది.

తెలుగు లో డెబ్యూ మూవీ చెయ్యడం ఎలా అనిపించింది….
నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా గౌరవం.నా మొదటి సినిమా తెలుగు లో చెయ్యడం చాలా హ్యాపీ గా అనిపించింది. తెలుగు ఇండస్ట్రీ నాకు ఒక కొత్త ప్రపంచం లాంటిది. తెలుగు సినిమాలలో స్టోరీ, టెక్నిషన్స్‌ ,ఫీల్‌,డాన్స్‌ లకు ప్రాధాన్యం ఉంటుంది.అలాంటి తెలుగు ఇండస్ట్రీ తోనా సినిమా కెరీర్‌ స్టార్ట్‌ అవ్వడం అద ష్టం గా ఫీల్‌ అవుతున్న.సవ్యసాచి సినిమా కంటే గొప్ప మూవీ తో నేను ఎంట్రీ ఇస్తాను అనుకోవడం లేదు.

సవ్యసాచి గురించి….
సవ్యసాచి సినిమా ఒక కొత్త కాన్సెప్ట్‌. ఈ సినిమాను చందు సర్‌ చాలా పట్టుదలతో చేసాడు. చందు గారితో కలిసి పనిచెయ్యడం గొప్ప ఎక్సపీరియన్స్‌. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అని నమ్మకం ఉంది అన్నారు.

మైత్రి మూవీస్‌ లో పనిచెయ్యడం ఎలా అనిపించింది….
ఫస్ట్‌ మైత్రి మూవీస్‌ నుండి ఫోన్‌ కాల్‌ రాగానే సర్‌ నిజంగా చేస్తున్నారా అని ఎక్సయిట్‌ అయ్యాను. కొంత సేపటికి తేరుకోని మిగతా విషయాలు మాట్లాడాను.

ఈ సినిమాకు మీరే డబ్బింగ్‌ చెప్పారా…
లేదండి తెలుగులో ఇది నా ఫస్ట్‌ మూవీ కావడం తో నటన,డాన్స్‌ ల పైనే కాన్సంట్రేషన్‌ పెట్టాను. నా ద ష్టి లో డబ్బింగ్‌ పూర్తిగా తెలుగు నేర్చుకున్నతరువాతనే చెప్తే బాగుంటుం. అప్పుడే మనం పూర్తి న్యాయం చెయ్యగలం తప్పకుండా త్వరలోనే డబ్బింగ్‌ చెప్తాను.అని అన్నారు

సవ్యసాచి లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది….
ఈ సినిమాలో నా పాత్ర పేరు చిత్ర .ఇండిపెండెంట్‌ గా బ్రతికే ఒక అమ్మాయి. సినిమా కథ లో జరిగే ఒక సంఘటన తో ప్రేమ.ఎమోషన్‌ కలగలిపిన మంచి పాత్ర తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది.

చైతు తో వర్క్‌ ఎక్సపీరియన్స్‌…
చైతన్య గారు మంచి యాక్టర్‌,మంచి డ్యాన్సర్‌,సచ్‌ ఏ గుడ్‌ పర్సనాలిటీ. చైతు పర్ఫెక్ట్‌ పర్సన్‌.యాక్టింగ్‌ లో నాకు చాలా హెల్ప్‌ చేశారు.నా ఫస్ట్‌ సినిమా చైతు తో నటించడం చాల సంతోషం గా అనిపించింది.

డైరెక్టర్‌ చందు మొండేటి గారి గురించి ..
చందు సర్‌ వెరీ ఇంటలిజెంట్‌ పర్సన్‌,సినిమా లో పాత్రల పట్ల పూర్తి అవగాహన ఉన్న డైరెక్టర్‌,నాకు తెలిసి బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ లో కూడా తనకు అవగాహన ఉంది.సినిమా ను లాగ్‌ చెయ్యడం అస్సలు ఇష్టపడడు.ప్రేక్షకులకు ఏమి కావాలో పూర్తిగా తెలుసు.ఈ సినిమా కు చందు సర్‌ డైరెక్షన్‌ తప్పకుండా ప్లస్‌ అవుతుంది.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌…
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌ లో అఖిల్‌ తో మిస్టర్‌ మజ్ను సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇంకా స్క్రిప్ట్‌ లు వింటున్నా….

Click Here For Nidhi Agerwal Interview Gallery

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here