సిల్లీ మాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అరుణ్ ఆదిత్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తోన్న చిత్రం `24 కిస్సెస్`. అయోధ్యకుమార్ క్రిష్ణంసెట్టి దర్శకుడు. సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి నిర్మాతలు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలవతుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో..
సీనియర్ నరేశ్ మాట్లాడుతూ – “మిణుగురులు` సినిమా 7 నంది అవార్డులు గెలుచుకుంది. ఈ విషయం జయసుధగారు నాకు చెబితే హ్యాపీగా ఫీలైయ్యాను. ఆ సినిమా చూసిన తర్వాత అయోధ్య కుమార్‌గారి దర్శకత్వంలో పనిచేయాలనుకున్నాను. ఈ సినిమాలో పనిచేసే అవకాశం కలిగింది. సినిమా చాలా బావుంటుంది. డైరెక్టర్ కథను అద్భుతంగా తెరకెక్కించారు. సెంటిమెంట్స్‌తో ఉంటుంది. 24 కిస్సెస్ అనగానే.. రొమాంటిక్ సినిమా అనుకుంటారు. కానీ ఇది ఎమోషన్ మూవీ. సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. హెబ్బా పటేల్ చాలా ఇన్‌టెన్స్ ఉన్న నటి. మంచి మ్యూజిక్ కుదిరింది. నవంబర్ 15న సినిమా విడుదలవుతుంది“ అన్నారు.
చిత్ర నిర్మాత అనిల్ పల్లాల మాట్లాడుతూ – “కిస్ ముందు.. కిస్ తర్వాత ఉండే ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చక్కగా చూపించారు. కిస్సెస్‌ను రెస్పెక్ట్ చేయడం మన దేశంలో ఆనవాయితీగా వస్తుంది. ముద్దులుంటే సీన్స్‌ను సినిమాలో రిపీట్ చేయడం చాలా కష్టం. సినిమా టైటిల్ చూసి అందరూ యూత్ ఎంటర్‌టైనర్ అనుకుంటారు. వారితో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా సినిమా బాగా నచ్చుతుంది. సినిమాలో ఓ మిరాకిల్ పాయింట్ ఉంది. అందుకే ఈ సినిమా చేశాను. నరేశ్‌గారు, రావు రమేశ్‌గారు సినిమాలో చాలా మంచి పాత్రల్లో నటించారు. హెబ్బా పటేల్ చాలా మంచి హీరోయిన్ తనకు ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది “ అన్నారు.
చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ మాట్లాడుతూ – “ఈ సినిమా కోసం అరుణ్ ఆదిత్, హెబ్బా పటేల్ చాలా కష్టపడి పనిచేశారు. నరేశ్, రావు రమేశ్‌గారి పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది“ అన్నారు.
అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ – “హీరో నాని నన్ను ఓ సందర్భంలో కలిసినప్పుడు మంచి లవ్‌స్టోరీ చేయమని అన్నాడు. అప్పటి నుండి మంచి లవ్‌స్టోరీ కోసం వెయిట్ చేస్తుంటే అయోధ్యకుమార్‌గారు ఈ కథను చెప్పారు. కథలోని పాయింట్ చాలా బాగా నచ్చింది. మన పక్కింట్లో జరిగే పర్‌ఫెక్ట్ లవ్‌స్టోరీలా ఉంటుంది. రావు రమేశ్‌గారు, నరేశ్‌గారు రెండు పిల్లర్స్‌లా నటించారు. చాలా మంది కొత్త నటీనటులు కనపడతారు. సినిమాలోని ముద్దు సీన్స్ చేయడానికి హెబ్బా పటేల్ డైరెక్టర్‌కి సూచనలిచ్చింది“ అన్నారు.
హెబ్బా పటేల్ మాట్లాడుతూ – “నరేశ్, రావురమేశ్‌గారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. థియేటర్‌కు వచ్చే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని సినిమా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్“ అన్నారు.
ఆదిత్ అరుణ్, హెబ్బాపటేల్, నరేష్, రావు రమేష్, అదితి మైఖెల్, శ్రీని కాపా, మధు నెక్కంటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: హరి వర్మ, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, మనోజ్ యాదవ్, ఎడిటర్: ఆలయం అనిల్, బ్యాగ్రౌండ్ స్కోర్: వివేక్ ఫిలిప్, సంగీతం: జోయ్ బరువా, సినిమాటోగ్రఫర్: ఉదయ్ గుర్రాల, లైన్ ప్రొడ్యూసర్: చందా గోవింద రెడ్డి, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి, నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి, దర్శకుడు: అయోధ్యకుమార్ క్రిష్ణంసెట్టి
Click Here For Pressmeet Gallery
Click Here For Hebah Patel Gallery


