‘అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్‌,’పంతం’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌, కె.కె.రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్‌’. అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 20న హీరోయిన్‌ యామినీ భాస్కర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా యామినీ భాస్కర్‌ ఇంటర్వ్యూ ..

* ‘భలే మంచి చౌకబేరమ్‌’ చిత్రంలో నా పాత్ర పేరు ఆదర్శి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే నాకుందా లేదా అని కూడా చూసుకోకుండా అందరికీ హెల్ప్ చేసేస్తుం. హీరో కూడా నా మంచి మనసుని మోసం చేస్తాడు. అక్కణ్ణించి స్టోరీ బిగిన్ అవుతుంది. రియల్‌ లైఫ్‌లో కూడా నేను అంతే ఎదుటివారు కష్టాల్లో ఉంటే నా వల్లనైనా సాయం అందిస్తాను.

* ‘భలే మంచి చౌక్ బేరం’లో నాన్ సింక్ కామెడీ ఉంటుంది. కన్ఫ్యూజన్ వల్లే ఎక్కువ కామెడీ జెనెరేట్ అవుతూ ఉంటుంది. ఇక కాన్సెప్ట్ విషయానికి వస్తే కంప్లీట్ గా కొత్తగా ఉంటుంది. నటిగా నా వల్ల ఎంత సపోర్ట్‌ ఇవ్వగలుగుతానో అంతా చేశాను. మా టీమ్‌లో అందరం సినిమా బాగా రావడానికి ఎంతో కష్టపడ్డారు. సినిమా బాగా వచ్చింది. కాబట్టి టీమ్‌ అంతా చాలా నమ్మకంగా ఉన్నాం.

* డైరెక్టర్‌ మురళీగారు ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా తనకు కావాల్సిన అవుట్‌పుట్‌ను రాబట్టుకున్నారు. షూటింగ్ లో మహా అయితే 5 నుండి 10 మంది ఉండేవాళ్ళు. దాంతో కూల్ గా షూట్ చేసుకునే వాళ్ళం. చాలా ఫన్ ఉండేది లొకేషన్ లో.. నవీద్‌, పార్వతీశం సినిమాలో నాతో పాటు నటించారు. నవీద్‌ స్నేహితుడి పాత్రలో పార్వతీశం నటించారు. మాతో పాటు రాజా రవీంద్రగారి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది.

* నటిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈ 3 ఏళ్ళలో ప్రతి సినిమాకు కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. నేర్చుకున్నాను. మనం ఏదైనా సినిమా చేస్తున్నామంటే.. ఎలాంటి సినిమాలు పిక్‌ చేసుకోవాలనే దానిపై ఓ అవగాహన కలిగింది. ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలి తెలిసింది. నటిగా నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

* ప్రస్తుతం స్క్రిప్ట్స్‌ వింటున్నాను. తమిళంలో ఇది వరకు ఓ సినిమాలో నటించాను. ఆ తరవాత కూడా ఆఫర్స్ వచ్చాయి కానీ, మంచి బ్యానర్ లో వస్తే తమిళంలో కూడా నటిస్తాను.