కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘దేవదాస్’. సి.ధర్మరాజు సమర్పణలో వైజయంతి మూవీస్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య టి. దర్శకత్వంలో సి.అశ్వినీదత్ నిర్మిస్తున్న భారీ చిత్రమిది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించిన ‘స్టూడెంట్ నెం.1’ సెప్టెంబర్ 27న, సెప్టెంబర్ 28న ‘చిరుత’, సెప్టెంబర్ 30న ‘శుభలగ్నం’ చిత్రాలు విడుదలై బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. అలాగే ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రం విడుదలైన మే 9న ‘మహానటి’ విడుదలై సూపర్‌హిట్ అయింది. సెప్టెంబర్ చివరి వారంలో మూడు బ్లాక్‌బస్టర్స్‌ను విడుదల చేసిన వైజయంతి మూవీస్ ఇప్పుడు ‘దేవదాస్’ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయడం విశేషం.
‘దేవదాస్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని ల ఫస్ట్‌లుక్ సినిమాపై వున్న అంచనాలను రెట్టింపు చేసింది. నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. గ్లాసులో మందు పోసి ‘సోడా కావాలా… వాటర్ కావాలా’ అంటూ పక్కకు తిరిగే లోపు నాని.. గ్లాస్‌లోని స్మాల్ పెగ్‌ని తాగేసి ఏమీ తెలియనట్టు కూర్చోవడం, నాగార్జున షాక్ అవ్వడం.. ‘దాసు.. ఏంటి సంగతి’ అంటూ నానిని అడగడం చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఈ సీన్‌లో నాగార్జున, నాని ల ఎక్స్‌ప్రెషన్స్ నవ్వులు పూయిస్తున్నాయి. ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని నాని ట్వీట్ చేశారు. టీజర్‌తోపాటు ‘దేవా ఈరోజు మంచి రోజట. నాకొక స్మాల్ ప్లీజ్’ అంటూ ట్వీట్ చేసి టీజర్‌ను విడుదల చేశారు నాని. టీజర్‌లోనే కాదు, టీజర్ విడుదల చేస్తూ కూడా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఈవిధంగా అలరించారు కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉండబోతోందన్న విషయం టీజర్ ద్వారా తెలుస్తోంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఒక పాట మినహా ‘దేవదాస్’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన బ్యాంకాక్ షెడ్యూల్‌ని ఈమధ్యే పూర్తి చేశారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని, రష్మిక మందన్నా, ఆకాంక్ష సింగ్, నరేష్, బాహుబలి ప్రభాకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ సైనుద్దీన్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: సాహి సురేష్, సమర్పణ: సి.ధర్మరాజు, నిర్మాత: సి.అశ్వినీదత్, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య టి.



