నా సినిమా గురించి స్టార్స్ ట్వీట్ చేస్తే చూడాలనే కోరిక ‘గీత గోవిందం’ తో తీరింది – బన్నీ వాస్

0
433

–నిర్మాణంలోనే సినిమా చాలా బాగా వస్తోంది అని తెలుసు. ఒక హానెస్ట్ ఎంటర్టైనర్ తీస్తున్నాం అనే నమ్మకంతో ఉండేవాళ్ళం. హీరో విజయ్ దేవరకొండ మంచి రైజ్  లో ఉన్నారు కాబట్టి మంచి రెవిన్యూ వస్తుందని అనుకున్నాం కానీ ఈ రేంజ్ విజయాన్ని, కలెక్షన్స్ ని ఊహించలేదు. అలా ఊహించివుంటే ఈ ఏరియా అమ్మేవాడిని కాదేమో.

–అర్జున్ రెడ్డి లాంటి సక్సెస్ తర్వాత వస్తుంది కాబట్టి ఓపెనింగ్ బాగుంటుంది అనుకున్నాం కానీ ఇంత సునామి లా ఉంటుందనుకోలేదు.

–నేను పనిచేసే దర్శకులు అందరితో చాలా కలిసిపోతాను. దర్శకులకి పూర్తి స్వేచ్ఛ ని ఇస్తూ వాళ్ళకేం కావాలో పూర్తిగా అర్ధం చేసుకుంటాను.

–బుజ్జి (పరశురామ్) కథ చెప్పినప్పుడు విజయ్ కి నచ్చింది. కానీ నేను డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నాను ఇది ఓకే నా అడిగినప్పుడు ఈ సినిమా వల్ల క్లాస్ ఆడియన్స్ తో పాటు యూనివర్సల్ ఆడియన్స్ కి దగ్గిర అవుతావు అని సజెషన్ ఇచ్చాను. తను చాలా బాగా రిసీవ్ చేసుకుని ఆ నమ్మకం మీద సినిమా చేసేసాడు.

–విజయ్ దేవరకొండ లో జెన్యూనిటీ, సింప్లిసిటీ బాగా నచ్చుతాయి. ఏదైనా మాట్లాడాలని మాట్లాడడు. తన అవసరం ఉందనుకుంటేనే ఏదైనా మాట్లాడతాడు. తనతో వర్క్ చేస్తుంటే నా బ్రదర్ తో చేస్తున్నట్టు ఉంటుంది.

–అర్జున్ రెడ్డి లాంటి అగ్రెస్సివ్ క్యారెక్టర్ తర్వాత పూర్తి విరుద్ధమైన క్యారెక్టర్ చేస్తున్నాడని ఒకటి రెండు సార్లు నేనే ప్రస్తావించినా బుజ్జి, విజయ్ ఇద్దరూ అదే ఈ సినిమాకి కొత్తదనాన్ని తీసుకొస్తుంది అనేవారు. వాళ్ళ నమ్మకమే ఇవాళ నిజమైంది.

–ఏదైనా సినిమా గురించి పెద్ద స్టార్స్ అందరు ట్వీట్ చేస్తుంటే, నిర్మాతగా నేను ఇలాంటి సినిమా తీయాలి, నా సినిమా గురించి అలా ట్వీట్ చేస్తే చూడాలి అని ఉండేది. బన్నీ ఎడిటింగ్ రూమ్ లో సినిమా చూసి హగ్ చేసుకున్నాడు. మహేష్ బాబు గారు, చరణ్ బాబు సినిమా గురించి ట్వీట్ చేసినప్పుడు చాలా ఆనందపడ్డాను. నా కోరిక ఈ సినిమాతో తీరిపోయింది.

–లీకేజీ గురించి తెలిసినప్పటి నుండి నరకం అనుభవించాను. ఇంత కష్టపడి, ఖర్చు పెట్టి తీసిన సినిమా ఎవరో లాప్ టాప్ లో ఉంది అని తెలీగానే అసలు నిద్ర పట్టలేదు. పబ్లిసిటీ కోసం మేమె లీక్ చేశాం అనడంలో అసలు వాస్తవం లేదు. ఏ నిర్మాతైనా పూర్తి సినిమాని అలా వదులుకుంటారా. వర్క్ కి అవసరమైనప్పుడు హార్డ్ డిస్క్ లో కంటెంట్ ని కాపీ చేస్తాం. తర్వాత డిలీట్ చేస్తాం. అలా డిలీట్ చేసిన ఫైల్ ని రిట్రీవ్ చేశారు.

–1st టైం డిస్ట్రిబ్యూటర్ లు అందరూ రెండవ రోజే బ్రేక్ ఈవెన్ అవడం విశేషం. అందరూ ఊహించిన దానికంటే మూడు రేట్లు ఎక్కువ వస్తోంది. కేరళ లో 1st డే 14 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండవ రోజు కూడా 6 లక్షల గ్రాస్ వచ్చింది. అంత వర్షాల్లో కూడా అంత రావడం అసలు ఊహించలేదు. ఆ కలెక్షన్ ని అక్కడ ఇచ్చేయడమే కరెక్ట్ అనిపించింది.

–చిరంజీవి గారి ఫ్యామిలీ తో నాకు ఎంత పరిచయం ఉన్నా ఆయనతో నేను 5 నిమిషాల కంటే ఎక్కువ గడపలేదు. ఆయనంటే ఎంతో గౌరవం, చిన్న భయం కూడా. చిరంజీవి గారు మాకు సింహం లాంటి వారు. ఈ సినిమా తర్వాత పిలిపించుకుని ఒక గంట సేపు మాట్లాడారు. ఆయనతో కలిసి అప్పుడు తాగిన కాఫీ నా లైఫ్ లో బెస్ట్ కాఫీ. సక్సెస్ మీట్ కోసం చిరంజీవి గారిని పిలవడానికి వెళ్ళినప్పుడు, ఎదో చిన్న ఈవెంట్ లాగా కాకుండా సినిమా సక్సెస్ కి తగ్గట్టు భారీగా చేయమన్నారు.

–పరశురామ్ తో మరో సినిమా ఉంటుంది. పరశురామ్ చెప్పిన కథ చాలా నచ్చింది. చాలా విభిన్నంగా ఉంటుంది.

–బన్నీ గారి సినిమా విషయంలో రెండు పెద్ద న్యూస్ లు ఉన్నాయి. ఏదైనా ఫైనల్ అయ్యేవరకు ఆయన అనౌన్స్ చేయరు. లాక్ అయ్యాక నేనే చెప్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here