సూప‌ర్‌స్టార్ మ‌హేష్, ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌ల `స్పైడ‌ర్‌` నెల్లూరు ఏరియా హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ హ‌రి

0
368

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పెడర్‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుగా సెప్టెంబర్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నెల్లూరు ఏరియా హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత జి.హరి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని నెల్లూరులో అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయడానికి జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా జి.హరి మాట్లాడుతూ “స్పైడ‌ర్` వంటి ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను మా హ‌రి పిక్చ‌ర్స్ ద్వారా నెల్లూరు ఏరియాలో విడుద‌ల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని రికార్డ్ నెంబ‌ర్ థియేట‌ర్స్‌లో భారీ రేంజ్‌లో ప్ర‌ద‌ర్శించ‌డానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ అవ‌కాశాన్ని ఇచ్చిన మ‌హేష్‌బాబుగారికి, మురుగ‌దాస్‌గారికి, ఎన్‌.వి.ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here