‘కాటమరాయుడు’ రివ్యూ

0
73

కథ :

నలుగురు తమ్ముళ్ళని చూసుకునే అన్నగా ఊరికి పెద్దగా ఉండే కాటమరాయుడు (పవన్ కళ్యాణ్) కి ఆడవాళ్లన్నా, పెళ్ళన్నా పడదు. పెళ్ళైతే అన్నదమ్ములు విడిపోతారని తన తమ్ముళ్ళకి కూడా పెళ్లి చేయడు. అలాంటి కాటమరాయుడు, అవంతిక (శృతి హాసన్) ప్రేమలో పడటం ఆ ప్రేమని గెలిపించుకునే క్రమంలో అవంతిక కుటుంబానికి ఆపద ఉందని తెలియడం తో ఎం చేసాడనేది కథ.

నటన :

పవన్ కళ్యాణ్ తన మార్కు నటన, హావభావాలతో మెప్పించారు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో కామెడీ, రొమాన్స్ సన్నివేశాలలో మరింత పరిణితి కనబరిచారు. యాక్షన్ సన్నివేశాలలో తనదైన పంధాలో ఆకట్టుకున్నారు. ‘ఖుషి’ చిత్రం రిఫరెన్స్ లు, అయన స్వభావానికి సరిపోయే డైలాగులతో అభిమానులని అలరించారు కళ్యాణ్.

కథానాయికగా శృతి హాసన్ కథలో ప్రాముఖ్యత ఉండే పాత్రలో కనిపిస్తారు. నటన పరంగా ఆకట్టుకున్నారు. సంప్రదాయంగా కనిపిస్తూనే పాటల్లో గ్లామరస్ గా కనిపించారు. మొదటి అర్ధభాగం అంతా పక్కనే ఉండే పాత్రలో అలీ, కాటంరాయుడి మీద పగ తీర్చుకోవాలనే పాత్రలో రావు రమేష్ లవి సెపెరేట్ ట్రాక్స్ ఏ అయినా, వీరిద్దరి కామెడీ బావుంది. రెండవ అర్ధభాగంలో పృథ్వి కూడా పర్వాలేదు అనిపిస్తారు.

తమ్ముళ్లుగా అజయ్, శివబాలాజీ,కమల్ కామరాజ్, చైతన్య కృష్ణ సరిపోయారు. వీళ్ళలో అజయ్ పాత్ర బావుంది. ఇతర పాత్రల్లో నాజర్, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, తరుణ్ అరోరా తమ పరిధి మేర నటించారు.

బలాలు :

పవన్ కళ్యాణ్
వినోదం
ఫస్ట్ హాఫ్

బలహీనతలు :

నెమ్మదించే సెకండ్ హాఫ్

విశ్లేషణ :

‘కాటమరాయుడు’ తమిళ ‘వీరమ్’ కి రీమేక్. గతంలో ‘తడాఖా’,’గోపాల గోపాల’ వంటి రీమేక్ ల ని తెరకెక్కించిన కిషోర్ కుమార్ పార్దాసాని (డాలీ) దర్శకుడు. ‘కాటమరాయుడు’ లో ని కమర్షియల్ అంశాలని మేళవించిన తీరు చుస్తే రీమేక్ ని సరిగ్గా మలచగల దర్శకుడిగా డాలీ కి ఉన్న సామర్ధ్యం తెలుస్తుంది. తమిళ మాతృకకి తెలుగు నేటివిటీ కి సరిపోయేలా చేసిన మార్పులు బాగున్నాయ్. కామెడీ, యాక్షన్, రొమాన్స్ సన్నివేశాలు పవన్ కళ్యాణ్ కి తగ్గట్టు, అక్కడక్కడా చేసిన మార్పులు మొదటి అర్ధ భాగం సరదాగా సాగిపోడానికి ఉపయోగపడ్డాయి.

రెండవ అర్ధభాగానికి వచ్చే సరికి కామెడీ కి స్కోప్ తగ్గి కథ యాక్షన్, డ్రామా దిశగా వెళ్తుంది. ఇది కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో చూసే పంధాలో నే ఉండడం తో సినిమా డ్రాగ్ అనిపిస్తుంది. కాకపోతే కథనంలో వేగం ఉండేలా చూసుకోడం తో ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో కామెడీ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

అనూప్ అందించిన పాటలు, నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపిస్తాయి. ప్రసాద్ మురెళ్ళ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. బుర్ర సాయి మాధవ్ రాసిన డైలాగులు బాగున్నాయ్. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు మెప్పిస్తాయి.

బాటమ్-లైన్ : అలరించే కమర్షియల్ ‘రాయుడు’
రేటింగ్ : 3.25 / 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here