యాంగ్రీ మేన్ డా.రాజశేఖర్ హీరోగా `ఎల్‌బిడబ్ల్యూ`, `చందమామ కథలు` చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి `పి.ఎస్.వి గరుడ వేగ` (126.18ఎం ట్యాగ్‌లైన్) అనే టైటిల్‌ని నిర్ణయించారు. శివాని శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో జ్యో స్టార్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై తెరకెక్కుతోంది. ఈనెల 15 వరకు బ్యాంకాక్‌లో తాజా షెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు. ఫిబ్రవరి 4న డా.రాజశేఖర్ పుట్టినరోజును పురస్కరించుకుని `గరుడవేగ` ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉందింకా.


