క్యారెక్టర్ బేస్‌డ్ లవ్‌స్టోరీ…
– ‘నేను లోకల్’ మాస్ ఎంటర్‌టైనర్ కాదు. పక్కా తెలుగు సినిమా లవ్‌స్టోరీ. బాగా ఆటిట్యూడ్ ఉన్న బాబు అనే ఒకడు ఒకమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ తర్వాత వాళ్ళ లవ్‌స్టోరీ ఏమైందన్నదే సినిమా. అలాగే ‘నేను లోకల్’ అన్న టైటిల్ పెట్టడానికి ప్రీ క్లైమాక్స్‌లో టైటిల్ జస్టిఫికేషన్ ఉంటుంది. ఆ జస్టిఫికేషన్ ఏంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..
అన్నీ ప్రేమకథలే..
– నేను ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ కూడా లవ్‌స్టోరీస్. లవ్ ఎలిమెంట్ లేకుండా సినిమా ఉండదు. నా సినిమాలనే కాదు, లవ్‌స్టోరీ లేని మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ సినిమాను చూపించండీ? ‘భలే భలే మగాడివోయ్’లో మెయిన్ లవ్‌స్టోరీ, హీరోకు మతిమరుపు ఉంటుంది. అలాగే మజ్ను చూస్తే లైట్ డ్రివన్ లవ్‌స్టోరీ. అలాగే ఇప్పుడు ‘నేను లోకల్’ కూడా బాబు, కీర్తి మధ్య ప్రేమకథే.
రోల్ గురించి…
– ఇంతకు ముందు చెప్పినట్లు పక్కా ఆటిట్యూడ్ ఉండి, ఎవరెన్ని చెప్పినా, తాను అనుకున్నది చేసే ఓ కుర్రాడిగా ఇందులో కనిపిస్తా. ఉదాహరణకు హీరో, హీరోయిన్‌తో మాట్లాడుతన్నప్పుడు హీరోయిన్ తండ్రి ఉన్నా భయపడకుండా తను అనుకున్నది చెప్పేసే క్యారెక్టర్.
ఎప్పుడో చేయాల్సింది…
– దిల్‌రాజు గారితో నేను ఎప్పుడో సినిమా చేయాల్సింది. నా రెండో సినిమా అప్పట్నుంచి ఆయన నాకు చాలా కథలు తీసుకొచ్చి వినిపించారు. ఎందుకో మా కాంబినేషన్ కుదిరేది కాదు. దిల్‌రాజుగారి సినిమాలు ఎందుకు చేయడం లేదని సన్నిహితులు హెచ్చరించేవారు కూడా. మేమిద్దరం చాలాసార్లు అనుకున్నాం ఎలాగైనా ఒక సినిమా చేయాలని. నేను లోకల్‌తో అన్నీ కుదిరి దిల్‌రాజు గారితో పనిచేసే అవకాశం దక్కింది.
డైరెక్టర్ గురించి…
– త్రినాథరావుకు ఈ తరహా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ తీయడంలో మంచి పట్టుందనిపించింది. రైటర్ ప్రసన్నకుమార్‌తో త్రినాథరావు కలిశారంటే ఇద్దరూ కలిసి మ్యాజిక్ చేసేస్తారు. నేను లోకల్ అంతా సరదాగా సాగిపోవడంలో వీరిద్దరి కాంబినేషనే ప్రధాన కారణం అని చెప్పగలను.
దేవితో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్…
– దేవిశ్రీ ప్రసాద్‌కు నా సినిమాలంటే ఇష్టం, అలాగే నాకు కూడా దేవి మ్యూజిక్ అంటే ఇష్టం. మా కాంబినేషన్‌లో ఓ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలాసార్లే ఎదురుచూశా. చివరకు నేను లోకల్‌తో అది సాధ్యమైంది. సినిమా విడుదలకు ముందే పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయంటే ఆ క్రెడిట్ పూర్తిగా దేవీకే దక్కాలి.
అన్నీ పుకార్లే…
– నేను లోకల్ సినిమాను రీ షూట్ చేసినట్లు వచ్చిన వార్తలన్నీ పుకార్లే..ఎందుకంటే సినిమాను ముందుగా డిసెంబర్ 25న విడుదల చేయాలనుకున్నాం. అంటే సినిమాను డిసెంబర్ 5కంతా షూటింగ్ పూర్తి చేయాలి. కానీ కీర్తి సురేష్ తమిళంలో బిజీగా ఉండటంతో హీరోయిన్ డేట్స్ కుదరలేదు. అందువల్ల అనుకున్న టైమ్‌కి రాలేకపోయాం. ఆ తర్వాత మాకు కనిపించిన పర్ఫెక్ట్ డేట్ ఇదే కాబట్టి ఇప్పుడొస్తున్నాం.
ఏ మార్పు లేదు…
– హీరోగా ఇప్పుడొచ్చిన ఈ పేరు వల్ల కథల ఎంపికలోఅసలు మార్పులేం లేవు. పైసా అయినా, జెండాపై కపిరాజు అయినా, భలే భలే మగాడివోయ్ అయినా,..ఎప్పుడైనా ఓ కథను నమ్మే నేను సినిమాను ఒప్పుకున్నా. అందులో కొన్ని ఆడలేదు. అలాగే ఇప్పుడు సక్సెస్ వచ్చాక నా ప్రవర్తనలోనూ ఎటువంటి మార్పూ లేదు.
అదొక అదృష్టం…
– నన్నడిగితే బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడమే ఒక అదృష్టం. ఇప్పుడెవరైనా వచ్చి ‘నేను మీ ఫ్యాన్‌ని’ అని చెబితే అతడు కచ్చితంగా నాకు మాత్రమే ఫ్యాన్ అయి ఉంటాడు. ఆ ఆలోచనే నాకు ఉత్సాహాన్నిస్తుంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్….
– ప్రస్తుతం డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నా. శివ నిర్వాణా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నేను, ఆది, నివేదా థామస్ లీడ్ రోల్స్ చేస్తున్నాం. ఈ వారం నుంచే యూఎస్‌లో ఈ సినిమాకు సంబంధించి ఒక నెల రోజుల షెడ్యూల్ ఉంది. అలాగే దిల్‌రాజుగారితో మరో సినిమా చేస్తాను. వాటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.


