అక్కినేని మానసచోరుడు నాగచైతన్య, అందాల జెస్సీ సమంత నిశ్చితార్థ కార్యక్రమం నేటి సాయంత్రం హైదరాబాద్ ఎన్-కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. తాను వలచిన సఖి సమంతకు నాగచైతన్య నిశ్చితార్థపు అంగుళీకం తొడిగాడు. అలాగే తన మనసు దోచిన సఖుడు నాగచైతన్యకు సమంత అంగుళీకంను తొడిగారు.
ఈ వేడుక ఆద్యంతం కుటుంబసభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు సమక్షంలో కన్నులపండువగా సాగింది. అక్కినేని నాగార్జున- అమల దంపతులు, అఖిల్- శ్రేయాభూపాల్ జోడీ దగ్గరుండి ఈ నిశ్చితార్థ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో నాగచైతన్య సూటు-బూటులో స్మార్ట్‌గా కనిపిస్తే, బంగారు వర్ణం- తెలుపు వర్ణం కలగలిపిన ధగధగల చీరలో సమంత మెరిసిపోయారు.





