“స‌క్సెస్ ద‌క్కేవ‌ర‌కూ త‌పించ‌డం దిల్‌రాజు వ‌ద్ద‌నే చూడ‌గ‌లం” – మెగాస్టార్ చిరంజీవి

0
377

ద‌మ్మున్న సినిమాలు `దిల్‌`తో తీసే నిర్మాత దిల్‌రాజు! -మెగాస్టార్ చిరంజీవి

“నిర్మాత అనే ప‌దానికి దిల్‌రాజు ఓ నిర్వ‌చ‌నం. త‌ను సెంటిమెంటు ఉన్న నిర్మాత. సినిమా ప్రారంభం నుంచి స‌క్సెస్ ద‌క్కేవ‌ర‌కూ త‌ప‌న ప‌డ‌డం త‌న వ‌ద్ద మాత్ర‌మే చూడ‌గ‌లం“ అని ప్ర‌శంసించారు మెగాస్టార్ చిరంజీవి. శ‌ర్వానంద్‌-అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మించిన `శ‌త‌మానం భ‌వ‌తి` సంక్రాంతి బ‌రిలో దిగ్గ‌జాల‌(మెగాస్టార్‌, న‌ట‌సింహా సినిమాలు)తో పోటీప‌డి ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా దిగ్విజ‌యంగా రెండో వారంలోనూ చక్క‌ని ఆద‌ర‌ణ పొందుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో ముఖ్య అతిధిగా పాల్గొన్న మెగాస్టార్ చిత్ర‌నిర్మాత దిల్‌రాజును ప్ర‌శంసించారు.

చిరు మ‌రిన్ని సంగ‌తులు ముచ్చ‌టిస్తూ -“ఓ సినిమాని మంచి స్థాయికి తీసుకెళ్ల‌డంలో దిల్‌రాజు ప్ర‌ముఖ పాత్ర పోషిస్తారు. స‌క్సెస్ ద‌క్కే వ‌ర‌కూ త‌ప‌న‌ప‌డ‌తారు. అంతేకాదు త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన వి.వి.వినాయ‌క్‌ను మ‌ర్చిపోక‌పోవ‌డం అన్న‌ది గ‌మ‌నించాల్సిన విష‌యం. దిల్‌రాజు అనే పేరుకు అన్ని విధాలా అర్హుడు” అని అన్నారు.

సినిమాలో ఇత‌ర న‌టుల గురించి చిరు మాట్లాడుతూ -“నరేష్ ను ప్రతి ఏటా ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌లో క‌లుస్తుంటాను. మా మధ్య మంచి అనుబంధం ఉంది. ఇంద్రజను చూసి చాలా కాలమైంది. రామ్ చరణ్, శర్వా ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. శ‌ర్వానంద్‌ సినిమాల్లో నటిస్తాడని అస్సలు ఊహించలేదని చిరంజీవి అన్నారు. నా బిడ్డకు మంచి విజయం దక్కిందంటే అంతకు మించిన సంతోషం ఏముంటుంది. స‌హ‌జ‌న‌టి జయసుధ ఏ క్యారెక్టర్‌లో ఆయినా అలా ఇమిడిపోతారు, ఆమె ఒక ద్రవం లాంటి వారు. ఏ సినిమాలో ఏ పాత్ర ఇచ్చినా చేసేస్తారు. సినిమాలు చేసుకుంటూ కూడా రాజకీయాల్లో ఉండొచ్చిన జయసుధ గారు నాకు తెలియజెప్పారు“ అన్నారు.

వి.వి.వినాయ‌క్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప్ర‌కాష్‌రాజ్‌, జ‌యసుధ‌, శ‌ర్వానంద్‌, దిల్‌రాజు, వేగేష్న స‌తీష్ త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here