పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `కాటమరాయుడు` చిత్రీకరణ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. పవన్, శృతి అండ్ టీమ్ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో షూటింగులో పాల్గొంటోంది. ఇస్మాయిల్‌ఖాన్ పేట- సప్త ప్రాకారయుత దుర్గా భవానీ మాత ఆలయంలో కీలకసన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అమ్మవారి జాతరకు సంబంధించిన సన్నివేశాల్ని ప్రధాన తారాగణంపై డాలీ తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయితే మొత్తం 70 శాతం చిత్రీకరణ పూర్తయినట్టేనని నిర్మాత శరత్‌మరార్ తెలిపారు.
తమిళ బ్లాక్‌బస్టర్ `వీరమ్` రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శృతీహాసన్ కథానాయికగా నటిస్తోంది. శివ బాలాజీ, కమల్ కామరాజు … పవన్ సోదరులుగా నటిస్తున్నారు. అజయ్, రావు రమేష్, తరుణ్ అరోరా తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనూప్‌రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తమ్ముళ్ల కోసం, తనని నమ్ముకున్న వాళ్ల కోసం పోరాటం సాగించే మిడిలేజీ డాన్‌గా పవన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఉగాది కానుకగా సినిమాని రిలీజ్ చేయాలన్నది ప్లాన్.


