ఫిబ్ర‌వ‌రిలో య‌ముడు-3, నేను లోక‌ల్‌

0
394

ఫిబ్ర‌వ‌రిలో రెండు క్రేజీ సినిమాలు రిలీజ‌వుతున్నాయి. ఒక‌టి సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియోగ్రీన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన భారీ చిత్రం `ఎస్‌-3` (య‌ముడు 3 తెలుగులో) ఫిబ్రవరి 9 న   .., నాని హీరోగా దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌న `నేను లోక‌ల్`  ఫిబ్రవరి ౩న బ‌రిలో దిగుతున్నాయి.

సింగం సిరీస్‌లోనే అత్యంత భారీ క్రేజుతో రిలీజ‌వుతున్న ఎస్‌-3పై భారీ అంచ‌నాలున్నాయి. సూర్య ఈజ్ బ్యాక్‌. అంత‌ర్జాతీయ కేటుగాళ్ల ప‌నిపట్టే ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్‌గా సూర్య ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే టీజ‌ర్ల‌కు, పోస్ట‌ర్ల‌కు విప‌రీత‌మైన క్రేజు వ‌చ్చింది. ట్రైల‌ర్ల‌లో సూర్య పంచ్ డైలాగుల‌కు అద్భుత స్పంద‌న వ‌స్తోంది. మాస్‌, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల్ని మెప్పించే చిత్ర‌మిద‌న్న టాక్ వినిపిస్తోంది. అలాగే వ‌రుస స‌క్సెస్‌ల‌తో జోరుమీదున్న నాని న‌టించిన `నేను లోక‌ల్‌` చిత్రంపైనా భారీ అంచ‌నాలే ఉన్నాయి. మ‌రోసారి నాని స‌క్సెస్ అందుకుంటాడ‌న్న టాక్ న‌డుస్తోంది. నానికి ఓవ‌ర్సీస్‌లోనూ చ‌క్క‌ని మార్కెట్ ఉంది కాబ‌ట్టి అంచ‌నాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఖైదీనంబ‌ర్ 150, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, శతమానం భవతి చిత్రాలు కొత్త సంవ‌త్స‌రంలో శుభారంభాన్నిచ్చాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలు స‌క్సెస్ జోరును కొన‌సాగిస్తాయ‌నే ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here