`ఖైదీ నంబ‌ర్ 150` సినిమా `ఠాగూర్` స్థాయి విజ‌యం సాధిస్తుంది – మెగాస్టార్ చిరంజీవి

0
124

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదల సమర్పణలో కొణిదల ప్రొడక్షన్స్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మాతగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది. సినిమా విడుదల సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవల పాత్రికేయులతో `ఖైదీ నంబర్‌ 150′ సినిమా గురించి మాట్లాడారు.

గతంలో కూడా మీ ఆడియో వేడుకలు ఘనంగా జరిగాయి. రీసెంట్‌గా ‘ఖైదీ నంబర్‌ 150’ ఆడియో గ్రాండ్‌గా జరిగింది.ఈ సినిమా ఆడియో వేడుకకు, గతంలో జరిగిన వాటికి తేడా ఏమీ గమనించారు?
– గతంలో ఏదైనా ఫంక్షన్‌ చేస్తే అభిమానులు, ప్రేక్షకులు వేలల్లో వచ్చేవారు. ఇప్పుడు ఫంక్షన్‌ అంటే లక్షల్లో వస్తున్నారు. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ కి పోలీసుల లెక్కల ప్రకారం రెండు లక్షలకు పైగా జనం వచ్చారని తెలిసింది. చాలా సంవత్సరాల తర్వాత నా సినిమా ఫంక్షన్‌ జరగడం చాలా హ్యాపీగా అనిపించింది.

అక్కినేని నాగేశ్వరరావుతో నటించిన శ్రీదేవి తర్వాత నాగార్జునతో నటించింది. అయితే కాజల్‌ చరణ్‌తో ఫస్ట్‌ నటించి ఆతర్వాత మీతో నటించింది మీరేమంటారు..?
– నవ్వుతూ …ఇలాంటివి సినిమాల్లో జరగలేదు. అరుదుగానే జరగుతుంటాయి. కాజల్‌ హీరోయిన్‌ అయితే ఆడియెన్స్‌ యాక్టెప్టెన్స్‌ అనేదే ఎలా ఉంటుందోనని అనుకున్నాం. కానీ ఫోటోలు విడుదలైన తర్వాత మా పెయిర్‌ చూడడానికి బాగుంది అని అందరూ యాక్సెప్ట్‌ చేయడం హ్యాపీగా అనిపించింది.

మీ 150వ సినిమాగా రీమేక్‌ సినిమా చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉందా….?
– అలాగని ముందు అనుకోలేదు. 150వ సినిమా చేయాలని అనుకోగానే ముందుగా స్ట్రెయిట్‌ స్టోరీతో సినిమా చేయాలని కథలను చాలా విన్నాను. ఇప్పుడు నేను చేసే సినిమాల్లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు సోషల్‌ మెసేజ్‌ ఉండాలి అనుకున్నాను. ఠాగూర్‌, స్టాలిన్‌ తరహాలో ఉండే సినిమా చేయాలి అనుకున్నాను. ఆ టైమ్‌ లో తమిళ మూవీ కత్తి చూశాను. నాకు కరెక్ట్‌గా యాప్ట్‌ అవుతుందనిపించింది. రైతు స‌మ‌స్య‌ల గురించి మంచి సందేశంతో ఉన్న ఈ చిత్రం ఠాగూర్‌లా స్థాయి విజ‌యం సాధిస్తుంద‌ని అనుకుంటున్నాను. సినిమాలో హీరో డబుల్‌ రోల్‌ చేయడం, ఓ క్యారెక్టర్‌ సాఫ్ట్‌గా ఉంటే, మరో క్యారెక్టర్‌ మాస్‌ ప్రేక్షకులకు నచ్చేలా ఉండటంతో సినిమా చూసిన నాతో పాటు అందరికీ సంత ప్తికరంగా అనిపించింది. ఈ సినిమా రీమేక్‌ చేస్తే బాగుంటుంది అనిపించింది చేశాం. అయితే పర్టికులర్‌గా ఈ టైమ్‌ లోనే 150వ సినిమా చేయాలి అని ముందుగా ఏమీ అనుకోలేదు. సినిమాలోకి రమ్మని మిత్రులు, శ్రేయోభిలాషులు అనడం…ముఖ్యంగా అమితాబ్‌, రజనీకాంత్‌ లు కూడా నన్ను సినిమా చేయమన్నారు. అందరూ ఇంతలా చెబుతుంటే ఎందుకు చేయకూడదు అనిపించే సినిమా చేశాను.

పదేళ్ళ తర్వాత షూటింగ్‌లో పాల్గొన్నారు కదా..ఎలా అనిపించింది?
– శంకర్‌ దాదా జిందాబాద్‌ తర్వాత నేను హీరోగా చేసిన సినిమా ఇది. అప్పటికీ ఇప్పటికీ షూటింగ్‌ విషయంలో పెద్దగా తేడాకూడా ఏమీ కనిపించలేదు.కాకపోతే షూటింగ్‌ కి వెళ్లినప్పుడు ఇది కదా మన ఏరియా అనిపించింది. ఫస్ట్‌ నుంచి చాలా కాన్పిడెంట్‌ గానే ఉన్నాను కానీ..ఎప్పుడూ టెన్షన్‌ ఫీలవలేదు.

తమిళ మాతృతక కత్తి సినిమాకు, ఖైదీ నెం 150కి ఎలాంటి మార్పులు చేశారు?
– కత్తిలో అసలు కామెడీ ఉండదు. ఇందులో కామెడీ యాడ్‌ చేశాం. అలాగే సాంగ్స్‌ ను కూడా సిట్యూవేషన్‌ తగ్గట్టు ఉండేలా చేశాం.ఇలా మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసాం. అలాగే డైలాగ్స్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం.

ఫిట్‌నెస్‌ పరంగా ఎలాంటి కేర్‌ తీసుకున్నారు?
– నా ఇంట్లోనే ట్రైనర్‌ ఉన్నాడు రామ్‌ చరణ్‌. నేను ఎలా ఉండాలో చరణే కేర్‌ తీసుకున్నాడు. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్‌ కాబట్టి తన సినిమా హీరో బాగా కనిపించాలని ఆ రకంగా కేర్‌ తీసుకున్నాడు.

ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ లో నాగబాబు వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఆ వేదిక పై నాగబాబు ఆరకంగా స్పందించడం ఎంత వరకు కరెక్ట్‌?
– సాధారణంగా అలా అంటే ఎవరైనా హార్ట్‌ అవుతారు. మేం కూడా హార్ట్‌ అవుతాం. అలాగే నాగబాబు హార్ట్‌ అయ్యాడు. ఆ వేదిక పై తన అభిప్రాయం చెప్పాడు. ఆ వేదిక కరెక్టా అంటే ఇలాంటి సందరాÄ్బలు, మాట్లాడే సిచ్యువేషన్స్‌ మళ్లీ ఎప్పుడో రావచ్చు. అందుచేత నాగబాబు అలా రెస్పాండ్‌ అయ్యాడు.

ఇద్దరూ స్టార్స్‌ సినిమా సంక్రాంతి బరలో ఉండటంతో అభిమానుల్లో పోటీ వాతావరణం నెలకొంది. ఈ పోటీ పై మీరేమంటారు..?
– బాలక ష్ణ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవంకు నేను వెళ్లాను. సోదరుడు బాలక ష? సినిమా విజయం సాధి¸ంచాలి అని చెప్పాను. 100వ సినిమాకి అలాంటి చారిత్రాత్మక కథను ఎంచుకోవడంలోనే తొలి విజయం సాధించినట్టు అని చెప్పాను. సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను.

అమీర్‌ఖాన్‌ పి.కె. తరహా సినిమా చేస్తారా..?
– పి.కె లో ఫస్ట్‌ సీన్‌ లేకుండా ఉంటే చేస్తాను (నవ్వుతూ…) అమీర్‌ ఖాన్‌ గ్రేట్‌ ఏక్టర్‌. అంత టాలెంట్‌ నాలో ఉంది అనుకోవడం లేదు. అమీర్‌ ఖాన్‌ నాతో కలిసి నటించాలి అని చెప్పడం నాలో ఉత్సాహాన్ని ఇస్తుంది. మేమిద్దరం కలిసి చేసే కథ కుదిరితే చేస్తాం. ఈ సందర్భంగా అమీర్‌ ఖాన్‌ కు థ్యాంక్స్‌ తెలియచేస్తున్నాను.

9 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత సినిమా చేశారు కదా, డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేశారా..?
– నిజం చెప్పాలంటే మా అమ్మాయి పెళ్లి సందర్భంగా జరిగిన సంగీత్‌ కార్యక్రమంలో ఓ అరనిమిషం పాటు డ్యాన్స్‌ చేశామనే తప్పా ఎక్కడా చేయలేదు. అయితే ఎక్కడన్నా మంచి ట్యూన్‌ వింటే రేసుగుర్రంలో శ తిహాసన్‌ లా పైకి డ్యాన్స్‌ చేయపోయినా లోపల మాత్రం డ్యాన్స్‌ చేసేవాడిని.

‘ఖైదీ నంబర్‌ 150’లో సిగ్నేచర్‌ స్టెప్‌ ఉంటుందా?
– లారెన్స్‌ మళ్ళీ నాతో వీణ స్టెప్‌ వేయించాడు. అల్రెడి నేను చేసేశాను కదా..అని కూడా అన్నాను. అందరూ చేయడం వేరు, మీరు చేయడం వేరు..అని చెప్పి మరో స్టయిల్‌ ఆఫ్‌ వీణ స్టెప్‌ను ఖైదీ నంబర్‌ 150 చిత్రంలో లారెన్స్‌ చేయించాడు.

స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ తో హిందీలో సినిమాలు వస్తున్నాయి మరి తెలుగులో ఎందుకు రావడం లేదు..?
– వెంకటేష్‌ గురు చేస్తున్నాడు కదా..! కాకపోతే బాలీవుడ్‌ లో వచ్చినంతగా తెలుగులో రావడం లేదు దానికి కారణం ఏమిటంటే…అలాంటి కథలు స్టార్స్‌ కి చెప్పకపోవడమే.

హీరోగా చరణ్‌ కెరీర్‌ ఎలా ఉంది అనుకుంటున్నారు…?
– హీరోగా చరణ్‌ కెరీర్‌ను బాగా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. మంచి సినిమాలు డిఫరెంట్‌ సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు. అలా ఆలోచించే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర కావాలని ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా చేశాడు. రీసెంట్‌గా చరణ్‌ చేసిన ధ వ సినిమాలో చాలా ఇన్‌టెన్స్‌ యాక్టింగ్‌ నాకు చాలా బాగా నచ్చింది. చరణ్‌ కెరీర్‌ విషయంలో హ్యాపీ.

నిర్మాతగా చరణ్‌ మారాడు కదా…?
– తన ఒక పక్క సినిమాలు చేస్తూనే నా 150వ సినిమాను నిర్మించడం చాలా గొప్పగా అనిపించింది. నా వరకు వస్తే, ఇలాంటి విషయాలను నాగబాబు చూసుకునేవాడు. నేను సినిమాలపైనే కాన్‌సన్‌ట్రేషన్‌ చేసేవాడిని. కానీ చరణ్‌ నిర్మాతగా మారుతానని అన్నప్పుడు ఎందుకు అన్నట్లు చూస్తే, ఒకప్పుడు మీ వెనుక ఎవరూ లేరు. కానీ ఇప్పుడు నా వెనుక చాలా మంది ఉన్నారు. వారి సపోర్ట్‌తో సినిమాను బాగా చేస్తానని చెప్పాడు.

150 సినిమాల్లో అనేక పాత్రలు చేశారు..ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
– ఎన్ని పాత్రలు చేసినా ఇంకా ఏదో చేయాలని ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు చనిపోయే వరకు నటిస్తూనే ఉన్నారు. ప్రతి ఆర్టిస్టు చనిపోయే వరకు నటించాలనే అనుకుంటాడు. అయితే…ప్రేక్షకులు మనం తెర పై కనపడితే ఎంజాయ్‌ చేసేలా ఉండాలి కానీ…వీడు ఇంకా నటిస్తున్నాడా అనిపించుకోకూడదు.

ఖైదీ నెం 150 ఫస్ట్‌ డే ఎంత కలెక్ట్‌ చేస్తుంది..? ఎలాంటి రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుంది అనుకుంటున్నారు..?
– ఒకప్పుడు సినిమాలు 50 రోజులు, 100 రోజులు ఆడేవి, కానీ ఇప్పుడు మొదటి మూడు రోజుల కలెక్షన్స్‌, ఫస్ట్‌ వీక్‌, సెకండ్‌ వీక్‌ కలెక్షన్స్‌ను చూస్తున్నారు. సాధారణంగా నేను రికార్డ్స్‌ గురించి పట్టించుకోను. ఆ విషయంలో నాకు జీరో నాలెడ్జ్‌. కలెక్షన్లు, రికార్డుల లెక్కలు చరణ్‌ చూసుకుంటాడు.

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?
– పరుచూరి బ్రదర్స్‌ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే కథ స్టాండ్‌ బైలో ఉంచాం. అలాగే ధృవ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి ఓ డిఫరెంట్‌ స్టోరీ రెడీ చేస్తున్నాడు. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతార్ట్స్‌ బ్యానర్‌పై 152వ సినిమా చేస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here