సర్వసతి ఫిల్మిస్ న్యూ ఇయర్ పోస్టర్స్

0
939

శ్రీ సరస్వతి ఫిల్మిస్ పతాకం పై తాజాగా రిలీజైన మన్యం పులి విజయ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. మల్లూవుడ్ మోహన్ లాల్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీ దిగ్విజయంగా 30 రోజులు ముగించుకొని 50 రోజుల మైలు రాయిని దాటే దిశగా పయనిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి మన్యంపులి చిత్రాన్ని విశేషంగా ఆదరించిన తెలుగు ప్రేక్షకుల కి చిత్ర బృందం తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలానే ఇదే బ్యానర్ పై యంగ్ హీరో నాగాఅన్వేష్, బబ్లీ బ్యూటీ హెబ్బాపటేల్ జంటగా తెరకెక్కుతోన్న ‘ఏంజెల్’ దాదాపు 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకొందని త్వరలో మరో దశ షూటింగ్ మొదలుపెట్టి వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ఏంజెల్ నిర్మాత భువన్ సాగర్ తెలిపారు. దాంతో పాటే సరస్వతి ఫిల్మిస్ బ్యానర్ నుంచి వస్తోన్న వినూత్న చిత్రాల్ని విశేషంగా ఆదరిస్తోన్న తెలుగు సినీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here