ఎన్నెన్నో పువ్వులమీదవాలి పీల్చిన మకరందాన్ని తెచ్చి తేనెటీగ తుట్టెలోపెట్టినట్టు
ఎన్నెన్నో మంచిమంచి సినిమాల కధాకమామీషులను సంగ్రహించి ఈ పుస్తకాల అక్షరాలలో నిక్షిప్తం చేసిన రచయిత,సినీ విశ్లేషకులు Suryaprakash Josyula గారికి అభినందనలతోపాటు ధన్యవాదాలు కూడా.
కధాసంగ్రహాలతోపాటు ఆ కధలు,స్క్రీన్‌ప్లేలు ఎలా పురుడుపోసుకున్నాయో, ఆయా సినిమాల నిర్మాణపూర్వాపరాలను కూడా పొందుపరచటం ఆసక్తిని రేకెత్తించి రచయిత పరిశోధనాసక్తిని, కృషిని మనకు తెలియజేస్తుంది.
ఇందులో నేను చూసిన సినిమాలు కూడా కొన్ని రచయితచేసిన వ్యాఖ్యానాలతో మరో కొత్తకోణంలో కనిపిస్తే, చూడని సినిమాలు వెంటనే చూసేయాలన్నంత ఉత్సుకతను రేకెత్తించాయి.
సినీ, సాహిత్యాభిమానులతోపాటుగా ముఖ్యంగా సినీపరిశ్రమలోని రచనా విభాగం ,దర్శకత్వ విభాగాలలో వున్నవారికి ఇలాంటి పుస్తకాలెంతో ఉపయోగకరం.
ఎందుకంటే గురువులవద్ద నేర్చుకునే విద్య ప్రాధమిక నియమాలు, పరిశ్రమలో మెలగవలసిన తీరు వరకు మాత్రమే పరిమితం. మంచిమంచి సినిమాలు చూస్తూ తమ సొంత ప్రతిభాపాటవాలను మెరుగుపర్చుకుంటూ నేర్చుకోవలసిందే ఎక్కువ వుంటుంది.
మరి అలాంటి మంచి సినిమాల ఎంపిక ఎలా అంటే ఇదుగో ఇలాంటి పుస్తకాలు చెబుతాయి.
తప్పక చూడవలసిన 110 సినిమాలతో మనకు పరిచయమౌతుందీ పుస్తకాలలో.
Suryaprakash Josyula గారూ మీ నుండి ఇలాటివి కనీసం మరో 30 పుస్తకాలనైనా ఆశిస్తున్నాం.
___________ దేవీప్రసాద్.



