కామెడీ, ఎమోషన్స్ తో తెర‌కెక్కిన `చావు కబురు చల్లగా` స‌క్సెస్ పై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం – యంగ్ హీరో కార్తికేయ‌

0
434

ఆర్ఎక్స్‌100 మూవీతో హీరోగా ప‌రిచ‌య‌మై మొద‌టిసినిమాతో సూప‌ర్‌హిట్ సాధించారు యంగ్ హీరో కార్తికేయ‌. ప్ర‌స్తుతం కార్తికేయ హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా`. నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీని తెర‌కెక్కించారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం మార్చి 19న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో కార్తికేయ ఇంట‌ర్వ్యూ..

ఫ‌స్ట్ ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట‌య్యింది?
– నాకు ఈ సినిమా కోసం నాకు 2019 లోనే కాల్ వచ్చింది. గీతా ఆర్ట్స్ వారు ఫోన్ చేసి నీతో సినిమా చేయాలి అనుకుంటున్నాం అన్నారు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యాన‌ర్‌లో సినిమా అంటే నెక్ట్ లెవ‌ల్‌లో ఉంటుంది. త‌ప్ప‌కుండా నా కెరీర్ ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది అని మరో మాట లేకుండా ఓకే చేప్పాను.

 డైరెక్టర్ కౌశిక్ తో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌?
– నేను ఫస్ట్ టైమ్ కౌశిక్ ను చూసినప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉన్నాడు..గీతా ఆర్ట్స్ వాళ్ళు ఎవరినో పెళ్లి చూపులు లాంటి డీసెంట్ కథ చెప్పడానికి పంపారు అనుకున్నా కానీ ఒక్కసారి కౌశిక్ చావు కబురు చల్లగా కథ చెప్పిన తర్వాత ఒక్క‌సారి ఆయ‌న‌మీద మంచి ఇంప్రెష‌న్ క్రియేట్ అయ్యింది. చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. ఇందులో ఉండే ఎమోషన్, ఫిలాసఫీ గురించి కౌశిక్ చాలా బాగా చెప్పాడు. అలాగే ఫ‌స్ట్ మూవీ అయినా చాలా క్లారిటీతో తెర‌కెక్కించాడు. చావు నుంచి తప్పించుకోలేము అనేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అయితే ఈ సినిమాలో చావుతో ఒక గొప్ప ఫిలాసఫీ ఉంది. అలాగే చాలా ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఒక పక్క మంచి కామెడీ మరో పక్క ఎమోషన్స్ తో రాజ్ కుమార్ హిరానీగారి సినిమాల్లా ఇది కూడా ఉంటుంది.

ఈ స్క్రిప్ట్ లో మీకు బాగా న‌చ్చిన అంశాలేంటి?
– నేను ఈ సినిమాలో శవాలని తీసుకెళ్లే ఓ వ్యాన్‌ డ్రైవర్ గా కనిపిస్తాను. ఆ క్యారెక్ట‌ర్‌లోనే ఒక మాస్ ఉంది. ఆ క్యారెక్ట‌ర్ రెగ్యుల‌ర్‌కి డిఫ‌రెంట్ గా ఉంటుంది. చావు మీద వాడి ఒపీనియ‌న్ వేరుగా ఉంటుంది. అలాంటి వ్యక్తి ఓ భర్తను పోగొట్టుకున్న అమ్మాయిని చూసి ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది.

చాలా కాలం త‌ర్వాత ఆమనిగారు ఈ సినిమాలో న‌టించారు క‌దా ఆమె పాత్ర గురించి?
– నేను ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే హీరోయిన్ గురించి కాకుండా నాకు మదర్ రోల్ లో ఎవరు చేస్తారు అని అడిగా…ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ క్యారెక్ట‌ర్‌. ఆమనిగారి లాంటి లెజెండరీ నటి ఆ పాత్ర చేస్తున్నారు అన‌గానే ఈ సినిమా త‌ప్ప‌క స‌క్సెస్ సాధిస్తుంది అని ఫిక్స్ అయిపోయా.. ఆమెతో వ‌ర్క్ చేయ‌డం గ్రేట్ ఎక్స్‌పీరియ‌న్స్‌. ఆమె ఇప్ప‌టికీ మాటీమ్ అంతా కొత్త వాళ్లం అయినా చాలా స‌పోర్ట్ చేశారు. ఆమెతో ప‌నిచేయ‌డం ఒక గ్రేట్ ఎక్స్‌పీరియ‌న్స్‌.

స్క్రిప్ట్ ఎంపిక విష‌యంలో ఎవ‌రి స‌ల‌హాలైనా తీసుకుంటారా?
– అది నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇండస్ట్రీలో నాకు త‌క్కువ మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కొన్ని క‌థ‌లు వాళ్ల‌తో డిస్క‌స్ చేసి ఓకే చేస్తాను.

కాంప్లిమెంట్స్‌, క్రిటిసిజం ఈ రెండింటిని ఎలా తీసుకుంటారు?
– కాంప్లిమెంట్స్ తీసుకోవ‌డం ఈజీనే హ్యాపీగా థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోవ‌చ్చు..కాని క్రిటిసిజం అలా కాదు.. కొన్ని సార్లు చాలా కోపం వ‌స్తుంది అయితే ఈ మ‌ధ్య‌నే క్రిటిసిజాన్ని కూడా తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాను.

త‌మిళంలో అజిత్ సినిమాలో న‌టిస్తున్నారు క‌దా ఆ సినిమా గురించి చెప్పండి?
– హెచ్.వినోద్ గారి ఖాకీ సినిమా చూశాను. అయ‌న అజిత్‌గారి కాంబినేష‌న్‌లో సినిమా చేస్తూ మెయిన్ విల‌న్ క్యారెక్ట‌ర్ కోసం నాకు కాల్ చేసి ఇలా అనుకుంటున్నాం అన‌గానే నా రెండు చేతులు శివ‌ర్ అయ్యాయి. అజిత్ గారితో కలిసి పని చెయ్యడం నాకు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఆయనతో కలిసి సెట్స్ లో ఉండడమే గొప్ప బ్లెస్సింగ్ అనుకున్నాను. అజిత్ గారు వ‌న్ ఆఫ్ ది బెస్ట్ హ్యూమ‌న్ బీయింగ్ ఐ హ్యావ్ ఎవ‌ర్ మెట్‌. ఇంకో మూడు రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ ఇయ‌ర్‌లోనే రిలీజ్ ఉంటుంది.

అల్లు అరవింద్ గారితో పనిచేయ‌డం ఎలా అనిపించింది?
– నేను ఆయన్ని మొదటిసారి కలిసే టైంలో చాలా భయపడ్డాను. కానీ ఆయనను మీట్ అయ్యాక ఆయన రియల్ లైఫ్ లో ఎంత చిల్ గా ఉంటారో అర్ధం అయ్యింది. అలాంటి వారితో కలిసి పని చెయ్యడం నాకు నా కెరీర్ కు ఓ వరం లాంటిది. ఆ స్థాయిలో ఉండి కూడా మా అంద‌రినీ బాగా చూసుకోవ‌డం నిజంగా గొప్ప‌గా అనిపించింది. వారితో ఫ్యూచర్ లో వర్క్ చెయ్యాలని కోరుకుంటున్నాను.

ఈ సినిమాతో ఆర్ఎక్స్100 హీరో నుండి బ‌స్తీబాల‌రాజుగా ప్ర‌మోష‌న్ వ‌స్తుంది అనుకుంటున్నారా?
– డెఫినెట్ గా వ‌స్తుంది అని న‌మ్ముతున్నాను. అయితే ఆర్ ఎక్స్ 100 సినిమా హిట్ అయ్యాక ఆర్ ఎక్స్ 100 హీరో అన్నారు… రేపు ఈ సినిమా హ‌ట్ అయ్యాక బ‌స్తీ బాల‌రాజు అంటారు. కాని నా పేరు కార్తికేయ‌ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు అదే క‌దా నా బాదంతా..(న‌వ్వుతూ) అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here