కొత్త చిత్రాల కోసం ఉత్సాహంగా సిద్ధమవుతున్న తమిళ స్టార్ ”శింబు”

0
370

తమిళ స్టార్ హీరో ”శింబు” రీసెంట్ గా ‘ఆత్మాన్’ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శింబు చేస్తున్న అనేక వర్కవుట్స్ ఉన్నాయి. ఫ్యాట్ నుంచి ఫిట్ గా మారేందుకు శింబు చేసిన ప్రయత్నం ఫిట్ నెస్ గోల్స్ ఇస్తోంది. చాలా నెగిటివిటీ ఉందంటూ మూడేళ్ల కిందట సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు శింబు. ట్విట్టర్ ఫేస్ బుక్ అక్కౌంట్లను డీయాక్టివేట్ చేశారు. మళ్లీ తాజాగా తన ఆత్మాన్ వీడియోతో సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చారు. ఈ వీడియోను పలువురు సినిమా తారలు తమ సోషల్ మీడియా అక్కౌంట్లలో పోస్ట్ చేస్తూ శింబును ప్రశంసిస్తున్నారు.

శింబు ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. సుశీంద్రన్ దర్శకత్వంలో ఓ గ్రామీణ నేపథ్య చిత్రం చేస్తున్న శింబు, వెంకట్ ప్రభు దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘మానాడు’ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ నాయికగా నటిస్తోంది. కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘ముఫ్తీ’ని తమిళ రీమేక్ చేస్తున్నారు శింబు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. నార్తాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూడు చిత్రాలు కాకుండా కమల్ హాసన్ తో కలిసి తమిళ్ క్లాసిక్ మూవీ ‘సిగప్పు రోజాకల్ 2’ చిత్రంలో శింబు నటిస్తున్నారని కోలీవుడ్ టాక్. తన వరుస చిత్రాల కోసం ఫిజికల్ ట్రాన్స్ మిట్ అయిన శింబు… ఉత్సాహంగా నటించేందుకు సిద్ధమవుతున్నారు. ‘మన్మథ’, ‘వల్లభ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా శింబు సుపరిచితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here