విజయ్ సేతుపతి.. 2020 విలన్

0
885

కోలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానంగా కొంతమంది యాక్టర్స్ మంచి క్రేజ్ అందుకుంటున్నారు. అందులో విజయ్ సేతుపతి ఒకరు. హీరోగా సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూ సినిమాలకు మంచి బూస్ట్ ఇస్తున్నాడు. ఇటీవల సైరా సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇకపోతే 2020వ సంవత్సరంలో విజయ్ ఎక్కువగా విలన్ గా బిజీ కానున్నాడు.

మొత్తంగా నాలుగు సినిమాల్లో ఈ టాలెంటెడ్ హీరో డార్క్ షేడ్స్ ఉన్నపాత్రలతో తెరపై కనిపించనున్నాడు. లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో విజయ్ 64వ ప్రాజెక్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ సినిమాతో పాటు ఇండియన్ 2లో కూడా నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ 64మూవీ నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ కానుండగా ఇండియన్ 2 నెక్స్ట్ ఇయర్ దీపావళికి రానుంది. ఇక తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో కూడా విజయ్ సేతుపతి ఒక డిఫరెంట్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here