కథపై నమ్మకంతో చేసిన చిత్రం `అప్పట్లో ఒకడుండేవాడు` – నారా రోహిత్

0
970
తొలి చిత్రం బాణం సక్సెస్‌తో హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్న నారా రోహిత్‌ తర్వాత ప్రతినిధి, రౌడీ ఫెలో, సోలో, అసుర వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంలో డిఫరెంట్‌ పాత్రలో నటించి మెప్పించిన యంగ్‌ హీరో నారా రోహిత్‌తో ఇంటర్వ్యూ….
సక్సెస్‌ని ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు? 
– మేము ఎంచుకున్న కథ ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ముందు నుంచీ వుంది. మంచి సినిమా అవుతుందని చేశాం. అయితే ఈ స్థాయిలో ఆదిరిస్తారని ఊహించలేదు. సినిమాను ఇంత పెద్ద హిట్‌ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీ పాత్ర నిడివి తక్కువైనా నటించారెందుకు? 
– పాత్ర నిడివి ఎక్కువ వుంటేనే నచ్చుతుంది. లేకుంటే రక్తికట్టదు అనే విషయాల్ని నేను నమ్మను. కొన్ని సినిమాలు కథ బాగుంటే ఆడతాయి. సినిమాలో రైల్వేరాజుగా శ్రీవిష్ణుకు ఎంత పేరొచ్చిందో ఇంతియాజ్‌ అలీగా నా పాత్రకు అంతే పేరొచ్చింది. కొన్ని పాత్రలు కంటెంట్‌ లేకపోయినా ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటే ఆడతాయి. సినిమాకు మన పాత్ర ఎంత వరకు ముఖ్యం అనేదే నేను చూస్తాను తప్ప మిగతా విషయాల్ని పట్టించుకోను.
ప్రేమకథా చిత్రాల కంటే ప్రయోగాత్మ చిత్రాలకే ప్రాముఖ్యతనిస్తున్నారెందు? 
– నాకు కథ నచ్చితే ఏ సినిమా చేయడానికైనా సిద్ధమే. ప్రస్తుతం ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాను. ఓ ప్రయోగం చేసిన తరువాత మరొకటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నాను.
ఈ సినిమాను నిర్మించడానికి ప్రత్యేక కారణమేంటి? 
– నాకు నచ్చిన కథతో సినిమా చేస్తున్నప్పుడు ఫలితం తారుమారైతే ఎవరినీ బ్లేమ్‌ చేయాల్సిన అవసరం వుండదు. అందుకే నిర్మాతనయ్యాను. ఈ చిత్రానికి నిర్మాతను కావడం సంత ప్తినిచ్చింది. ఇది రెండు గంటల్లో చెప్పే కథ కాదు. ఒక్కో పాత్రకు ఒక్కో నేపథ్యం వుంటుంది. మూడు సీజన్‌లకు సరిపడ ఎపిసోడ్స్‌తో ఓ ధారావాహికను రూపొందించేంత కథ వుంది. అలాంటి కథని రెండు గంటల్లో సమర్థవంతంగా చెప్పడం కూడా గొప్ప విషయమే.
ఈ ఏడాది ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు? 
– 2016 చాలా ప్రత్యేకమైనది. కొన్ని విషయాల్లో ఉత్సాహాన్ని, మరినికొన్ని సందర్భాల్లో నిరుత్సాహాన్ని అందించింది. ఈ ఏడాది నేను ఏది చేయగలను, ఎంత వరకు చేయగలను అనే విషయాల్లో చాలా స్పష్టత ఏర్పడింది. నాలోవున్న లోపాలతో పాటు నేను చేసిన తప్పుల్ని తెలుసుకున్నాను. 2016లో నేను పోస్ట్‌ ప్రొడక్షన్‌కు పెద్దగా సమయాన్ని కేటాయించలేదు. ఒక సినిమాకు నా వంతు బాధ్యతగా పోస్ట్‌ప్రొడక్షన్‌కు సమయాన్ని కేటాయించాలనే విషయాన్ని ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో తెలుసుకున్నాను.
సిక్స్‌ప్యాక్‌ కోసం కసరత్తులు చేస్తున్నట్ట్టున్నారు? 
– ఫిబ్రవరి చివరి వారంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి పవన్‌ మల్లెల దర్శకత్వం వహిస్తాడు. ఈ సినిమా కోసం సిక్స్‌ప్యాక్‌ చేస్తున్నాను. ఈ ఏడాది నేను సీరియస్‌గా తీసుకున్న నిర్ణయమిదే.
సినిమాలో విలన్‌ ఛాయలున్న పాత్రలో నటించడానికి కారణం? 
– సినిమా విడుదలకు ముందు నుంచి ఇందులో హీరోలు కానీ విలన్‌లుకానీ ఎవరూ లేరని చెబుతూనే వున్నాం. రైల్వేరాజుకు కరెక్ట్‌ అనిపించింది ఇంతియాజ్‌ అలీకి కరెక్ట్‌ అనిపించదు. ఇలా ఒకరి ద క్కోణంలో చూస్తే మరొకరు విలన్‌గా కనిపిస్తుంటారు. అదే సినిమాలో చూపించాం. ఈ చిత్రంలో నాకు హీరోయిన్‌ లేదు. కథ డిమాండ్‌ని బట్టి కథకు ఏది అవసరమో అదే చూపించాలనుకున్నాం. అదే చేశాం. నా పాత్రకు హీరోయిన్‌ లేకపోతే ఎందుకు పెట్టలేదని అడుగుతారని ముందే ఊహించాం. దాని కోసమే చిత్రీకరణ మూడు నెలలు వాయిదా వేయాల్సి వచ్చింది. నా పాత్రకు హీరోయిన్‌ పెడితే కథలో బలవంతంగా చొప్పించినట్లు వుంటుందనిపించింది.
నెక్స్‌ట్‌ మూవీస్‌ …? 
– ‘కథలో రాజకుమారి’ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా 80 శాతం పూర్తయ్యింది. ఫిభ్రవరిలో పవన్‌ మల్లెల దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో నారా రోహిత్‌….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here