వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ హీరోగా వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్‌పై.. మాన్సూన్ మూవీస్ అసోసియేషన్‌లో డా.ఇషారి కె.గణేష్ నిర్మిస్తోన్న థ్రిల్లర్ మూవీ ‘అసరీరి’.. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1, 2027న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్ నిర్మిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అసరీరి’. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఈ బ్యానర్‌పై రూపొందుతోన్న 32వ చిత్రం. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్..మాన్సూన్ మూవీస్ అసోసియేషన్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డాక్టర్ ఇషారి కె. గణేష్ నిర్మాత. విలక్షణ కథా చిత్రాల దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 1, 2027న నూతన సంవత్సర కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
డాక్టర్ ఇషారి కె. గణేష్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన, భారీ ప్రాజెక్టులను ప్రేక్షకులకు అందించే వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్..ఇప్పుడు ‘అసరీరి’ సినిమాతో తమ సినీ జర్నీలో మరో కీలక మైలురాయిని అందుకోవడానికి సిద్ధమవుతోంది.
– 2027 న్యూ ఇయర్ కానుకగా ఫహాద్ ఫాజిల్ ‘అసరీరి’.. టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్!
‘96’, ‘సత్యం సుందరం’ (మెయ్యళగన్) వంటి సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ మరో ఆసక్తికరమైన చిత్రం ‘అసరీరి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎమోషనల్ సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్.. ఈసారి థ్రిల్లర్ మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. 2027 జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్ ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం సినిమా టైటిల్‌తో పాటు ప్రపంచవ్యాప్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
ఇంకా ఈ సినిమాలో శివద, చేతన్, గీత, హరీష్ ఉత్తమన్, కరుణాకరన్, శరణ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు సి.ప్రేమ్ కుమార్, సంగీత దర్శకుడు గోవింద్ వసంత కలిసి పనిచేస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘96’, ‘సత్యం సుందరం’ (మెయ్యళగన్) సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ‘అసరీరి’తో మరోసారి ఈ కాంబో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సినిమాకు మహేంద్రన్ జయరాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గోవింద్ వసంత సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆర్. గోవిందరాజ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక యాక్షన్ సన్నివేశాలకు మహేష్ మాథ్యూ స్టంట్స్ కంపోజ్ చేస్తుండగా, కుమార్ గంగప్పన్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా కేరళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను భావన రిలీజ్ సొంతం చేసుకోగా.. తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. కార్తికేయ నేతృత్వంలోని షోయింగ్ బిజినెస్ సంస్థ విడుదల చేయనుంది.
ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘అసరీరి’ చిత్రం 2027 జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా కొత్త ఏడాది ఆరంభంలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.



