తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం
శ్రీ ఫిల్మ్స్ & ప్రొడక్షన్స్ పతాకంపై “మణిమ” సినిమా పూజా కార్యక్రమాలతో ఆదివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవీన్ నలమాస దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అమరేష్ చంద్ర సారంగి నిర్మిస్తున్నారు. ఇందులో పృథ్వీ సాయి దండమూడి, జీషు సేన్ గుప్తా, కబీర్ దుహన్ సింగ్, బాబీ మిశ్రా నటిస్తున్నారు.
ఈ సినిమా తారాగణంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్లాప్ కొట్టారు. దర్శకుడు భీమనేని శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ కి ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. స్ర్కిప్ట్ సినిమా నిర్మాత అమరేష్ చంద్ర సారంగి చిత్ర దర్శకుడికి అందించారు.

చిత్ర దర్శకుడు నవీన్ నలమాస మాట్లాడుతూ… ఈ సినిమా మైథాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ బేస్ తో పూరీ జగన్నాథ్ స్వామి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో ఈనెల 16 నుంచి తొలి షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఇక్కడ రెండు షెడ్యూలు, ఒరిస్సా ఒకటి చేసి… వచ్చే ఏడాది జూలైలో జరిగే పూరీ జగన్నాథ్ రథయాత్ర సమయానికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. 30 శాతం VFX ఉంటుందని తెలిపారు.
నిర్మాత అమరేష్ చంద్ర సారంగి మాట్లాడుతూ… నాకు ఇది తొలి సినిమా. నేను ఒరియాలో ఒక సినిమా నిర్మించాను. ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నా. మీ అందరి సపోర్ట్ కావాలి. నేను పూరీ జగన్నాథ్ స్వామి వారికి భక్తుణ్ణి. అందుకే సెంటిమెంట్ తో నా తొలి సినిమా ఆయన మీదే తీసి తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకుంటున్నా. ఈ సినిమాను తెలుగు, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం.
సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి మాట్లాడుతూ… ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వ్యాల్యూస్ తో గ్రాండ్ విజువల్స్ తో తెరకెక్కిస్తున్నాం. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండియర్ గా తీయడానికి ప్లాన్ చేసినందున సినిమా విజువల్ గా చాలా రిచ్ గా ఉంటుంది.
హీరో పృథ్వీ సాయి దండమూడి మాట్లాడుతూ… ఐఐటీ కృష్ణమూర్తి సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పట్టాను. ఇన్ని రోజులు మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూసా. ఇప్పుడు ఈ కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా.
నటీనటులు: పృధ్వీ సాయి దండముడి, జిషు సెంగుప్తా, కబీర్ దుహాన్ సింగ్, బాబీ మిశ్రా
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు – నవీన్ నలమాస
DOP – జగదీష్ చీకటి
ఎడిటర్- మార్తాండ్ కె. వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవ్ నాయర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మురళీ కృష్ణ రోంపల్లి
సహ దర్శకుడు – కోల శ్రీకాంత్
ప్రొడక్షన్ కంట్రోలర్ – రాంబాబు బత్తుల
కాస్ట్యూమ్ డిస్గ్నర్ – స్వాతి రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్స్ – సార్ధక్, అజిత్ కుమార్
ఆపరేటివ్ కెమెరామెన్ – రామ కృష్ణ
ఆర్ట్ అసిస్టెంట్ – రవి
PRO -వీర బాబు
మేకప్ – శివ
కాస్ట్యూమ్స్ – వెంకట్
అసోసియేట్ డైరెక్టర్లు – రత్న వాస్ రెడ్డి,
రాజ్ కిరణ్ యల్లా
సహాయ సంచాలకులు – సంపత్ వి,
మనోజ్ సత్తెనపల్లి
నిర్మాత – అమరేష్ చంద్ర సారంగి



