ఎన్టీఆర్ వీరాభిమాని, టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబర్ ఎన్టీఆర్ రాజు గారి సంవత్సరీకానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు, టిడిపి నాయకులు

0
2
Nandamuri Family Members and TDP Leaders Attend the First Death Anniversary of NTR Raju

స్వర్గీయ నందమూరి తారక రామారావు వీరాభిమాని, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఎన్టీఆర్ రాజు ఏడాది క్రితం శివైక్యం అయిన విషయం తెలిసిందే. ఆయన మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సంవత్సరీక కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహనకృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన రూప, తుమ్మల ప్రసన్నకుమార్ ఎన్టీఆర్ రాజు నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్, టీటీడీ మాజీ జేఈవో శ్రీనివాస రాజు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్‌తో పాటు పలువురు టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై ఎన్టీఆర్ రాజుకు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here