మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ అనిల్ రావిపూడి కాంబోలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా ప‌వ‌ర్ ప్యాక్‌డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌

0
3
NTRxAnil Ravipudi In NTR Arts
NTRxAnil Ravipudi In NTR Arts
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనిల్ రావిపూడి కాంబోలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా ప‌వ‌ర్ ప్యాక్‌డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్ గురించి మ‌నం చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌వ‌ర‌సాల్లో ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసే ఈ స్టార్ హీరో.. ఇప్పుడు కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా పేరున్న డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో ఓ ప‌వ‌ర్ ప్యాక్‌డ్ మూవీ చేయ‌టానికి రెడీ అయ్యారు. ఈ ప్రెస్టీజియ‌స్‌ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నారు.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, అనిల్ రావిపూడి వారి అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. అవి పూర్తి కాగానే ఈ సినిమాను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌, అనిల్ రావిపూడి క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ కాంబో మూవీకి సంబంధించిన‌ వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని టీమ్ తెలియ‌జేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here