మంచి ఎంటర్ టైనింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న “చంద్రయాన్” సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు

0
2
Chandrayan Movie Pre Release Event
Chandrayan Movie Pre Release Event

మంచి ఎంటర్ టైనింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న “చంద్రయాన్” సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు

ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హిలేరియస్ అడ్వెంచర్ మూవీ

రాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో “చంద్రయాన్” టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన “చంద్రయాన్” సినిమా ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు అతిథిగా “చంద్రయాన్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

యాక్టర్ రవి శివతేజ మాట్లాడుతూ – ఈ ఏడాది వరుసగా సినిమాలు చేసే అవకాశం నాకు దక్కడం సంతోషంగా ఉంది. మా పేరెంట్స్ కూడా ఇదే కోరుకున్నారు. గోదావరి యాసలో సినిమాల్లో నటించాను. ఫస్ట్ టైమ్ ఈ చిత్రంతో తెలంగాణ యాసలో నటించే అవకాశం లభించింది. ఈ నెల 13న రిలీజ్ కు వస్తున్న మా సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

కొరియోగ్రాఫర్, యాక్టర్ బాబా భాస్కర్ మాట్లాడుతూ – నాకు ఈ సినిమాతో ఒక ఫ్యామిలీ దొరికిన ఫీల్ కలిగింది. మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు. ఈ టీమ్ తో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను. మిమ్మల్ని నవ్వించేందుకు మా టీమ్ జెన్యూన్ గా ట్రై చేశారు. లీడ్ యాక్టర్స్ అందరి పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ హర్ష ప్రవీణ్ మాట్లాడుతూ – సిచ్యువేషనల్ కామెడీతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. నాన్ సెన్స్ గా అనిపించినా ఫన్ ఫీలవుతారు. దర్శకుడు కథ చెప్పినప్పుడే బాగా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. తెలంగాణ కల్చర్, జానపదాల గురించి తెలుసుకుని సాంగ్స్ కంపోజ్ చేశాం. లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అన్న చాలా సపోర్ట్ చేశారు. మ్యూజిక్ పరంగా నాకు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిది. అన్నారు.

యాక్టర్ బలగం సత్యనారాయణ మాట్లాడుతూ – మన యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనే మంచి పాయింట్ ను ఈ సినిమాలో చూపించారు. గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన ప్లెజెంట్ మూవీ ఇది. ఈ సినిమాలో నటించడాన్ని మేమంతా బాగా ఆస్వాదించాం. అన్నారు.

కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి మాట్లాడుతూ – మా సినిమాకు అంతా కొత్త టీమ్ పనిచేశారు. మాలాంటి టీమ్ కు ఒక సపోర్ట్ ఎవరైనా ఉంటే బాగుండును అనుకున్నప్పుడు వేణు ఊడుగుల గారు ముందుకు వచ్చారు. ఆయన మా టీమ్ లో జాయిన్ కావడంతో మాకు కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. అన్నారు.

ప్రొడ్యూసర్ పూజారి నాగేశ్వరరావు మాట్లాడుతూ – మీ టెన్షన్ అన్నీ మర్చిపోయేలా చేసే చిత్రమిది. వేణు గారు ఎప్పుడైతే ప్రెజెంట్ చేస్తున్నారో అప్పుడే ఈ సినిమా సక్సెస్ అయినట్లు భావించాలి. ఈ నెల 13న చంద్రయాన్ రిలీజ్ కు వస్తోంది. ప్రేక్షకులంతా రెండు గంటల పాటు థియేటర్ లో ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. అన్నారు.

ప్రొడ్యూసర్ బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ – వేణు మంచి సినిమాలు రూపొందించి దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రవేసుకున్నాడు. రాజు వెడ్స్ రాంబాయి తర్వాత ఆయన అభిరుచి మరోసారి ప్రూవ్ అయ్యింది. చంద్రయాన్ సినిమా రిలీజ్ గురించి ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు. సినిమా చూశాను చాలా బాగుంది. వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ థియేటర్స్ బిజీగా ఉన్నాయి. మేము అడగగానే ఈ చిత్రం కోసం ఎస్వీసీ నుంచి శిరీష్ గారు సపోర్ట్ చేశారు. నైజాం, వైజాగ్ చేస్తున్నారు. మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఈ సినిమాను ఎంకరేజ్ చేసేందుకు ముందుకొచ్చారు. మంచి ఎంటర్ టైనింగ్ సినిమా ఇది. ఈ సినిమా తప్పకుండా ప్రూవ్ చేసుకుంటుంది అని నమ్ముతున్నా. అన్నారు.

డైరెక్టర్ నీలకంఠ మాట్లాడుతూ – శ్రీనాథ్ నాతో నాలుగేళ్ల పాటు ట్రావెల్ చేశాడు. ఆయన ఆలోచనలు జెన్యూన్ గా ఉంటాయి. ఈ సినిమాలోనూ అదే నిజాయితీ కనిపిస్తోంది. ఈ సినిమా చూశాను. మంచి ఎంటర్ టైనర్ అవుతుంది. వేణు గారు ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తుంది. వేణు గారు చేసే సినిమాలు, ఆయన ఎంచుకునే మూవీస్ అన్నీ కొత్త తరహాలో ఉంటాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలి. ఇలాంటి నేపథ్యమున్న చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రవీణ్ గారిని అభినందిస్తున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ ప్రవీణ్ మొలక మాట్లాడుతూ – ఈ సినిమా కోసం డైరెక్టర్ శ్రీనాథ్ తన టీమ్ తో ఎంతో కష్టపడ్డాడు. మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు పూర్తి సహకారం అందించారు. మా సినిమాకు అండగా నిలబడిన వేణు ఊడుగుల గారికి థ్యాంక్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక కొత్త తరహా ఎంటర్ టైనర్ గా చంద్రయాన్ మీ ముందుకు రాబోతోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. ఈ నెల 13న మా సినిమాను తెలుగు ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

హీరో శివకుమార్ ధీకొండ మాట్లాడుతూ – ఈ వేదిక మీద హీరోగా నిలబడాలి అనేది నా పదేళ్ల కల. ఈ పదేళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ జర్నీలో చంద్రయాన్ వంటి మంచి అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో హీరోగా నన్ను సెలెక్ట్ చేసుకుని మా డైరెక్టర్ కు, నన్ను నమ్మి ప్రొడ్యూస్ చేసిన మా ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలంటే ఈజీ కాదు. అందుకు మా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. ఈ నెల 13న థియేటర్స్ లో మా సినిమా చూడండి. మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా ఫుల్  ఫన్ ను ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

డైరెక్టర్ శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ – ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ కు రుణపడి ఉంటాను. 42 రోజులు షూటింగ్ చేశాం. సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. శివకుమార్ ను ఈ సినిమాలో రాకెట్ మ్యాన్ గా చూపించాం. ఆయన ఫ్యూచర్ లో రాకెట్ స్టార్ గా ఎదుగుతారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక వేణు గారి దగ్గరకు వెళ్లి కాన్సెప్ట్ చెప్పాం. ఆయనకు నచ్చి మాకు సపోర్ట్ గా ఉండేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 13వ తేదీ నుంచి ప్రతి థియేటర్ లో నవ్వులు హంగామా మొదలవుతుంది. 2 గంటల 15 నిమిషాలు మిమ్మల్ని ఆగకుండా నవ్వించే చిత్రమిది.  ఆయుధాలు, రక్తపాతాలు లేని చిత్రమిది. మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా మా మూవీ థియేటర్ కు రండి మీ బాధల్ని రెండు గంటల పాటు మర్చిపోయి నవ్వుకుంటారు. మా సినిమా మీకొక లాఫింగ్ థెరపీ.  ప్రతి సీన్ హిలేరియస్ గా నవ్విస్తుంది. అన్నారు.

మూవీ ప్రెజెంటర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ – మా సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. పెద్ద సినిమాలు ఉండటం వల్ల వాయిదా వేస్తూ వచ్చాం. ఒక్కసారి డేట్ మారితే ప్రొడ్యూసర్ కు ప్రమోషన్ కు చేసిన ఖర్చంతా భారమే. ఒక కాన్సెప్ట్ అనుకుని ఈవెంట్స్ చేస్తూ వచ్చాం. కానీ మా ప్రొడ్యూసర్ ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా వాయిదా పడినా ప్రమోషన్ పరంగా వెనకడుగు వేయలేదు. రిలీజ్ విషయంలో బెక్కెం అన్న సపోర్ట్ చేశారు. మూవీ డిస్ట్రిబ్యూషన్ కు శిరీష్ గారు ముందుకొచ్చారు. మంచి థియేటర్స్ ఇద్దాం, సినిమా టాక్ బాగుంటే ఇంకా బెటర్ గా తీసుకెళ్దామన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. స్టార్ తో చేసే సినిమాలు, భారీ బడ్జెట్ తో చేసే సినిమాలు చూస్తుంటాం. కానీ ఒక మంచి ఆలోచనతో , వినూత్నంగా తెరకెక్కించే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన సినిమా చంద్రయాన్. డైరెక్టర్ లో ఎంతో నిజాయితీ కనిపించింది. ఈ సినిమా చూడగానే సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చాను. ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తూ, వినోదాన్ని అందించే చిత్రమిది. శివకుమార్ సినిమా మీద ప్యాషన్ ఉన్న యంగ్ హీరో. ప్రొడ్యూసర్ ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం గెలవాలని కోరుకుంటున్నా. ప్రేక్షకులు ఇలాంటి కొత్త తరహా సినిమాలను ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ – “చంద్రయాన్” సినిమాకు యంగ్ టాలెంట్ పనిచేశారు. ఈ సినిమా ఈ కొత్త వాళ్లకు మంచి పేరు తీసుకురావాలి. తెలంగాణ నేపథ్యంతో వస్తున్న సినిమా అయినా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరిస్తారు. మంచి సాంగ్స్ ఉన్నాయి. పట్టణాలే కాదు పల్లెల్లోనూ ఈ సినిమాకు ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ కు ఈ సినిమాతో మంచి పేరు, ప్రొడ్యూసర్ కు డబ్బులు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ – ఏదైనా కొత్తదనం ఉంటే తప్ప వేణు ఊడుగుల గారు సినిమాను ప్రెజెంట్ చేయరు. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఇప్పుడే చెప్పారు. ఇందులో ఒక సరదా పాయింట్ ఉంది. అందుకే వేణు గారు టేకప్ చేశారు. కొత్త టీమ్ ను సపోర్ట్ చేస్తున్న వేణు గారిని అభినందిస్తున్నా. ఈ సినిమా ఈ నెల 13న మీ ముందుకు వస్తోంది. మూవీ మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ కొత్త టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఈ టీమ్ చేసిన ప్రయత్నాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు ఇతర రాష్ట్రాల ఆడియెన్స్ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

నటీనటులు – శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ, తదితరులు

టెక్నీషియన్స్
కాస్ట్యూమ్ డిజైనర్ – శశి కోసూరి
ఎడిటర్ – పుల్లారావు దాసరి
ప్రొడక్షన్ డిజైనర్స్ – శ్రీధర్ మేస్త్రి, మందర్ పస్నేకర్
డీవోపీ – శ్రీనివాస. బి.
మ్యూజిక్ – హర్ష ప్రవీణ్
సమర్పణ – వేణు ఊడుగుల
ప్రొడ్యూసర్ – ప్రవీణ్ మొలక
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – శ్రీనాథ్ చంద్రశేఖర్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here