‘డాన్ బాస్కో’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి
రుష్య దత్తా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘డాన్ బాస్కో’. రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై వెంకట్ ఉప్పుటూరి నిర్మాణంలో గౌరీ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ కసిరెడ్డి, మిర్నా మీనన్, మౌనిక, మురళీ శర్మ, ప్రిన్సిపాల్ విశ్వనాథ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, విష్ణు ఓఐ, ఉత్తేజ్, వినయ్ నల్లకడి, మోహన శ్రీ సురాగా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..
వెంకీ అట్లూరి మాట్లాడుతూ .. ‘‘డాన్ బాస్కో’ టీజర్ బాగుంది. ఎంతో వినోదాత్మకంగా సాగింది. శంకర్ గారు చక్కగా హ్యాండిల్ చేశారు. శ్రీచరణ్ బీజీఎం బాగుంది. మిర్నా ప్రతీ పాత్రకు ప్రాణం పోస్తుంటారు. రుష్య నాకు ఫ్యామిలీ మెంబర్. వెంకట్ గారు ఏ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినా సక్సెస్ అవుతుంది. ఈ మూవీతో ఆయనకు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను. నేను సొంతంగా సినిమా నిర్మిస్తే ఎంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటానో ఈ చిత్రం కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరో రుష్య దత్తా మాట్లాడుతూ .. ‘‘మ్యాడ్’ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ వల్లే నాకు మా దర్శకుడు గౌరీ శంకర్ పరిచయం అయ్యారు. నిర్మాత వెంకట్ గారు మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. శ్రీచరణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. రాజు గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఎడిటర్ వంశీ గారికి థాంక్స్. చినబాబు గారు నాకు ఎప్పుడూ అండగా ఉంటారు. మా బావ వంశీ గారికి థాంక్స్. మా అక్క, బావలే నాకు అమ్మనాన్నాలు. మిర్నా నా మొదటి హీరోయిన్. ఆమెతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. మా కోసం వచ్చిన వెంకీ అట్లూరి గారికి థాంక్స్. ఆయన బంగారు బాతులాంటి వారు. ఆయన చేతుల మీదుగా లాంచ్ అవుతుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
నిర్మాత వెంకట్ ఉప్పుటూరి మాట్లాడుతూ .. ‘‘డాన్ బాస్కో’ ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాం. త్వరలోనే మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటాం’ అని అన్నారు.
హీరోయిన్ మిర్నా మాట్లాడుతూ .. ‘‘డాన్ బాస్కో’లో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మూడేళ్లుగా నాకు దర్శకుడు శంకర్ గారు తెలుసు. ఆయన ఎంతో అద్భుతంగా నెరేషన్ ఇచ్చారు. ఈ మూవీ కోసం ఆయనెంతో కష్టపడ్డారు. ఇంత వరకు నేను ఇంటెన్స్ పాత్రల్ని పోషించాను. ఇలాంటి రోమ్ కామ్ పాత్రను చేయడం ఆనందంగా ఉంది. రుష్యతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఈ జర్నీలో మేం స్కూల్ ఫ్రెండ్స్‌లా మారిపోయాం. ఈ మూవీ కోసం రుష్య ప్రాణం పెట్టేశాడు. శ్రీ చరణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్’ అని అన్నారు.
డైరెక్టర్ గౌరీ శంకర్ మాట్లాడుతూ .. ‘‘డాన్ బాస్కో’ టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. ట్రైలర్ ఇంత కంటే ఎమోషనల్‌గా ఉంటుంది. మా సినిమా గురించి మేం మాట్లాడే కంటే మా కంటెంట్ మాట్లాడితే బాగుంటుంది’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ .. ‘‘డాన్ బాస్కో’ చిత్రంలో ఫ్రెండ్ షిప్ గురించి అందంగా చూపించారు. ఇందులో మంచి ఎమోషన్ ఉంటుంది. రుష్య దత్తాకి ఇది తొలి చిత్రం. అతని జర్నీలో నేను పార్ట్ అయినందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.
నటీనటులు:
రుష్య దత్తా, రాజ్‌కుమార్ కసిరెడ్డి, మిర్నా (మిర్నా మీనన్), మౌనిక, మురళీ శర్మ, ప్రిన్సిపాల్ విశ్వనాథ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, విష్ణు ఓఐ, ఉత్తేజ్, వినయ్ నల్లకడి, మోహన శ్రీ సురాగా తదితరులు
సాంకేతిక వర్గం
నిర్మాణ సంస్థ: రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: వెంకట్ ఉప్పుటూరి
దర్శకుడు: గౌరీ శంకర్
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మారిశెట్టి అనీష్
డిఓపి : ఎదురురోలు రాజు
ఎడిటర్: వంశీ అట్లూరి
పి.ఆర్.ఒ : వంశీ కాకా



