‘జయంత్ అండ్ ది జింగో పెన్’ లాంటి మంచి చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తణికెళ్ల భరణి
‘జయంత్ అండ్ ది జింగో పెన్’ లాంటి మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి – ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, తెలుగు ఎక్స్పరిమెంట్స్ సాయి కృష్ణ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో..
తణికెళ్ల భరణి మాట్లాడుతూ .. ‘పిల్లలందరూ కలిసి చూసే ఓ మంచి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. పిల్లల కోసం మంచి సందేశం ఇచ్చేలా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ మూవీని తెరకెక్కించారు. దివ్య గారు, ప్రవీణ్ గారు ఈ మూవీని గొప్పగా నిర్మించారు. జయంత్ అద్భుతమైన కుర్రాడు. పిల్లాడికి బంగారు భవిష్యత్తు ఉంది. రానున్న కాలంలో మంచి నటుడు అవుతాడని కచ్చితంగా చెప్పగలను. మంచి సందేశంతో నవీన్ ఈ మూవీని తెరకెక్కించారు. ఇలాంటి మంచి చిత్రం కచ్చితంగా విజయం అవ్వాలి.. కచ్చితంగా సక్సెస్ అవుతుంది’ అని అన్నారు.
కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘పిల్లలతో చేసే మంచి చిత్రాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలో జయంత్ గొప్పగా నటించాడని అర్థం అవుతోంది. ప్రవీణ్ గారు మల్టీటాలెంటెడ్‌గా కనిపిస్తున్నారు. నవీన్ గారు ఈ మూవీని గొప్పగా తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. ఒకప్పుడు మన దగ్గర ఏడాదికి యాభైకి పైగా పిల్లల చిత్రాలు వస్తుండేవి. ఇలాంటి మంచి సినిమాల్ని అందరూ ఆదరించాలి’ అని అన్నారు.
ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ లాంటి చిత్రాన్ని నిర్మించడం గొప్ప విషయం. పిల్లల కోసం మంచి సందేశంతో సినిమాని నిర్మించిన ప్రవీణ్ గారికి ధన్యవాదాలు. నేను లెక్కల మాస్టారుగా పని చేశాను. ఇలాంటి మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి మంచి మూవీని పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ ఇలా అందరూ చూడాలి. పిల్లల్లో ఉండే ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించి వాటికి తగ్గట్టుగా మార్గదర్శకం చేయాలి. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఎమోషనల్ స్టోరీ. ఇలాంటి మంచి చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయాలి. చిల్డ్రెన్స్ డే స్పెషల్‌గా నవంబర్ 14న మా సినిమా రాబోతోంది’ అని అన్నారు.
ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంలో ట్యూన్స్, డైలాగ్స్, పాటలు రాసే అవకాశం రావడం నా అదృష్టం. మాకు మంచి సంగీతాన్ని అందించిన మోహిత్ గారికి, మంచి విజువల్స్ ఇచ్చిన కెమెరామెన్ ఆండ్రూ గారికి థాంక్స్. మలయాళం నుంచి రీమేక్ రైట్స్ తీసుకుని.. ఈ సినిమాని ఇక్కడకు వరకు తీసుకు వచ్చే క్రమంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఇదొక మంచి మ్యూజికల్, మెసెజ్ ఓరియెంటెడ్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. మా సినిమాని రిలీజ్ చేస్తున్న ఏషియన్ సురేష్ గారికి థాంక్స్. బాలల దినోత్సవం సందర్భంగా మా మూవీ నవంబర్ 14న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
ఆశిష్ గాంధీ మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంలో నేను ఒక డిఫరెంట్ పాత్రను పోషించాను. జయంత్‌కి మంచి భవిష్యత్ ఉంది. ఇందులో సాంగ్స్ ఎంతో ఫ్రెష్‌గా ఉంటాయి. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ఈ చిత్రం రాబోతోంది. హిందీలో ‘తారే జమీన్ పర్’ ఉంది.. తెలుగులో ఇకపై ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఉంటుంది. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. పిల్లలు, పేరెంట్స్ అందరూ కలిసి ఈ సినిమాని చూడండి’ అని అన్నారు.
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాలోని కొన్ని సీన్స్ చూశాను. ఆగస్ట్ 15కి ‘ఖడ్గం’ మూవీ ఎలా రిపీట్ అవుతుందో.. ఇకపై నవంబర్ 14కి ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఈ చిత్రం రిపీట్ అవుతుంది. జయంత్ అద్భుతంగా నటించాడు. కచ్చితంగా జయంత్ స్టార్ అవుతాడు. పిల్లలు, టీచర్స్, పేరెంట్స్ అందరూ ఈ మూవీని చూడండి’ అని అన్నారు.
దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌లో దివ్య గారు, ప్రవీణ్ గారు ఎంతో సహకరించారు. ఈ మధ్య పిల్లలకు సంబంధించిన చిత్రాలు రావడం లేదు. జయంత్ గొప్ప ఆర్టిస్ట్. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్‌లో చెప్పేస్తుంటాడు. డైలాగ్ డెలివరీ, డిక్షన్‌లోనూ వేరియేషన్స్ చూపిస్తుంటాడు. మోహిత్ మంచి మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలో ప్రవీణ్ గారి సాహిత్యం, బాణీ, మాటలు గొప్పగా ఉంటాయి. సినిమాకి యాభై శాతం క్రెడిట్ నాది, మిగతా యాభై శాతం ప్రవీణ్ గారిదే. ఇలాంటి మంచి సినిమాల్ని ప్రోత్సహించడం మన అందరి సామాజిక బాధ్యత’ అని అన్నారు.
మాస్టర్ జయంత్ మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంతో నన్ను తెరపైకి తీసుకు వస్తున్న మా తల్లిదండ్రులకు థాంక్స్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నవీన్ అన్నకి థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ మూవీలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. పిల్లలు, టీచర్స్, పేరెంట్స్ అందరూ తప్పకుండా ఈ సినిమాని చూడాలి. చిల్డ్రెన్స్ డే స్పెషల్‌గా నవంబర్ 14న మా మూవీని రిలీజ్ చేస్తున్నాం. అందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
బేబీ ఊహ మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన దివ్య గారు, ప్రవీణ్ గారికి థాంక్స్. మా సినిమా నవంబర్ 14న రాబోతోంది. అందరూ తప్పకుండా చూండి’ అని అన్నారు.
సహ నిర్మాత షఫి మాట్లాడుతూ .. ‘మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రవీణ్ గారు ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాని నిర్మించారు. పన్నెండేళ్ల నుంచి మా ప్రయాణం సాగుతోంది. ప్రవీణ్ తన కలను నెరవేర్చుకునేందుకు నమో జయం ప్రొడక్షన్స్‌ని ప్రారంభించారు. జయంత్లోని అద్భుతమైన ప్రతిభను ఈ చిత్రంలో అందరూ చూడబోతోన్నారు. నవంబర్ 14న రాబోతోన్న మా సినిమాని చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ .. ‘పోలీస్ ఆఫీసర్‌గా లాఠీ పట్టుకునే ప్రవీణ్ గారు కలం పట్టుకుని మాటలు రాశారు. దివ్య గారు, ప్రవీణ్ గారు తమ బిడ్డ జయంత్ కోసం ఎంతో కష్టపడ్డారు. నవీన్ గారు ఈ మూవీని గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ .. ‘నవీన్ గారు నాకు మంచి పాత్రను ఇచ్చారు. ప్రవీణ్ గారు తన బిడ్డ జయంత్ కోసం సినిమా తీసినా.. ఓ గొప్ప చిత్రాన్ని నిర్మించారు. ఇందులోని కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సత్యం రాజేష్ మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రీకరణ ఎంతో సరదాగా సాగింది. జయంత్‌ని ఓ సీన్లో నిజంగానే కొట్టాను. బాధను భరించి జయంత్ గొప్పగా నటించాడు. నా కెరీర్లో ఇది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది. ఈ మూవీని పిల్లలు, పేరెంట్స్ అందరూ కలిసి చూడాలి. ఇలాంటి మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి’ అని అన్నారు.



