దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తీక్ జయంతి, శ్రీష నులు హీరో హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ నటులు అనితా చౌదరి, రవివర్మ, జయప్రకాష్, కాశీ విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ సింగిల్‌గా విడుదలైన ‘రింగుడు రింగుడు’ ఆల్రెడీ యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. పాటలు, పోస్టర్లు అన్నీ కూడా ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేశాయి. ఇక ఈ క్రమంలో దీపావళి సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
దీపావళి విషెస్ చెబుతూ ‘రాయవలస’ టీం రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో ఇంటెన్స్ లుక్ చూస్తుంటే ఓ రేంజ్‌లో యాక్షన్ ఉండబోతోందని అర్థం అవుతోంది. ఈ పవర్ ఫుల్ పోస్టర్ సినిమా రేంజ్‌ని చూపిస్తోంది. ఇందులో హీరో కార్తీక్ జయంతి మాస్ అవతారంలో అందరినీ మెప్పించేందుకు రెడీగా ఉన్నారు. ఈ మూవీని డిసెంబర్ 11న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఈ చిత్రానికి అర్జున్ బాల మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ పాటలకు సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తీక్ జయంతి పాటలు పాడారు. ఈ సినిమాకి వి.ఆర్.కె. నాయుడు (కిట్టు) కెమెరామెన్‌గా, గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. డిసెంబర్ 11న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
నటీనటులు కార్తీక్ జయంతి, శ్రీషా నులు, అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవివర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధరావు, కంచరపాలెం రాజు, సుహాసన్, వివేక్ వర్ధన్, మృదుల, గాంధీ, లక్ష్మణ్, లండన్ తదితరులు
సాంకేతిక బృందం
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాధిక జయంతి
నిర్మాత: గోపీ కృష్ణ జె
కథ, మాటలు: రాఖీ ఏ
సంగీతం: అర్జున్ బాల
ఛాయాగ్రహణం: వి.ఆర్.కె. నాయుడు (కిట్టు)
ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్.
ఫైట్స్: మల్లేష్ షాలియన్
కొరియోగ్రఫీ: రాజ్ పైడే
కాస్ట్యూమ్ డిజైనర్లు: రూప, కిరణ్
ప్రొడక్షన్ డిజైనర్: సాయి
పీఅర్ఓ: సాయి సతీష్



