‘తొలి ప్రేమ కథ’ టీజర్ చాలా నచ్చింది. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. అందరూ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ శైలేష్ కొలను
సాత్విక్ వర్మ, అనీ హీరో, హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘తొలి ప్రేమ కథ’. లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కె నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. హీరో ఆకాష్ పూరి, డైరెక్టర్ శైలేష్ కొలను ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.
టీజర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. ‘తొలి ప్రేమ కథ’ కరెక్ట్ టైమ్‌లో మూడ్ ఆఫ్ ది సీజన్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలోనే ఈ సినిమా వస్తోంది. టీజర్ చూస్తుంటే చాలా హాయిగా ఉంది. చాలా జెన్యూన్‌గా, నేచురల్‌గా ఉంది. సాత్విక్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. తను చాలా కష్టపడ్డాడు. నాకు ఈ టీజర్ చాలా నచ్చింది. అలాగే ఇందులో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా అద్భుతంగా అనిపించాయి. ధ్రువన్ అద్భుతమైన మెలోడీ ఇచ్చాడు. ఈ సినిమా కచ్చితంగా థియేటర్లో చూస్తాను. అలాగే ఇందులో చివర్లో వినిపించిన డైలాగ్స్ కూడా నాకు చాలా నచ్చాయి. పర్ఫార్మెన్స్లో చాలా సహజంగా ఉన్నాయి. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. అందరూ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను.
ఆకాష్ పూరి మాట్లాడుతూ..‘తొలి ప్రేమ కథ’ విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సాత్విక్, అన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్లతో కలిసి పని చేశాను. ఇద్దరూ కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మర్స్. టీజర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను.
హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. మా సినిమాని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. శైలేష్ గారికి, హీరో ఆకాష్ పూరి గారికి ధన్యవాదాలు. వాళ్లు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆకాష్ అన్న నా ఈవెంట్లో ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ. దీనికి కారణం ధ్రువన్ గారు అందించిన అద్భుతమైన మ్యూజిక్. అలాగే మా నిర్మాత, దర్శకుడు చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. అందరూ కూడా మా సినిమాని సపోర్ట్ చేసి ఘనవిజయం చేయాలని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి లక్ష్మణ్ అల్లూ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ కథ అనుకున్నప్పుడే సాత్విక్ అన్నీ యాక్టర్స్‌గా ఊహించుకున్నాను. అలాగే ఇందులో విజువల్స్, మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటాయి. చాలా అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సినిమాని షూట్ చేశాను. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. మా సినిమాని మీరందరూ సక్సెస్ చేసి, థియేటర్లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.
ఆర్.ఆర్. ధ్రువన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమా టీమ్ అందరూ కూడా పోస్టర్‌పై ‘ఆర్.ఆర్. ధ్రువన్ మ్యూజికల్’ అని వేశారు. కచ్చితంగా ఈ సినిమా చాలా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. మా సాయి గారికి, కృష్ణ గారికి, హీరో గారికి అందరికీ ధన్యవాదాలు. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. తప్పకుండా మీరందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో సినిమా యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
నటీనటులు: సాత్విక్ వర్మ, అనీ
సాంకేతిక బృందం:
సమర్పణ: లిఖిత్, ఆదిత్య
దర్శకత్వం: సాయి లక్ష్మణ్ అల్లు
నిర్మాత: లతా కె
క్రియేటెడ్ బై: తులసి కృష్ణ ఏడ్ల
సంగీతం: ఆర్.ఆర్. ధ్రువన్
కథ: ithu
సినిమాటోగ్రఫీ: రామ్ కంధ
లిరిక్స్: ఆర్.ఆర్. ధ్రువన్, అలరాజు
కొరియోగ్రఫీ: సునీల్ పొన్నం
స్టంట్స్: నందు
ఎడిటర్: హరి శంకర్
కలరిస్ట్: వెంకట్
పబ్లిసిటీ డిజైన్స్: మాయాబజార్
పీఆర్ఓ: తేజస్వి సజ్జా



