కమల్ హాసన్ ‘సండియార్’.. పవర్‌ఫుల్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

0
5
Kamal Haasan Sandiyar First Look Poster
Kamal Haasan Sandiyar First Look Poster

కమల్ హాసన్, ఎస్.యు. అరుణ్ కుమార్, ఆర్. మహేంద్రన్, ఆర్‌కేఎఫ్‌ఐ, టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మూవీ టైటిల్ ‘సండియార్’.. పవర్‌ఫుల్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (ఆర్‌కేఎఫ్‌ఐ), టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కమల్ హాసన్ గతంలో ఎన్నడూ చూడని రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు.

ఈ చిత్రానికి పవర్‌ఫుల్‌గా ‘సండియార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కమల్ హాసన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, గ్రే గడ్డంతో, చిన్నగా కత్తిరించిన హెయిర్‌స్టైల్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. డార్క్ బ్రౌన్ షర్ట్ ధరించిన ఆయన ఓ వాహనం కిటికీకి ఆనుకుని, నేరుగా ముందుకు చూస్తూ ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తునారు. ఆ వాహనంపై కనిపిస్తున్న రక్తపు మరకలు పోస్టర్‌కు రా అండ్ గ్రిట్టీ ఫీల్ తీసుకొచ్చాయి. వైలెన్స్ మధ్య సాగే ఓ బలమైన పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నారనే ఆసక్తిని ఈ పోస్టర్ కలిగిస్తోంది.

‘సండియార్’ అనే టైటిల్‌ వినగానే భయంలేని, ధైర్యవంతమైన, శక్తిమంతమైన వ్యక్తి గుర్తుకొస్తాడు. కమల్ హాసన్ పోషిస్తున్న పాత్రకు ఈ టైటిల్ పర్ఫెక్ట్. ఆయన ఇంటెన్స్ లుక్, ప్రశాంతంగా కనిపిస్తూనే భయపెట్టే బాడీ లాంగ్వేజ్.. రాజీ పడని మనస్తత్వం, బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రను సూచిస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్‌తోనే సినిమాలోని పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చారు. దీంతో యాక్షన్‌తో నిండిన ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

‘సేతుపతి’, ‘చిత్తా’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సునీల్ కె.ఎస్. సినిమాటోగ్రాఫర్‌గా, అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా, అమృతా రామ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. సి.ఎస్. బాలచందర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుండగా, ఎస్. డిస్నీ కో-ప్రొడ్యూసర్‌గా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.

ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, కమల్ హాసన్ పవర్‌ఫుల్, ఫియర్స్ అవతార్‌లో కనిపించడంతో ‘సండియార్’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

నటీనటులు: కమల్ హాసన్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: ఎస్.యు. అరుణ్ కుమార్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్
బ్యానర్లు: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
పీఆర్ఓ: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here