విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ నుంచి ‘నాన్నలా లోకములో’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్
కంటెంట్ బేస్డ్ చిత్రాలతో విజయ్ ఆంటోని ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. ఆయన ప్రస్తుతం ‘నాన్న కుట్టి’ అంటూ మరోసారి ఆడియెన్స్‌ని మెప్పించేందుకు రెడీ అయ్యారు.జయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ము. మారన్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని నవంబర్ 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో బజ్‌ను పెంచేశాయి.
‘నాన్నలా లోకములో’ అంటూ సాగే ఈ ఎమోషనల్ సాంగ్ అందరినీ కదిలించేలా ఉంది. విజయ్ ఆంటోని బాణీ.. భాష్య శ్రీ సాహిత్యం.. మౌష్మీ నేహా గాత్రం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నాన్న గొప్పదనం చాటి చెప్పేలా సాగే ఈ పాట తెరపై కంటతడి పెట్టించేలా ఉండబోతోందని అర్థం అవుతోంది.
ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేయగా, విజయ్ ఆంటోనీ సంగీతం అందించడంతో పాటు ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు. ఎ. రాజా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు.
యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, భావోద్వేగ కథనం, హృద్యమైన సంగీతం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ‘నాన్న కుట్టి’ చిత్రం రానుంది. నవంబర్ 20న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
తారాగణం : విజయ్ ఆంటోని, ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచయిత & దర్శకుడు: ము. మారన్
నిర్మాత: మీరా విజయ్ ఆంటోని
సహ నిర్మాత: సర్వంత్ రామ్ క్రియేషన్స్ (రామాంజనేయులు జవ్వాజి)
సంగీతం: విజయ్ ఆంటోని
లిరిక్స్ : భాష్యశ్రీ
సినిమాటోగ్రఫీ: రాజీవ్ రాజేంద్రన్
ఎడిటర్: విజయ్ ఆంటోని
ప్రొడక్షన్ డిజైనర్: ఎ రాజా
కాస్ట్యూమ్స్: జి అనూష మీనాక్షి
PRO: సాయి సతీష్



