ది ట్రైటర్స్ తెలుగు: శ్రావ్య వర్మే ఆ షోలోని పరుల్ గులాటీనా? ఆమె ‘గట్ ఫీలింగ్’పై నెట్టింట చర్చ!

0
5

ది ట్రైటర్స్ తెలుగు: శ్రావ్య వర్మే ఆ షోలోని పరుల్ గులాటీనా? ఆమె ‘గట్ ఫీలింగ్’పై నెట్టింట చర్చ!

ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ ది ట్రైటర్స్ తెలుగు*లో ఆసక్తికరమైన కంటెస్టెంట్‌గా మారుతున్నారు. తన అనుమానాలను ధైర్యంగా వ్యక్తం చేయడం, పదేపదే తన ‘గట్ ఫీలింగ్‌’ను నమ్ముతున్నానని చెప్పడం ద్వారా ఆమె ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా రెడ్డిట్‌లో జరిగిన చర్చలో, హిందీ వెర్షన్ ది ట్రైటర్స్ సీజన్ 2లో పాల్గొన్న పరుల్ గులాటీతో శ్రావ్య ఆటతీరును పోలుస్తూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఈ పోలికకు ప్రధాన కారణం.. ఇద్దరూ తమ అనుమానాల విషయంలో బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేయడం. ఆటలో జరుగుతున్న పరిణామాలను తమదైన కోణంలో విశ్లేషిస్తూ, తమకు కలిగిన అనుమానాలపై గట్టిగా నిలబడటం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ‘రింగ్ ఆఫ్ డౌట్’ టాస్క్‌లో శ్రావ్య ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం, తన అంతరాత్మ చెప్పిందే నమ్ముతాననే ఆమె వైఖరి చర్చకు దారితీస్తున్నాయి.

మోసాలు, రహస్యాలు, మారుతున్న పొత్తుల చుట్టూ సాగే ఈ గేమ్‌లో సరైన అంచనాలు వేయడం ఎంత ముఖ్యమో, తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. శ్రావ్య తన అనుమానాలను ధైర్యంగా వ్యక్తం చేయడాన్ని కొందరు ఆమె పరిశీలనా సామర్థ్యంగా, వ్యూహాత్మక ఆలోచనగా చూస్తుంటే.. మరికొందరు ఆమె కేవలం తన ఇన్‌స్టింక్ట్‌పై ఆధారపడి ముందుకెళ్తున్నారా అని ఆసక్తిగా గమనిస్తున్నారు.

మరి శ్రావ్య వర్మ ‘గట్ ఫీలింగ్’ ఆమెకు గేమ్‌లో అతిపెద్ద బలంగా మారుతుందా? లేక అదే ఆమెను తప్పుదోవ పట్టిస్తుందా? ప్రతి ‘రింగ్ ఆఫ్ డౌట్’తో కొత్త అనుమానాలు, ఆరోపణలు, మారుతున్న సమీకరణాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. శ్రావ్య అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది ఆసక్తికరంగా మారింది.

SOL Productions నిర్మించిన ది ట్రైటర్స్ తెలుగు ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియోతో పాటు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు (IST) కొత్త ఎపిసోడ్‌లు విడుదలవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here