హ్యాపీ బర్త్ డే టు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ..ప్రభాస్

0
5
HAPPY BIRTHDAY TO INDIA’S BIGGEST SUPERSTAR PRABHAS!
HAPPY BIRTHDAY TO INDIA’S BIGGEST SUPERSTAR PRABHAS!

హ్యాపీ బర్త్ డే టు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ..ప్రభాస్

బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన “బాహుబలి” ప్రభాస్
పాన్ ఇండియాకు తెలుగు సినిమాను నడిపిస్తున్న నాయకుడు (సలార్) ప్రభాస్
తన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచే సైనికుడు (ఫౌజీ) ప్రభాస్
టాలీవుడ్ ను కొత్త యుగంలోకి తీసుకెళ్తున్న ‘కల్కి’ ప్రభాస్
డార్లింగ్స్ గర్వపడేలా చేయాలనేదే ఆయన “స్పిరిట్”
క్రేజ్, స్టార్ డమ్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్

అలుపులేకుండా భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ తన అభిమానులను, ప్రేక్షకులను సంతోషపెడుతున్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్. ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ భారతీయ సినిమా కీర్తిని కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ 24 ఏళ్లుగా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. అందరినీ ప్రేమించే తత్వమే ప్రభాస్ ను అందరూ ఇష్టపడే డార్లింగ్ లా మార్చేసింది. స్టార్ గా ప్రభాస్ స్టామినా బాక్సాఫీస్ రికార్డులు చెబితే, అందరూ ప్రేమగా పిలిచే డార్లింగ్ అనే మాట వ్యక్తిగా ఆయన గొప్పదనం చూపిస్తుంది. ప్రభాస్ కొత్త సినిమా వచ్చిందంటే అది ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు మరో చరిత్రను లిఖించినట్లే. రెబల్ స్టార్ భారీ లైనప్, ఆ సినిమాల్లో శ్రమతో, అంకితభావంతో, నటనా ప్రతిభతో తను చేస్తున్న క్యారెక్టర్స్, బ్యాక్ టు బ్యాక్ ఈ హ్యూజ్ మూవీస్ చేసేందుకు ఆయన పడుతున్న కష్టం…ఇవన్నీ ప్రభాస్ ను మరో స్టార్ అందుకోలేనంత ఎత్తులో నిలబెడుతున్నాయి. ఆయన అభిమానులు గర్వించేలా చేస్తున్నాయి.

పాన్ ఇండియా స్టార్ డమ్ దాటేసి గ్లోబల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన నటించే ప్రతి సినిమా ఎల్లులు దాటి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. ప్రభాస్ లా ప్రాంతీయ సినిమా హద్దులు దాటి గ్లోబల్ రేంజ్ కు వెళ్లిన స్టార్ హీరోస్ చాలా కొద్దిమందే కనిపిస్తారు. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ పాన్ ఇండియా జర్నీ దిగ్విజయంగా కొనసాగుతోంది. థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్ బిజినెస్..ఇలా ఏ విషయంలో చూసినా ప్రభాస్ మరే స్టార్ హీరో అందుకోలేనంత స్థాయికి చేరుకున్నారు.

ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ స్టార్స్ తో పోటీ పడేంతగా నార్త్ లో కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఛరిష్మా ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అందుకే బాలీవుడ్ లో తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు ప్రభాస్. తమిళ, మలయాళ, కన్నడలోనూ స్థానిక స్టార్ హీరోలతో ప్రభాస్ సినిమాలు పోటీ పడటం నిజమైన పాన్ ఇండియా ట్రెండ్ కు నిదర్శనంగా నిలుస్తోంది. ఓవర్సీస్ లోనూ ప్రభాస్ ఆకర్షణకు తిరుగులేదు. థియేట్రికల్, ఓటీటీ, ఇతర బిజినెస్ ల ద్వారా ప్రభాస్ సినిమాలు నిర్మాణ వ్యయానికి ఎన్నో రెట్ల లాభాలు ఆర్జిస్తున్నాయి. నిర్మాతలకు ప్రభాస్ సినిమాలు బెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ తీసుకొస్తున్నాయి. తన బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రెండు సార్లు సాధించిన ఏకైక స్టార్ ప్రభాస్. ఓవ‌ర్‌సీస్ మార్కెట్‌లో ప‌ది మిలియ‌న్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించిన తొలి హీరోగా ప్ర‌భాస్‌ రికార్డ్ క్రియేట్ చేశారు.

దేశం నలుమూలలా ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు, ఆయన సినిమాలను ఇష్టంగా చూసేవాళ్లున్నారు. ఓవర్సీస్ లో యూఎస్, యూకే, జపాన్..ఇలా ప్రతి దేశంలోనూ ప్రభాస్ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. తన సినిమాలకు ఆయా దేశాల్లో వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రభాస్ యూనివర్సల్ క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తుంటాయి. అందుకే ప్రభాస్ చేసే ప్రతి సినిమా నిజమైన పాన్ వరల్డ్ మూవీ అవుతోంది. స్టార్ గా ఎంత ఎదిగినా ఆయన గొప్ప వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు లేదు. సమాజ హితం కోరే ఏ కార్యక్రమానికైనా తన వంతు సపోర్ట్ అందించేందుకు ఎప్పుడూ ముందుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. డ్రగ్స్ వద్దని ప్రచారం చేసినా, ప్రకృతి విపత్తుల సమయంలో భారీ విరాళాలు ఇచ్చినా అది ఆయన మంచి మనసుకు అద్దం పడుతుంది. ప్రభాస్ ను అభిమానులే కాదు ఆయనతో పనిచేసిన ప్రతి నటీనటులు, టెక్నీషియన్స్ ఇష్టపడతారు. రీసెంట్ గా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ దర్శకుల విజన్ ను నమ్మే ప్రభాస్ లాంటి స్టార్ దొరకడం తన అదృష్టమని చెప్పారు.

అభిమానుల, ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో ప్రభాస్ తన భారీ పాన్ ఇండియా సినిమాల లైనప్ కంటిన్యూ చేస్తున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ, వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న కల్కి 2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించనున్న సలార్ 2 చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. ఫౌజీ సినిమా సమ్మర్ లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతోంది. అలాగే స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. కల్కి 2 ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే సలార్ 2 సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. మనందరికీ ఇష్టమైన ప్రభాస్ ఇలాగే మరెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు చేస్తూ, ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి కోరుకుంటూ విశెస్ తెలియజేద్దాం. హ్యాపీ బర్త్ డే టు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here