నవంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “సమ్మర్ హాలిడేస్”

0
8
Summer Holidays Set for a Grand Theatrical Release on November 6
Summer Holidays Set for a Grand Theatrical Release on November 6

పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేసేలా “సమ్మర్ హాలిడేస్” సినిమా ఉంటుంది – రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని

నవంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “సమ్మర్ హాలిడేస్”

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 6న “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – “సమ్మర్ హాలిడేస్” సినిమాకు సైన్ చేసినప్పుడు మొదట్లో ఈ సినిమాకు వర్క్ చేయడం ఈజీ అనుకున్నా కానీ ఈజీ కాదు చాలా హార్డ్ వర్క్ చేయాల్సివచ్చింది. సాంగ్స్ కు మీరు ఇస్తున్న రెస్పాన్స్ చూశాక హ్యాపీగా అనిపిస్తోంది. నా వరకు మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యింది. మా సినిమాను నవంబర్ 6న పెద్ద మనసు చేసుకుని థియేటర్స్ లో చూడాలని ప్రేక్షకుల్ని కోరుకుంటున్నాం. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. సినిమా చూస్తున్నంతసేపు మీ నోల్టాల్జిక్ మూవ్ మెంట్స్ గుర్తుకువస్తాయి. అన్నారు.

బాల నటుడు రోహన్ రాయ్ మాట్లాడుతూ – మా సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. మా స్నేహితులు అడిగితే సమ్మర్ కు అని చెప్పాను. ఆ తర్వాత దసరా హాలీడేస్ అని చెప్పాను. ఇప్పుడు నవంబర్ 6న అని చెబుతుంటే వాళ్లు నమ్మడం లేదు. ఖచ్చితంగా నవంబర్ 6న మా సినిమా రిలీజ్ కు వస్తోంది. మేము సక్సెస్ మీట్ జరుపుకోవాల్సిన టైమ్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నాం. మీరు మా సినిమా చూసి మీ ఆదరణ చూపిస్తారని కోరుకుంటున్నా. నవంబర్ 6న పక్కాగా థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.

డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ – మా “సమ్మర్ హాలిడేస్” సినిమా టీజర్ కు, సాంగ్స్ కు మీరు ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మేము మూవీని చూశాం. చాలా బాగా వచ్చింది. ఈ దీపావళి పండక్కి ఒక మంచి ఎంటర్ టైనర్ ను మీకు అందిస్తున్నాం. ఇది పిల్లల సినిమా అంటున్నారు గానీ మేము ఇద్దరు పిల్లలను తీసుకుని అందరికీ నచ్చేలా సినిమా చేశాం. అన్ని ఏజ్ గ్రూప్ ఆడియెన్స్ కు మా సినిమా నచ్చుతుంది. కుటుంబమంతా కలిసి చూడదగిన చిత్రమిది. మేము సినిమా చూసుకుని ఎంత హ్యాపీగా ఉన్నామో, మీరు థియేటర్ లో మా సినిమా చూసి బయటకు వచ్చేప్పుడు కూడా అంతే హ్యాపీగా వస్తారు. మంచి సినిమా చేశారని మీరే పది మందికి చెబుతారు. మా గుండెల్లో ఉన్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొన్నేళ్ల పాట మీ హృదయంలో ఉండిపోతుంది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మాటిస్తున్నాను. అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – అక్టోబర్ లోనే మా సినిమా రిలీజ్ కు కొన్ని డేట్స్ అనుకున్నాం కానీ కుదరలేదు. నవంబర్ 6న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాం. చిన్న చిత్రాలకు పబ్లిసిటీ, రిలీజ్ విషయంలో పరిమితులు ఉంటాయి. సినిమా బాగా చేయడంతో పాటు సరైన టైమ్ లో రిలీజ్ చేసుకోవడం కూడా ముఖ్యం. పెద్ద సినిమాల మీద వేసి ఇబ్బంది పడే కంటే మంచి రిలీజ్ డేట్ కు తీసుకురావాలని వెయిట్ చేశాం. రిలీజ్ డేట్స్ మార్చుకోవడం మాకూ ఇబ్బందిగానే ఉంది. కానీ మా సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. నవంబర్ 6న మా మూవీ మీ ముందుకు రాబోతోంది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్స్ లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తారు. రోహన్, అరుణ్ లీడ్ రోల్స్ చేశారు. ఇది పిల్లల సినిమా అంటున్నారు కానీ ఇది పర్పెక్ట్ నోల్టాల్జిక్ ఫిలిం. సినిమా చూస్తున్నప్పుడు పెద్దలకు వాళ్ల బాల్యం గుర్తొస్తుంది. వాళ్ల టీనేజ్ లో సమ్మర్ హాలీడేస్ లో వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లినప్పుడు ఎలాంటి జ్ఞాపకాలు ఉండేవో గుర్తుకు తెచ్చుకుంటారు. అందరికీ నచ్చేలా, అందరికీ కనెక్ట్ అయ్యేలా మూవీ ఉంటుంది. పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువ ఎంజాయ్ చేసే చిత్రమిది. అందరికీ వాళ్ల బాల్యాన్ని రెండు గంటల పాటు గుర్తుచేస్తాం. ఈ దీపావళికి మా సినిమా మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాం. చిన్న సినిమాల మనుగడ బాగుండాలంటే ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచేందుకు అనుమతి ఇవ్వకూడదని నా అభిప్రాయం. అన్నారు.

నటీనటులు – రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
డీవోపీ – సాయి ప్రకాశ్
మ్యూజిక్ డైరెక్టర్ – సింజిత్ యెర్రమల్లి
బ్యానర్ – ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ, డైరెక్టర్ – శ్రీకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here