జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు

0
2
Vangaveeti Radhakrishna Joins Janasena Party
Vangaveeti Radhakrishna Joins Janasena Party

జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు

 పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.

అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here