‘తత్వం’లో క్లైమాక్స్‌ను ఎవరూ గెస్ చేయలేరు: హీరో దినేష్ తేజ
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తత్వం’ త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మర్డర్ మిస్టరీ జానర్ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లేతో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం ‘తత్వం’. ఇటీవల విడుదల ఈ చిత్రం ట్రైలర్‌కు, పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. రేపు చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో దినేష్ తేజ బుధవారం పాత్రికేయులతో ముచ్చటించారు. థ్రియేటికల్ విడుదలకు సిద్దమైంది.
తత్వం సినిమాను ఒప్పుకోవడానికి రీజన్ ఏమిటి?
ఈ సినిమాలో ఎవరూ గెస్ చేయలేని ట్విస్ట్‌లు.. క్లైమాక్స్‌లో ఉండే ఎమోషన్.. తనకు తాను ఏమీ తెలుసుకున్నాడు తనకు ఏమీ తత్వం బోదపడింది అనే పాయింట్‌తో పాటు టోటల్ ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కొత్తగా అనిపించింది. రేపు థియేటర్లో జనాలు కూడా అదే ఫీలవుతారు.
ఇది ఎలాంటి కథ?
మూడనమ్మకంకు నమ్మకం మధ్య ఓ సన్నని గీత ఉంటుంది. దాని చుట్టే ఈ కథ తిరగుతుంది. 2000వ సంవత్సరంలో నడిచే కథ ఇది.
ఈ సినిమా సమయంలో మీకు యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది?
ఈ సినిమాకు జరిగిన నెగెటివ్లతో అన్నీ ఈ సినిమాకు దిష్టి పోయింది అనుకుంటున్నాం. మా సినిమా కంటెంట్ చాలా గట్టిది. ఈ సినిమా ప్రమోషన్ టైమ్‌లో నాకు హీరోయిన్‌కు యాక్సిడెంట్ జరిగింది. నాకు ఇది సెకండ్ లైఫ్. డే వన్ రోజు కథ విన్నప్పుడు నాలో ఎలాంటి నమ్మకం ఉందే ఈ రోజుకు అంతకు మించి ఈ చిత్రం విజయంపై విశ్వాసం ఉంది. ఆడియన్స్‌కు సినిమా తప్పకుండా నచ్చుతుంది. అందరూ నన్ను నీ ఫ్రైడే ఎప్పుడూ నీ టైమ్ ఎప్పుడూ అంటుంటారు.. తప్పకుండా ఈసినిమాతో ఆ రోజు వస్తుంది. నిజాయితీగా నా పని నేను చేసుకుంటూ మంచి సినిమాల్లో నటిస్తాను. కొత్తదనం ఉన్న సినిమాలు తెలుగు ఆడియన్స్ ఆదరిస్తుంటారు. తప్పకుండా ఈ సినిమాను కూడా అదే కోవలో విజయాన్ని ఇస్తారని అనుకుంటున్నాను. ఈ సినిమాకు కథే మా ధైర్యం, ఆడియన్సే మా బలం. ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తే మా అందరిలో కూడా నమ్మకం కలుగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ అందరి మనసులను తాకుతుంది
మీరు ఎదురుచూస్తున్నకమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో వస్తుందని అనుకుంటున్నారా?
కమర్షియల్ సక్సెస్ ఒక్కటే చూడటం లేదు. కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు. ఈ కథ చెప్పాలని అనిపించి చేసిన సినిమా. ఇది కూడా నావెల్టీ కథ కాబట్టి చేశాను. ఇది నటుడిగా నాకు పూర్తి సంతృప్తి నిచ్చిన సినిమా ఇది. ఇలాంటి కథలు చేయడం వల్ల ఆడియన్స్‌లో మంచి రెస్పెక్ట్ వస్తుంది.
మీకు ఈ సినిమాలో పాత్ర పర్సనల్‌గా ఎంత వరకు శాటిస్ఫాక్షన్ ఇచ్చింది?
పర్సనల్‌గా నేను ఏ రోల్ చేసిన పూర్తి సంతృప్తిగానే చేస్తాను. హాండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను.
వెబ్‌సీరిస్‌లు ఒప్పుకోవడం లేదా?
ఓటీటీ వెబ్‌సీరిస్ ఆఫర్లు వచ్చాయి. అంత శాటిస్ఫాక్షన్ కథలు రాలేదు. అందుకే ఒప్పుకోలేదు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
హుషారు -2తో పాటు విజయనగరం బ్యాక్‌డ్రాప్‌తో ఓ యాక్షన్ డ్రామా చేశాను. సతీష్ వెగేశ్న కథా కేళి ఉంది
తత్వంతో మీకు ఎలాంటి గుర్తింప వస్తుందని అనుకుంటున్నారు?
ఈ సినిమా తరువాత కొత్త కథలతో వచ్చే రచయితలకు నేను కూడా ఒక ఆప్షన్‌గా ఉంటాననే నమ్మకం ఉంది. ఈ సినిమాకు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏ సినిమాకు ఫేస్ చేయలేదు.. దర్శక, నిర్మాతలు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ సినిమాను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు.



