“సమవర్తి” సినిమా ఎమోషన్, యాక్షన్ తో ఆకట్టుకుంటూ ప్రేక్షకులకు ఒక గ్రేట్ అడ్వెంచర్ ఫీల్ కలిగిస్తుంది – టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో సత్యదేవ్

0
2
Samavarthi Teaser launch Event
Samavarthi Teaser launch Event

“సమవర్తి” సినిమా ఎమోషన్, యాక్షన్ తో ఆకట్టుకుంటూ ప్రేక్షకులకు ఒక గ్రేట్ అడ్వెంచర్ ఫీల్ కలిగిస్తుంది – టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో సత్యదేవ్

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా “సమవర్తి” అనే ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. “సమవర్తి” సినిమాను రుద్ర పిక్చర్స్ బ్యానర్ & పంచభూత ప్రొడక్షన్స్, స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ఎడిటర్ ఆదిత్య మాట్లాడుతూ – “సమవర్తి” టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. ఈ మూవీ వరల్డ్ ఎలా ఉండబోతుందో టీజర్ లో కొంత పరిచయం మాత్రమే చేశాం. సినిమా చాలా బిగ్ స్పాన్ లో ఉంటుంది. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాం. అన్నారు.

డీవోపీ హర్ష మల్లికార్జున మాట్లాడుతూ – ఈ కథ చెప్పినప్పుడు ఒక పెద్ద బ్యానర్ లో నిర్మించాల్సిన స్పాన్ ఉన్న సినిమా అనిపించింది. అయితే మా ప్రొడ్యూసర్స్ కు మూవీ మేకింగ్ మీద ఉన్న ప్యాషన్ చూసినప్పుడు మా బ్యానర్ చిన్నది కాదు అనే ఫీల్ కలిగింది. సత్యదేవ్ అన్నను మీరు ఎలా చూడాలని అనుకుంటున్నారో ఈ సినిమాలో అలా చూస్తారు. ఇది నా మొదటి సినిమా కావడం హ్యాపీగా ఉంది. అన్నారు.

డీవోపీ దేవ్ దీప్ మాట్లాడుతూ – చాలా మంచి కథతో వస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో సత్యదేవ్ గారి పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. డీవోపీగా ఆయన పర్ ఫార్మెన్స్ ను చూసి సర్ ప్రైజ్ అయ్యాను. అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ – మా యంగ్ టీమ్ ను నమ్మి అవకాశం ఇచ్చిన మా హీరో సత్యదేవ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు మా ప్రొడ్యూసర్స్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేము. ఈ చిత్రంతో మనం హిట్ కొట్టబోతున్నామని కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ శశిధర్ మాట్లాడుతూ – సినిమా నిర్మించాలనే ఆలోచన నాకు లేదు. అయితే అజయ్ ఈ కథ చెప్పినప్పుడు ఇంప్రెస్ అయ్యాను, ఈ సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చాను. ఇప్పుడు ఈ వేదిక మీద చెబుతున్నా…నా లైఫ్ లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ “సమవర్తి” సినిమాను ప్రొడ్యూస్ చేయడమే. నాతో పాటు సినిమాను ప్రొడ్యూస్ చేసిన శివచరణ్ అన్న పూర్తి సపోర్ట్ అందించారు. శ్రీకాంత్ గారు కథ విని అడగగానే డేట్స్ ఇచ్చారు. ఎంతో ఇన్వాల్వ్ అయి మూవీలో నటించారు. మా మూవీకి వర్క్ చేసిన టీమ్ అంతా ప్యాషన్ తో పనిచేశారు. వాళ్ల వర్క్ చూశాకే నాకు సినిమా మీద నమ్మకం ఏర్పడింది. ఐపీఎల్ కప్ కొట్టడానికి విరాట్ కు 18 ఏళ్లు పట్టింది. సత్యదేవ్ అన్న ఈ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకోబోతున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయనకు తిరుగులేదు. డైరెక్టర్ అజయ్ తనకు కావాల్సిన ఔట్ పుట్ వచ్చేవరకు రాజీపడడు. “సమవర్తి” సినిమా థియేటర్స్ లో మ్యాజిక్ చేయబోతోంది. తెలుగు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మార్చేసే చిత్రమిది. అన్నారు.

ప్రొడ్యూసర్ శివచరణ్ రెడ్డి జక్కిడి మాట్లాడుతూ – మా సినిమాకు ప్యాషనేట్ టీమ్ దొరకడం సంతోషంగా ఉంది. సత్యదేవ్ గారి దగ్గర నుంచి శ్రీకాంత్ గారు, ప్రతి ఒక్కరూ బాగా పర్ ఫార్మ్ చేశారు. ప్రతి టెక్నీషియన్ సినిమా కోసం కష్టపడి పనిచేశారు. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాం. మా సినిమా పెద్ద హిట్ అవుతుంది. మా టీమ్ లోని ప్రతి ఒక్కరి కెరీర్ లో గుర్తుండిపోయే విజయం సాధిస్తుంది. మీరు ఎప్పటిలాగే యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ గానవి లక్ష్మణ్ మాట్లాడుతూ – మా మూవీ టీజర్ కు మీ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎగ్జైటింగ్ గా ఉంది. డైరెక్టర్ అజయ్ గారు ఈ కథ చెప్పినప్పుడు స్టోరీకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో నటించాలని బలంగా కోరుకున్నాను. మాది చిక్ మంగళూరు ప్రాంతం. చుట్టూ అడవులతో, జంతువులతో ఉన్న అందమైన ప్రదేశం. అడవి, అక్కడి నుంచి వచ్చే జంతువులతో మా ప్రాంతం వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలను మా నాన్న కథలుగా చెప్పేవారు. హ్యూమన్, నేచర్ వంటి అంశాలు ప్రధానంగా ఉన్న ఈ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు హ్యాపీగా అనిపించింది. మా టీమ్ తమ ప్యాషన్ తో ఈ కథకు ప్రాణం పోశారు. ప్రతిసారీ వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే సత్యదేవ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. అలాగే శ్రీకాంత్ గారికి మేమంతా అభిమానులం. ఆయనతో కలిసి నటించే అవకాశం ఈ సినిమా కలిగించింది. అన్నారు.

నటుడు మోహన్ భగత్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో రాజీ అనే పాత్రలో నటించాను. ఈ కథ నాకు తెలుసు. ఈ సినిమాతో సత్యదేవ్ పెద్ద విజయం సాధించబోతున్నారు. అజయ్ అండ్ టీమ్ కష్టపడటమే కాదు ఇష్టపడి పనిచేస్తారు. ఈ సినిమాకు అజయ్ పెద్ద ఆర్టిస్టులను తీసుకున్నారు. వాళ్లంతా తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకోబోతున్నారు. త్వరలోనే థియేటర్స్ లో మీ అందరినీ కలుస్తాం. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – ఆరంభం సినిమాతో నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. రెండేళ్లుగా సినిమాలు చేస్తున్నాను. బ్రోచేవారెవరురా సినిమా చూసి సత్యదేవ్ అన్నకు పెద్ద ఫ్యాన్ అయ్యాను. శ్రీకాంత్ గారు మాకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఇప్పటిదాకా యూత్ సినిమాలకు మ్యూజిక్ చేశాను. “సమవర్తి”తో మాస్, కమర్షియల్ సినిమాకు సంగీతం అందించే అవకాశం కలిగింది. అన్నారు.

డైరెక్టర్ అజయ్ నాగ్.వి. మాట్లాడుతూ – రెండేళ్ల క్రితం ఆరంభం అనే సినిమా చేశాం. సినిమాను క్రియేటివ్ గా చిత్రీకరించడమే మేకింగ్ అని నమ్మాం. అదే సినిమా జర్నీ అనుకునేవాళ్లం. కానీ సినిమా మార్కెటింగ్, రిలీజ్ అనే విషయాలు మాకు అర్థం కాలేదు. అయినా మా ఆరంభం సినిమాకు మంచి పేరొచ్చింది. మేము మరో సినిమా చేసే అవకాశం వస్తుందా, మళ్లీ మా టీమ్ అంతా కలిసి పనిచేస్తామా అనుకునే టైమ్ లో సత్యదేవ్ అన్న పిలిచి ఈ సినిమా అవకాశం ఇచ్చారు. ఆయనకు ఒక థియేట్రికల్ బ్లాక్ బస్టర్ సినిమా సమవర్తితో ఇవ్వబోతున్నాం. సత్యదేవ్ అన్న గురించి మేము ఇక్కడ ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు అనేది మీరు టీజర్ లో చూశారు. సత్యదేవ్ అన్న షూటింగ్ లో గాయపడ్డారు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఈ కథకు చాలా కీలకం. ఆయన క్యారెక్టర్ వల్లే కథ మొదలవుతుంది. మా ప్రొడ్యూసర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ల సహకారం వల్లే ఇంత భారీగా సినిమాను రూపొందించగలిగాము. మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ వినయ్ సినిమాకు పెద్ద సపోర్ట్ గా నిలబడ్డారు. కథలో చాలా కీలకంగా ఉండే పాత్రను అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు హీరోయిన్ గానవి లక్ష్మణ్. అన్నారు.

యాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ – డైరెక్టర్ అజయ్ మా ఇంటికి వచ్చి కథ చెప్పాను. కథ బాగా నచ్చింది. ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ నా సోదరుడి లాంటి సత్యదేవ్. ఈ చిత్రంలో నాది డిఫరెంట్ క్యారెక్టర్. స్పెషల్ గా ఉంటుంది. హీరో చేయాల్సిన క్యారెక్టర్ ఇది. ఇవన్నీ కాల్యుకులేట్ చేసుకుని ఈ సినిమాలో నటించాను. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లు యువకులు. పాతికేళ్ల వయసు లోపువాళ్లే. వాళ్లతో పనిచేయడం ఫ్రెష్ గా అనిపించింది. నా క్యారెక్టర్ గురించి ఎక్కువగా చెబితే రివీల్ అవుతుంది. కర్ణాటకలో ఈ సినిమా షూటింగ్ చేశాం. ఉదయం మొదలుపెడితే మళ్లీ తెల్లవారుఝాము వరకు షూటింగ్ చేశారు. ఈ టీమ్ ను చూస్తుంటే నా కెరీర్ ప్రారంభం రోజులు గుర్తొచ్చాయి. మేమూ మొదట్లో అలాగే కష్టపడేవాళ్లం. నా క్యారెక్టర్ సీన్స్ మామూలుగా పదిహేను రోజులు పడుతుంది. కానీ వీళ్లు ఐదారు రోజుల్లో చేశారంటే ఆశ్చర్యపోయాను. ఆర్టిస్ట్ సపోర్ట్ ఉంటే ప్రొడ్యూసర్ కు ఎంత మనీ సేవ్ చేయొచ్చు అనేది వీళ్ల టీమ్ ను చూస్తే తెలుస్తుంది. సత్యదేవ్ వండర్ ఫుల్ యాక్టర్. ఏ క్యారెక్టర్ లోనైనా లీనమైపోతాడు. ఆయనతో కలిసి ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో కొత్త సత్యదేవ్ మీకు కనిపిస్తారు. సత్యదేవ్ వన్ మ్యాన్ షో ఈ సినిమా. అన్నారు.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ – ఈ సినిమా కథ విన్నప్పుడు, నటిస్తున్నప్పుడు, ఎడిటింగ్ లో చూస్తున్నప్పుడు..ఈ సినిమాను మీరు నేను కలిసి థియేటర్స్ లో అనేక సార్లు చూస్తాం. ఈ సినిమాను మీరు పెద్ద హిట్ చేస్తారు అనే నమ్మకం కలిగింది. ఈ టీజర్ ను మీతో పాటు చూస్తున్నప్పుడు నా మనసులో సేమ్ ఫీలింగ్ రిపీట్ అయ్యింది. ఈ అకేషన్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఆడిషన్స్ ద్వారా సినిమాల అవకాశాలు పొందాను, నేను నటించిన సినిమాలు చూసి మరో సినిమా ఇచ్చారు. అంతేగానీ నేను ఇప్పటిదాకా ఎవర్నీ సినిమా చేయమని అడగలేదు. అందుకు నా మొహమాటమే కారణం. నా మొహమాటం వదిలిపెట్టి నాతో సినిమా చేయి అని నేను అడిగిన మొదటి వ్యక్తి డైరెక్టర్ అజయ్. నాకు సమవర్తి దక్కినట్లు.. మీ ప్రేమ విషయంలో అయినా, ఆఫీస్ లో మీ జీతం విషయమైనా మొహమాటం లేకుండా నిజాయితీగా అడగండి మీకు తప్పకుండా దక్కుతుంది. మీ అందరికీ మీ సమవర్తి దక్కాలని కోరుకుంటున్నా. ఆరంభం తర్వాత అజయ్ కు కొందరు హీరోల నుంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆయన ఎంతో హానెస్ట్ గా నాతో సినిమా చేశారు. అజయ్ అంత హానెస్ట్ పర్సన్ ను నేను చూడలేదు. ఇలాంటి బ్యూటిఫుల్ మూవీ నాకు దక్కడం సంతోషంగా ఉంది. సినిమా విషయంలో ఒక పిచ్చి ప్యాషన్ తో ఉంటాడు అజయ్. నేను డ్రీమ్ గా భావించిన షాట్స్, సీన్స్ నాతో అజయ్ ఈ చిత్రంలో చేయించాడు. టీజర్ రిలీజ్ కే సినిమా రిలీజ్ అన్నంత టెన్షన్ పడ్డాం. సమవర్తి సినిమాకు ఒక వండర్ ఫుల్ టీమ్ పనిచేసింది. ఈ టీమ్ మెంబర్స్ ఫ్రెండ్షిప్ కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి. దక్షిణ భారత్ లో ఎన్ని అడవులు ఉన్నాయో అన్నింట్లో మేము షూటింగ్ చేశాం. చిత్రీకరణ సమయంలో అడవి జంతువులను, పాములను చూశాం. మాకొక గ్రేట్ అడ్వెంచర్ అనిపించింది. థియేటర్స్ లో మీకూ అదే ఫీల్ కలిగిస్తుంది. మా మూవీలో నటించిన శ్రీకాంత్ అన్నకు స్పెషల్ థ్యాంక్స్. అన్నారు.

నటీనటులు – సత్యదేవ్, శ్రీకాంత్, దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గానవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
ఆర్ట్ డైరెక్టర్ – మొండ్రు రవికుమార్
కాస్ట్యూమ్ డిజైనర్ – ప్రియాంక రెబెకా శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైనర్ – ఉల్లాస్ హైదుర్
ఎడిటర్ – ఆదిత్య తివారి
డీవోపీ – హర్ష మల్లికార్జున, దేవ్ దీప్ గండికుండు
మ్యూజిక్ – సింజిత్ యెర్రమిల్లి
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – వినయ్ రెడ్డి మామిడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఉజ్వల్ బీఎం
ప్రొడ్యూసర్స్ – శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి
డైరెక్షన్ – అజయ్ నాగ్.వి
పీఆర్ఓ – సురేష్ (ఎస్. కె. మీడియా), వంశీ కాక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here