మెలోడీ బ్రహ్మ మణి శర్మ చేతుల మీదుగా ‘చకోర – Lunar Love Bird’ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘నా ప్రేమ దేవత..’ రిలీజ్

0
9
Na Prema Devatha Song From Chakkora Lunar Love Bird Out Now
Na Prema Devatha Song From Chakkora Lunar Love Bird Out Now

మెలోడీ బ్రహ్మ మణి శర్మ చేతుల మీదుగా ‘చకోర – Lunar Love Bird’ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘నా ప్రేమ దేవత..’ రిలీజ్

మాస్ పోయెట్రీతో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘చకోర – Lunar Love Bird’ చిత్రంలోని థర్డ్ సాంగ్ ‘నా ప్రేమ దేవత’ లిరికల్ వీడియోను మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఆవిష్కరించారు. High Joy Commercials బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ ఈ సినిమా తెరకెక్కింది. ‘చకోర – Lunar Love Bird’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.

ఆణిముత్యాల్లాంటి పాటలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ కు సాహిత్యం అందించారు. డాన్స్ మాస్టర్ రాజు (SDC) కొరియోగ్రఫీ చేశారు. ప్రముఖ గాయకుడు శ్రీకృష్ణ ఈ మెలోడీ సాంగ్ ని పాడారు. మణిశర్మ గారి దగ్గర ఎక్కువ కాలం టెక్నీషియన్ గా పని చేసిన అనుభవంతో మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ ఆయన మెలోడీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన ఈ మెలోడీ సాంగ్ యువతని ఊర్రూతలూగించేలా రూపొందించారు. ఈ సందర్భంగా మెలోడీ బ్రహ్మ – ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ చకోర మూవీ టీమ్ ని ప్రశంసించి తన ఆశీస్సులు అందజేశారు .

‘నా ప్రేమ దేవత..’ పాట ఎలా ఉందో చూస్తే – నా ప్రేమ దేవతల్లే నిన్నే చూస్తున్నా, గుండెల్లో కోవెల కట్టి ఆరాధిస్తున్నా, అచ్చంగా ఆకాశం నినుపంపిందే, అందాల చెలి జాబిలి, నా పూల మధుమాసం నీతోనే ముడిపడి ఉందే..అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.

నటీనటులు – శ్రవణ్, మలైకా టి వాసుపల్, అనుష్క లూహార్, యామిని, ఎల్ బి శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్, ప్రభావతి, మాధవి ప్రసాద్, జనార్దన్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, వంగపండు,వంశీ, సుమంత్, భాను, సూర్య మాకిరెడ్డి, తదితరులు

టెక్నీషియన్స్
————-
లొకేషన్స్ & ప్రమోషనల్ ఆఫీసర్ : సనపల చిన్నబాబు
క్యాషియర్ : హరీష్
లైన్ ప్రొడ్యూసర్: కపర్ది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : లాలం కన్నాజీ
ఎస్ఎఫ్ఎక్స్ : రఘునాధ్ కేమిశెట్టి
వీఎఫ్ఎక్స్ : చందు ఆది
డీటీఎస్ సౌండ్ ఇంజనీర్ : రాధాకృష్ణ
పాటలు : రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్
యాక్షన్ కొరియోగ్రఫీ – రామ్ కిషన్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
ప్రొడక్షన్ డిజైనర్ – రామ్ చరణ్ తేజ్ లాభాని
డీవోపీ – రుప్ప గోపీకృష్ణ
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్ డైరెక్టర్ – ప్రిన్స్ హెన్రీ
నిర్మాత – డా. చింతాడ హేమారావు
రచన, దర్శకత్వం – మంగా శ్రీనివాస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here