క్రేజీ ప్రాజెక్ట్ ‘లీసా’ (LEESA)లోకి ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ ఎంట్రీ!

0
10
Melody Brahma Mani Sharma Joins the Crazy Project 'LEESA'
Melody Brahma Mani Sharma Joins the Crazy Project 'LEESA'

క్రేజీ ప్రాజెక్ట్ ‘లీసా’ (LEESA)లోకి ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ ఎంట్రీ!

ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ విట్నెస్ చేయని విధంగా, సరికొత్త రెండు విభిన్న జోనర్ల కలయికతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న వినూత్న చిత్రం ‘లీసా’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు మరో భారీ బలం తోడైంది.
టాలెంటెడ్ నటి అనన్య నాగళ్ళ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర స్క్రిప్ట్, కాన్సెప్ట్ విన్న వెంటనే ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ గారు పూర్తి ఇంప్రెస్ అయ్యారు. కథలోని సరికొత్త వినూత్నతను మెచ్చి, స్వయంగా పాటలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటూ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మణిశర్మ గారి అద్భుతమైన స్వరాలు, నేపథ్య సంగీతం ‘లీసా’ చిత్రాన్ని మరో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ వినూత్న చిత్రానికి జవహర్ పవార్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సక్సెస్ఫుల్ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందిస్తూనే కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఓం సాయిరామ్ ఆర్ట్స్ బ్యానర్‌పై వెంకట్ దుగ్గిరెడ్డి మరియు ఐరాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఐల రామకృష్ణ ఇద్దరూ కలిసి అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here