“క్రేజీ కల్యాణం” సినిమా నుంచి ‘ కాకా ధూమ్ ధమాకా’ లిరికల్ సాంగ్ రిలీజ్

0
2
Kaaka Dhoom Dhamaka Song from Crazy Kalyanam
Kaaka Dhoom Dhamaka Song from Crazy Kalyanam

“క్రేజీ కల్యాణం” సినిమా నుంచి ‘ కాకా ధూమ్ ధమాకా’ లిరికల్ సాంగ్ రిలీజ్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “క్రేజీ కల్యాణం”. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి ‘కాకా ధూమ్ ధమాకా’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

పెళ్లి భరాత్ లో చేసే ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఈ సాంగ్ ను ఆడియెన్స్ కు నచ్చేలా రూపొందించారు. ఈ పాటను సురేష్ బొబ్బిలి మాస్ ట్యూన్ తో కంపోజ్ చేయగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా జంగి రెడ్డి పాడారు. సురేష్ బొబ్బిలి ర్యాప్ వోకల్స్ అందించారు. ఈశ్వర్ పెంటి అదిరే స్టెప్పులతో కొరియోగ్రఫీ చేశారు. ‘కాకా ధూమ్ ధమాకా’ ఎలా ఉందో చూస్తే – ‘కాకా ధూమ్ ధమాకా, లగ్గం ఇంట్ల పందిర్లే పడ్డాక, అరే బాపు రచ్చ లేపు , ఈడ గుమ్మిగూడాక, మూడు ముళ్ల సంబరాల ఢోలు బాజా కొట్టు, కొంగు ముళ్ల సంతోషాల లొల్లే సూపెట్టు..’ అంటూ ఈ పాట ఇన్ స్టంట్ గా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ‘కాకా ధూమ్ ధమాకా’ పాటలో అనుపమ పరమేశ్వరన్ చేసిన డ్యాన్స్ మూవ్ మెంట్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఆమె చేసిన స్టెప్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ కాబోతున్నాయి.

\నటీనటులు – నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – జె.గాయత్రి దేవి
ఆర్ట్ డైరెక్టర్ – సాయి కదిర
ప్రొడక్షన్ డిజైనర్ – శ్రీపాల్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అఖిల్ సాయి శ్రీమూర్తి
కొరియోగ్రాఫర్ – ఈశ్వర్ పెంటి
యాక్షన్ – డ్రాగన్ ప్రకాష్
లిరిక్స్ – గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్
ఎడిటర్ – శ్రావణ్ కటికనేని
డీవోపీ – శ్యామ్ దూపాటి
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
స్క్రీన్ ప్లే – శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్ఆర్)
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ – బూసం జగన్ మెహన్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్, డైరెక్షన్ – బద్రప్ప గాజుల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here