శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

0
55
‘Mugguru Kothulu’ First Look Poster Unveiled
‘Mugguru Kothulu’ First Look Poster Unveiled

శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ టైటిల్‌కి తగ్గట్టుగా ముగ్గురు హీరోల పాత్రల్ని చూపిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ముగ్గురు హీరోలు రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి కనిపిస్తున్నారు.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం జనాల్లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఈ సినిమాకి ఎస్. సుహాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి రాజ్ నోముల కెమెరామెన్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ఆడియెన్స్‌ని అలరిస్తామని టీం కాన్ఫిడెంట్‌గా ఉంది.

నటీనటులు : తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం తదితరులు

సాంకేతిక బృందం
సమర్పణ : జీఎస్ఆర్ క్రియేషన్స్
సహ సమర్పణ : స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్
నిర్మాత :శోభారాణి గరిమెల్ల
దర్శకుడు :కార్తీక్ గరిమెల్ల
కెమెరా :రాజ్ నోముల
సంగీతం :ఎస్. సుహాస్
ఎడిటింగ్ :జమీర్ షేక్
పీఆర్వో : సాయి సతీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here