“బాలన్ – ది బాయ్” సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి తమ బెస్ట్ విశెస్ అందించిన స్టార్ హీరోస్ అజయ్ దేవగణ్, సూర్య, నాగచైతన్య, రాజ్ బి శెట్టి

0
54
Balan The Boy
Balan The Boy

“బాలన్ – ది బాయ్” సినిమా ట్రైలర్ రిలీజ్, జూన్ 19న గ్రాండ్ పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

“బాలన్ – ది బాయ్” సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి తమ బెస్ట్ విశెస్ అందించిన స్టార్ హీరోస్ అజయ్ దేవగణ్, సూర్య, నాగచైతన్య, రాజ్ బి శెట్టి

గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “బాలన్ – ది బాయ్”. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే “బాలన్ – ది బాయ్” మూవీ ఫ్రాన్స్ లో జరిగే ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమై, గ్లోబల్ వేదికపై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైనప్పటి నుంచి ఈ సినిమా గ్లోబల్ గా ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా “బాలన్ – ది బాయ్” మూవీ హిందీ ట్రైలర్ ను హీరో అజయ్ దేవగణ్, తమిళ ట్రైలర్ ను హీరో సూర్య, తెలుగు ట్రైలర్ ను హీరో నాగచైతన్య, కన్నడ ట్రైలర్ ను హీరో రాజ్ బి శెట్టి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ట్రైలర్ తమకు బాగా నచ్చిందని చెబుతూ మూవీ టీమ్ కు ఈ స్టార్ హీరోలు బెస్ట్ విశెస్ అందించారు. హ్యూమన్ ఎమోషన్స్, మనదైన నేటివిటీతో సాగిన ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఆసక్తి కలిగించే సస్పెన్స్, ఎమోషన్ వంటి అంశాలతో ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తోంది.

ప్రమోషనల్ కంటెంట్ తో “బాలన్ – ది బాయ్” సినిమా ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం విశేషం.

Balan The Boy Stills (
Balan The Boy Stills (

నటీనటులు – చందు సలీమ్ కుమార్ తదితరులు

టెక్నికల్ టీమ్
—————-
ఎడిటర్ – వివేక్ హర్షన్
డీపీవో – షైజు ఖాలిద్
మ్యూజిక్ – సుషిన్ శ్యామ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన – జితూ మాధవన్
నిర్మాతలు – వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్
దర్శకత్వం – చిదంబరం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here